టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసియా కప్-2023లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కింగ్ కోహ్లి.. వన్డేల్లో అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. నేటి మ్యాచ్‌తో వన్డేల్లో 112వసారి 50 ప్లస్ స్కోర్ (46 సెంచరీలు, 66 అర్ధసెంచరీలు) నమోదు చేసిన కోహ్లి.. ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ (112)తో సమంగా మూడో స్థానంలో నిలిచాడు.
ఈ జాబితాలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (145) అగ్రస్థానంలో ఉండగా.. శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కర (118) రెండో ప్లేస్‌లో ఉన్నాడు. ఈ జాబితాలో ప్రస్తుతం కోహ్లికి ముందు వీరిద్దరు మాత్రమే ఉన్నారు.
ఇదిలా ఉంటే, పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు వరసపెట్టి హాఫ్ సెంచరీలు బాదారు. తొలుత రోహిత్ (56), శుభ్‌మన్ గిల్ (58).. ఇవాళ రాహుల్ (82 నాటౌట్), కోహ్లి (76 నాటౌట్) అర్ధశతకాలు నమోదు చేశారు. ఫలితంగా టీమిండియా 43 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో ఇంకా 7 ఓవర్లు మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్ నమోదవ్వడం ఖాయంగా తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment