టీమిండియాకు ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ పెద్ద తలనొప్పిగా మారాడు. భారత్ అంటే చాలు ఫార్మాట్‌తో సంబంధం లేకుండా చెలరేగిపోతున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో హెడ్ విధ్వంసకర సెంచరీతో మెరిశాడు.
ఈ మ్యాచ్‌లో 140 పరుగులు చేసిన హెడ్.. ఆసీస్ సిరీస్‌ను సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో శనివారం నుంచి గబ్బా వేదికగా ప్రారంభం కానున్న మూడో టెస్టులో ఈ డేంజరస్ ఆసీస్ బ్యాటర్‌ను అడ్డుకునేందుకు భారత్ ప్రత్యేక వ్యూహాలను రచిస్తోంది.
అతడిని ఎలాగైనా ఆదిలోనే పెవిలియన్‌కు పంపాలని రోహిత్ అండ్ కో భావిస్తోంది. ఈ నేపథ్యంలో హెడ్‌పై ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆసీస్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో హెడ్‌ను రికీ పోల్చాడు. అయితే ఇప్పటి నుంచే అతడిని 'గ్రేట్' అని పిలువద్దని అతడు అభిప్రాయపడ్డాడు.
"ట్రవిస్ హెడ్ గొప్ప క్రికెటర్లలో ఒకడిగా ఎదుగుతున్నాడు. అయితే, ఏదో ఒక ఇన్నింగ్స్ చూపి అతడిని గ్రేట్ క్రికెటర్ అని చెప్పలేము. కానీ అతడేం చేసినా అత్యద్భుతంగా చేస్తున్నాడు. జట్టు కోసం తాను చేయగలిగినంతా చేస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ ప్రశంసలకు తాను అర్హుడిని కానన్నట్లుగా హుందాగా ఉంటాడు.
హెడ్ బ్యాటింగ్ చేసే విధానం గిల్‌క్రిస్ట్ అప్రోచ్‌కు దగ్గరగా ఉంటుంది. బ్యాటింగ్ ఆర్డర్‌లో రెండు స్థానాలు ఎక్కువగా ఉన్నప్పటికీ గిల్లీ, హెడ్ ఒకేలా బ్యాటింగ్ చేస్తున్నారు. గిల్లీ ఆరు లేదా ఏడో స్ధానంలో బ్యాటింగ్ వచ్చి అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడగా.. ఇప్పుడు హెడ్ ఐదో డౌన్ వచ్చి అదే పనిచేస్తున్నాడు.
క్రీజులోకి వచ్చినప్పటి నుంచే పాజిటివ్ యాటిట్యూడ్‌తో బ్యాటింగ్ చేస్తాడు. అతడిలో ఔటవ్వతానన్న భయం కూడా కన్పించడం లేదు. ప్రతికూల ఫలితంతో అతడికి అస్సలు పనిలేదు. తనకు తెలిసిందల్లా ఒకటే. క్రీజులో ఉన్నంతసేపు పరుగులు రాబట్టడమే అతడి పని అని ఐసీసీ రివ్యూలో అతడు పేర్కొన్నాడు.
చదవండి: IND vs AUS: మూడో టెస్టుకు ఆసీస్ తుది జట్టు ప్రకటన.. వికెట్ల వీరుడు వచ్చేశాడు
Comments
Please login to add a commentAdd a comment