బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా అద్బుతమైన విజయంతో ప్రారంభించిన సంగతి తెలిసిందే. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆసీస్‌ను ఏకంగా 295 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్ దూసుకెళ్లింది.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తొలి టెస్టులో భారత్ గెలుస్తుందని తాను అస్సలు ఊహించలేదని రికీ పాంటింగ్ వెల్లడించాడు. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటైంది.
దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవడం కష్టమే అనుకున్నారు. కానీ బౌరత బౌలర్ల అద్బుతం చేయడంతో ఆసీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే కుప్పకూలింది. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు చెలరేగడంతో ఆసీస్ ముందు 534 పరుగుల భారీ టార్గెట్‌ను భారత్ ఉంచింది. అంతటి భారీ లక్ష్యాన్ని చేధించలేక ఆసీస్ చతికలపడింది.
అస్సలు ఊహించలేదు: రికీ పాంటింగ్
"ఆస్ట్రేలియాకు తొలి టెస్టులోనే ఊహించని పరాభావం ఎదురైంది. దాదాపు 300 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కచ్చితంగా వారు తీవ్ర నిరాశ చెంది ఉంటారు. టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకున్నప్పుడు అది సరైన నిర్ణయమేనా నన్ను అందరూ అడిగారు.
ఖచ్చితంగా అది సరైన నిర్ణయమేనని నేను చెప్పాను. ఈ స్టేడియంలో ఇప్పటివరకు నాలుగు టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. యాదృచ్చకంగా మొదట బ్యాటింగ్ చేసిన జట్టే నాలుగు సార్లు గెలిచింది. కాబట్టి గణాంకాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి.
తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటైనప్పటికి, బౌలర్లు అద్బుతంగా రాణించి మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నారు. బుమ్రా, సిరాజ్ బంతితో మ్యాజిక్ చేశారు. వారితో పాటు నితీష్ రెడ్డి కూడా బాగా రాణించాడు.
ఆసీస్‌పై భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. పెర్త్ వంటి కఠిన పరిస్ధితుల్లో భారత్ గెలుస్తుందని నేను అస్సలు అనుకోలేదు. కానీ భారత్ అంచనాలను తారుమారు చేసింది. అదే పెర్త్‌లోనే రుజువైంది" అని స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాంటింగ్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs AUS: ఒకే ఒక్క వికెట్.. చరిత్రకు అడుగు దూరంలో జస్ప్రీత్ బుమ్రా
Comments
Please login to add a commentAdd a comment