ఐపీఎల్-2024లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 106 పరుగుల తేడాతో ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఢిల్లీ విఫలమైంది. తొలుత కేకేఆర్ బ్యాటర్లు ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశారు.
కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఏకంగా 272 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో డీసీ 166 పరుగులకే ఆలౌటైంది. ఇక ఈ ఘోర ఓటమిపై మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ స్పందించాడు. తమ జట్టు ఆట తీరును తనకు చాలా బాధ కల్గించందని పాంటింగ్ అన్నాడు.
"ఈ మ్యాచ్‌లో మా జట్టు తొలి అర్ధభాగం ఆటను చూశాక సిగ్గేసింది. బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. చెత్త బౌలింగ్‌తో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 20 ఓవర్లు వేయడానికి ఏకంగా రెండు గంటలు సమయం పట్టింది. నిర్ణీత సమయానికి మేము 2 ఓవర్లు వెనుకబడ్డాము.
దీంతో సర్కిల్ వెలుపల నలుగురు ఫీల్డర్లతోనే చివరి రెండు ఓవర్లు బౌలింగ్ చేశాం. ఈ మ్యాచ్‌లో చాలా విషయాలు ఆమోదయోగ్యం కానివిగా ఉన్నాయి. ఈ టోర్నమెంట్‌లో ముందుకు వెళ్లాలంటే కచ్చితంగా మేము చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి. కేకేఆర్ బ్యాటర్లు కనీసం కనికరం లేకుండా ఆడారు.
పవర్‌ప్లేను వారు బాగా ఉపయోగించుకున్నారు. పవర్ ప్లేలోనే 88 పరుగులు రాబట్టారు. ఆట ఆరంభంలోనే మ్యాచ్‌పై పట్టు కోల్పోతే తిరిగి రావడం చాలా కష్టం. మా బౌలర్లు కమ్‌బ్యాక్ ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికి వారు మాత్రం మాకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు.
ఈ మ్యాచ్‌లో మేము ఓడిపోయినప్పటికీ పంత్ తన ఫామ్‌ను కొనసాగించడం మా జట్టుకు సానుకూలాంశమని" పాంటింగ్ పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment