క్రికెట్ అభిమానలు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన వన్డే ప్రపంచకప్-2023కు గురువారం(ఆక్టోబర్ 5) తెరలేచింది. అహ్మాదాబాద్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మెగా టోర్నీ సెమీఫైనల్‌కు చెరే నాలుగు జట్లను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కకర్ ఎంచుకున్నాడు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లను సెమీఫైనల్ ఫేవరేట్‌లగా 'మాస్టర్ బ్లాస్టర్' ఎంపిక చేశాడు.
"భారత జట్టు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. అదే విధంగా వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసిన జట్టు కూడా చాలా సమతుల్యంగా ఉంది. కచ్చితంగా టీమిండియా సెమీస్‌కు చేరుతోంది. అదే విధంగా ఆస్ట్రేలియా కూడా అత్యుత్తమంగా ఉంది. కాబట్టి వారు సెమీఫైనల్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇక మూడో జట్టుగా డిఫెండింగ్ చాంపియన్స్ ఇంగ్లండ్ కూడా పటిష్టంగా ఉంది. ఇంగ్లీష్ జట్టు కూడా మరోసారి టైటిల్ బరిలో ఉంటుంది.
ఇంగ్లండ్ జట్టులో హ్యారీ బ్రూక్, సామ్ కుర్రాన్ వంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. ఇక నా నాల్గువ జట్టు న్యూజిలాండ్. కివీస్ వరుసగా రెండు సార్లు ఫైనల్‌కు చేరింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో న్యూజిలాండ్ ఎల్లప్పుడూ బాగా రాణిస్తుంది. కివీస్ కూడా కచ్చితంగా టాప్-4లో ఉంటుందని" ఐసీసీ డిజిటిల్ ఇన్‌సైడర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ పేర్కొన్నాడు.
చదవండి: World Cup 2023: ఇంగ్లండ్‌కే చుక్కలు చూపించాడు.. ఎవరీ రచిన్ రవీంద్ర? భారత్‌తో సంబంధం ఏంటి?
Comments
Please login to add a commentAdd a comment