సెహ్వాగ్- రిక్కీ పాంటింగ్ (Photo Credit: BCCI/IPL)
IPL 2023 RCB Vs DC- Sehwag Slams Ricky Ponting: ‘‘ఒక జట్టు గెలిస్తే క్రెడిట్ కోచ్‌కి ఇస్తారు. మరి ఓడిపోయినప్పుడు జవాబుదారీగా ఉండాల్సింది కూడా వాళ్లే కదా! గతంలో అన్నట్లుగా ఇప్పుడు అదే మాట చెప్తున్నా.. రిక్కీ పాంటింగ్ కోచ్‌గా అద్భుతంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్‌కు తీసుకువెళ్లాడు. గత కొన్నేళ్లుగా వాళ్లు ప్రతి సీజన్‌లో దాదాపు ప్లే ఆఫ్స్ చేరుకుంటున్నారు. వీటన్నింటికీ క్రెడిట్ తీసుకుంటున్న రిక్కీ పాంటింగ్.. ఓటములకు కూడా బాధ్యత వహించాలి.
ఇదేమైనా టీమిండియా అనుకున్నావా
ఇదేమీ టీమిండియా కాదు.. గెలిచినప్పుడు క్రెడిట్ మాదే అని చెప్పుకొంటూ.. ఓడినపుడు మాత్రం ఇంకెవరినో నిందిస్తూ బాధ్యులను చేయడానికి! నిజానికి ఐపీఎల్‌లో కోచ్ పాత్ర సున్నా. ఆటగాళ్లకు తమపై తాము విశ్వాసం కోల్పోకుండా ప్రతి మేనేజ్‌మెంట్ అన్ని రకాలుగా అండగా నిలవాలి. అయితే, జట్టు మెరుగైన ప్రదర్శన చేసినపుడు మాత్రమే కోచ్‌కు విలువ వస్తుంది.
ప్రస్తుత సీజన్‌లో ఢిల్లీ ప్రదర్శన అత్యంత దారుణంగా ఉంది. ఇప్పటికైనా లోపాలు తెలుసుకుని.. వాటిని సరిచేసుకుంటేనే ముందుకు సాగే అవకాశం ఉంటుంది’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు.
పాంటింగ్ అసలేం చేస్తున్నాడు?
ఢిల్లీ కోచ్ రిక్కీ పాంటింగ్ అసలు ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదంటూ విమర్శలు గుప్పించాడు. గెలిచినపుడు క్రెడిట్ తీసుకోవడం కాదని.. వరుస ఓటములకు బాధ్యత వహించాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
ఐపీఎల్-2023లో ఆర్సీబీతో శనివారం నాటి మ్యాచ్‌లో ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ పరాజయాల సంఖ్య ఐదుకు చేరింది. తాజా ఎడిషన్లో ఇంతవరకు ఒక్క గెలుపు కూడా నమోదు చేయని జట్టుగా వార్నర్ బృందం అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఆడిన ఐదింటిలో ఐదు ఓడి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.
లోపాలు సవరించుకోవాలి
ఈ నేపథ్యంలో ఆర్సీబీతో మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమి అనంతరం క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ వీరూ భాయ్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. వరుస పరాజయాలకు కోచ్ రిక్కీ పాంటింగ్‌ను బాధ్యుడిని చేయాలని పేర్కొన్నాడు. ఇప్పటికైనా లోపం ఎక్కడుందో గమనించి.. పొరపాట్లు సరిచేసుకోవాలని సూచించాడు. లేదంటే చెత్త రికార్డులతో ఇంటిబాట పట్టక తప్పదని హెచ్చరించాడు.
చదవండి: గంగూలీ స్థాయి పెరిగింది.. కోహ్లి అలా... రవిశాస్త్రి ఇలా! అధికారం ఉండదంటూ..
సెంచరీతో చెలరేగిన బాబర్.. ఎవరికీ అందనంత ఎత్తులో!
Back to winning ways 🙌@RCBTweets register a 23-run win at home and clinch their second win of the season 👏👏
— IndianPremierLeague (@IPL) April 15, 2023
Scorecard ▶️ https://t.co/xb3InbFbrg #TATAIPL | #RCBvDC pic.twitter.com/5lE5gWQm8H
Comments
Please login to add a commentAdd a comment