విరాట్ కోహ్లి
ICC WC 2023- Kohli Eyes On Big Records: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లిని ఉద్దేశించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా రన్‌మెషీన్.. భారత దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ సెంచరీల రికార్డును బ్రేక్ చేయగలడని పేర్కొన్నాడు.
ఆరంభ మ్యాచ్‌లో ఆసీస్ మీద కోహ్లి అద్భుతంగా ఆడాడన్న రిక్కీ పాంటింగ్.. సెంచరీ చేజారిన లోటును తదుపరి మ్యాచ్‌లలో తీర్చుకుంటాడని అభిప్రాయపడ్డాడు. ఈ టోర్నీలో కనీసం రెండు శతకాలైనా బాదుతాడని ధీమా వ్యక్తం చేశాడు.
కోహ్లి, రాహుల్ పట్టుదలగా నిలబడి
కాగా చెన్నైలోని చెపాక్‌లో తొలి మ్యాచ్‌లోనే రోహిత్ సేన కష్టమ్మీద గెలిచిన విషయం తెలిసిందే. టాస్ ఓడి తొలుత ఫీల్డింగ్ చేసిన భారత్ కంగారూ జట్టును 199 పరుగులకే కట్టడి చేసింది. అయితే, స్వల్ప లక్ష్య ఛేదనలో 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కోహ్లి(85), కేఎల్ రాహుల్(97- నాటౌట్) పట్టుదలగా నిలబడి అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయం అందించారు. కాగా అంతర్జాతీయ వన్డేల్లో కోహ్లి ఇప్పటి వరకు 47 శతకాలు బాదాడు.
మరో మూడు సెంచరీలు చేస్తే
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పేరిట ఉన్న రికార్డు(49) బద్దలు కొట్టాలంటే కోహ్లి మరో మూడు సెంచరీలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో.. ది ఐసీసీ రివ్యూ పాడ్‌కాస్ట్‌లో ఇందుకు సంబంధించిన ప్రస్తావన రాగా.. ఆసీస్ లెజెండ్ రిక్కీ పాంటింగ్ స్పందిస్తూ.. ‘‘ఈసారి కోహ్లి కచ్చితంగా కనీసం రెండు సెంచరీలు చేస్తాడు.
కనీసం రెండు శతకాలు ఖాయం
ఒకవేళ అంతకు మించి రాణిస్తే కథ వేరేలా ఉంటది. కోహ్లికి ఇదే చివరి వన్డే వరల్డ్‌కప్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ అదే మైండ్‌సెట్‌తో గనుక బరిలోకి దిగితే పరుగుల దాహం తీర్చుకోకుండా వెనుదిరగడు.
ప్రస్తుతం కోహ్లి మంచి ఫామ్‌లో ఉన్నాడు. సచిన్ రికార్డును సమం చేస్తాడు లేదంటే బ్రేక్ చేసినా చేస్తాడు. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేసి ఈ వరల్డ్‌కప్‌ను చిరస్మరణీయం చేసుకుంటాడు’’ అని చెప్పుకొచ్చాడు.
చదవండి: వెళ్లి ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుకో పో బాబర్.. పాక్ కెప్టెన్‌పై ఫ్యాన్స్ ట్రోల్స్
Comments
Please login to add a commentAdd a comment