టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ 2012లో అంతర్జాతీయ క్రికెట్‌లో వందో సెంచరీ కొట్టి.. శతక శతకాల ధీరుడిగా ప్రపంచ రికార్డు సాధించాడు. సమకాలీన క్రికెటర్లు ఎవరికీ సాధ్యం కాని ఫీట్ నమోదు చేసి.. శిఖరాగ్రాన నిలిచాడు. వన్డేల్లో 49, టెస్టుల్లో 51 సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ పేరిట ఉన్న ఈ రికార్డు బద్దలయ్యే అవకాశమే లేదని భావిస్తున్న తరుణంలో.. విరాట్ కోహ్లి అనే కుర్రాడు తెరమీదకు వచ్చాడు.
ఇప్పటికే వన్డేల్లో 50 శతకాలు బాదిన ఈ రన్‌మెషీన్.. సచిన్ రికార్డు బ్రేక్ చేశాడు. టెస్టుల్లో 29, టీ20లలో ఒక సెంచరీ బాది.. ఆల్‌టైమ్ రికార్డుకు ఎసరుపెట్టాడు. 35 ఏళ్ల వయసులోనూ ఫిట్‌నెస్‌కు మారుపేరుగా కొనసాగుతున్న కోహ్లి వరల్డ్‌కప్ టోర్నీల్లోనూ సత్తా చాటుతున్నాడు. వన్డే రారాజుగా కొనసాగుతున్నాడు. అయితే, ఇలాంటి రికార్డుల వీరుడికి తన ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ వన్డే వరల్డ్‌కప్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు లేదంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ మాథ్యూ హెడెన్.
భారత్ నుంచి ఇద్దరు లెజెండ్స్ మాత్రమే ఈ టీమ్‌లో స్థానం సంపాదించడానికి అర్హులు అన్నట్లుగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ జట్టులో ఆస్ట్రేలియా నుంచి అత్యధికంగా నలుగురిని ఎంపిక చేసుకున్న ఈ కంగారూ బ్యాటర్.. పాకిస్తాన్ నుంచి ఇద్దరి చోటు ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లి శ్రీలంకతో వన్డే సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. గౌతం గంభీర్ గైడెన్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు.
మాథ్యూ హెడెన్ ఎంచుకున్న గ్రేటెస్ట్ వన్డే వరల్డ్‌కప్ ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్
ఆడం గిల్‌క్రిస్ట్(ఆస్ట్రేలియా), వీరేంద్ర సెహ్వాగ్(ఇండియా), రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా- కెప్టెన్), సచిన్ టెండుల్కర్(ఇండియా), బ్రియన్ లారా(వెస్టిండీస్), జాక్వెస్ కలిస్(సౌతాఫ్రికా), వకాన్ యూనిస్(పాకిస్తాన్), వసీం అక్రం(పాకిస్తాన్), షేన్ వార్న్(ఆస్ట్రేలియా), ముత్తయ్య మురళీధరన్(శ్రీలంక), గ్లెన్ మెగ్రాత్(ఆస్ట్రేలియా).
చదవండి: SA20 2025: సౌతాఫ్రికా కెప్టెన్‌కు షాకిచ్చిన సన్‌రైజర్స్.. జట్టు నుంచి ఔట్
Comments
Please login to add a commentAdd a comment