భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది చివరలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఆస్ట్రేలియాకు పయనం కానుంది. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య ఆసీస్‌తో టీమిండియా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది.
గత రెండు పర్యాయాలు కంగారులను వారి సొంత గడ్డపై ఓడించిన భారత్.. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2025 ఫైనల్‌కు చేరాలన్న ఈ సిరీస్‌కు భారత్‌కు ఎంతో కీలకం.
మరోవైపు ఈసారి భారత్‌పై ఎలాగైనా టెస్టు సిరీస్ విజయం సాధించి తమ 9 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఆసీస్ భావిస్తోంది. టీమిండియాపై టెస్టు సిరీస్‌ను ఆసీస్ చివరగా 2014-15లో సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈసారి టెస్టు సిరీస్‌లో టీమిండియాను ఆసీస్ కచ్చితంగా ఓడిస్తుందని పాంటింగ్ థీమా వ్యక్తం చేశాడు.
"భారత్-ఆసీస్ మధ్య పోటీ ఎల్లప్పుడూ ప్రత్యేకమే. ఈసారి కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగడం ఖాయం. గత రెండు పర్యాయాలు భారత్ చేతిలో ఓటమి చవిచూసిన ఆసీస్.. ఈ సారి మాత్రం సొంతగడ్డపై తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.
మళ్లీ ఐదు టెస్టుల సిరీస్‌ను తీసుకురావడం ఇరు జట్లకు కలిసొచ్చే ఆంశం. ఇది నిజంగా కీలకపరిణామంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే గత రెండు సార్లు కేవలం నాలుగు టెస్టులు మాత్రమే ఇరు జట్లు మధ్య జరిగాయి.
ఇప్పుడు మళ్లీ ఐదు టెస్టులు జరగనుండడంతో అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఈ సిరీస్‌లో డ్రాలు ఎక్కువగా ఉంటాయో లేదో తెలియదు. కానీ ఆస్ట్రేలియానే గెలవాలని కోరుకుటున్నాను. ఆసీస్ గెలిచేందుకు సలహాలు ఇస్తా.
ఏదో ఒక మ్యాచ్ డ్రా అయ్యే ఛాన్స్ ఉంది. కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే భారత్ గెలిచే ఛాన్స్ ఉంది. ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా. 3-1తో గెలుస్తుందని భావిస్తున్నా" అని రికీ పాంటింగ్ ఐసీసీ రివ్యూలో పాంటింగ్ పేర్కొన్నాడు.
కాగా 32 ఏళ్ల తర్వాత తొలిసారి భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్ టెస్టు సిరీస్ జరగనుంది. చివరగా 1991-92లో ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్ జరిగింది.ఈ ఏడాది నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment