కోహ్లి అరుదైన రికార్డు.. ఎవరికీ అందనంత దూరంలో! | Virat Kohli Completes 10000 ODI Runs At No 3 After Ricky Ponting | Sakshi
Sakshi News home page

కోహ్లి అరుదైన రికార్డు.. పాంటింగ్‌ తర్వాత అతడే!

Published Fri, Mar 26 2021 4:57 PM | Last Updated on Fri, Mar 26 2021 5:47 PM

Virat Kohli Completes 10000 ODI Runs At No 3 After Ricky Ponting - Sakshi

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి(ఫొటో కర్టెసీ: బీసీసీఐ)

పుణె: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో మూడో స్థానంలో బ్యాటింగ్‌ దిగి 10 వేలకు పైగా పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఈ ఘనత సాధించాడు. కాగా ఆస్ట్రేలియా దిగ్గజం, మాజీ సారథి రికీ పాంటింగ్‌ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. తన కెరీర్‌లో వన్డే ఫార్మాట్‌లో మూడో నంబర్‌ బ్యాట్స్‌మెన్‌గా మైదానంలోకి దిగి పాంటింగ్‌  మొత్తంగా 12662 పరుగులు చేశాడు. 

ఇక కోహ్లి విషయానికొస్తే, పుణె వేదికగా జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో 66 పరుగుల వద్ద ఈ రన్‌మెషీన్‌ అవుటయ్యాడు. ఈ క్రమంలో మూడో స్థానంలో బ్యాటింగ్‌ వచ్చి 10046 పరుగులు పూర్తిచేసుకున్నాడు. కాగా పాంటింగ్‌(12662), కోహ్లి(10046) తర్వాత శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార్‌ సంగక్కర(9,747- 238 ఇన్నింగ్స్‌), దక్షిణాఫ్రికా ఆటగాడు జాక్వస్‌ కలిస్‌(7,774) తర్వాతి స్థానాల్లో ఉన్నాడు. ఇక ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(5421) ఒక్కడే ఈ జాబితాలో చోటుదక్కించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లి మరో రికార్డు కూడా నెలకొల్పాడు. 50- ఓవర్ల క్రికెట్‌లో, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌(5416) పేరిట ఉన్న రికార్డును అధిగమించి, అత్యధిక పరుగులు చేసిన ఐదో కెప్టెన్‌గా కూడా నిలిచాడు. 

చదవండి: బెన్‌స్టోక్స్‌కు అంపైర్‌ వార్నింగ్‌.. ఇంకోసారి ఇలా చేస్తే!
కోహ్లిలా దూకుడుగా ఉండటం మా విధానం కాదు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement