Matthew Hayden
-
'అతడొక అద్భుతం.. కానీ ఆసీస్ బౌలర్ల నుంచి కఠిన పరీక్ష తప్పదు'
టీమిండియా యవ సంచలనం యశస్వీ జైశ్వాల్‌పై ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ మాథ్యూ హేడెన్ ప్రశంసల వర్షం కురిపించాడు. జైశ్వాల్ అద్భుతమైన ఆటగాడని హేడన్ కొనియాడాడు. అయితే రాబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా బౌలర్ల నుంచి యశస్వీ కఠినమైన పరీక్షను ఎదుర్కొంటాడని అతడు అభిప్రాయపడ్డాడు. జైశ్వాల్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్. భారత్‌కు క్రికెట్‌కు దొరికిన విలువైన ఆస్తి. అతడి స్ట్రోక్‌ప్లే అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా యశస్వీ కవర్స్‌పై నుంచి ఆడే షాట్స్ గురుంచి ఎంతచెప్పుకున్న తక్కువే. అతడు తన బ్యాటింగ్ స్కిల్స్‌తో నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అయితే బౌన్సీ పిచ్‌లపై ఎలా ఆడుతాన్నది చూడాలి. జైశ్వాల్ బంతిని హార్డ్‌గా హిట్ చేయడం మనం చాలా సార్లు చూశాం. కానీ ఆస్ట్రేలియా పిచ్‌లలో హార్డ్ హిట్టింగ్ చేయడం అంత ఈజీకాదు. వరల్డ్‌క్లాస్ బౌలర్ల నుంచి జైశ్వాల్‌కు బిగ్ ఛాలెంజ్ ఎదురుకానుంది. పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్‌లను ఎదుర్కొనేందుకు యశస్వీ సిద్దంగా ఉండాలి. అదే విధంగా మైదానాలు కూడా చాలా పెద్దవిగా ఉంటాయి. అక్కడ సిక్స్‌లు కొట్టడం అంత సులభం కాదు. షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోతే ఫీల్డర్‌కు ఈజీగా దొరికిపోతారు. కాబట్టి ఆసీస్ కండీషన్స్‌లో జైశ్వాల్ కాస్త ఆచితూచి ఆడాలని సీఈఏట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్‌లో హేడన్ పేర్కొన్నాడు. కాగా జైశ్వాల్ టెస్టుల్లో అద్భుతమైన రికార్డు ఉంది. కేవలం తొమ్మిది టెస్టులు మాత్రమే ఆడిన జైశ్వాల్ 70.07 స్ట్రైక్ రేటుతో 1028 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 3 సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఈ ఏడాది నవంబర్‌లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఆస్ట్రేలియాకు భారత జట్టు వెళ్లనుంది. -
వన్డే ప్రపంచకప్ ఆల్‌టైమ్ అత్యుత్తమ జట్టు.. కోహ్లికి నో ఛాన్స్!
టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ 2012లో అంతర్జాతీయ క్రికెట్లో వందో సెంచరీ కొట్టి.. శతక శతకాల ధీరుడిగా ప్రపంచ రికార్డు సాధించాడు. సమకాలీన క్రికెటర్లు ఎవరికీ సాధ్యం కాని ఫీట్ నమోదు చేసి.. శిఖరాగ్రాన నిలిచాడు. వన్డేల్లో 49, టెస్టుల్లో 51 సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ పేరిట ఉన్న ఈ రికార్డు బద్దలయ్యే అవకాశమే లేదని భావిస్తున్న తరుణంలో.. విరాట్ కోహ్లి అనే కుర్రాడు తెరమీదకు వచ్చాడు.ఇప్పటికే వన్డేల్లో 50 శతకాలు బాదిన ఈ రన్‌మెషీన్.. సచిన్ రికార్డు బ్రేక్ చేశాడు. టెస్టుల్లో 29, టీ20లలో ఒక సెంచరీ బాది.. ఆల్‌టైమ్ రికార్డుకు ఎసరుపెట్టాడు. 35 ఏళ్ల వయసులోనూ ఫిట్‌నెస్‌కు మారుపేరుగా కొనసాగుతున్న కోహ్లి వరల్డ్‌కప్ టోర్నీల్లోనూ సత్తా చాటుతున్నాడు. వన్డే రారాజుగా కొనసాగుతున్నాడు. అయితే, ఇలాంటి రికార్డుల వీరుడికి తన ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ వన్డే వరల్డ్‌కప్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు లేదంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ మాథ్యూ హెడెన్.భారత్ నుంచి ఇద్దరు లెజెండ్స్ మాత్రమే ఈ టీమ్‌లో స్థానం సంపాదించడానికి అర్హులు అన్నట్లుగా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ జట్టులో ఆస్ట్రేలియా నుంచి అత్యధికంగా నలుగురిని ఎంపిక చేసుకున్న ఈ కంగారూ బ్యాటర్.. పాకిస్తాన్ నుంచి ఇద్దరి చోటు ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లి శ్రీలంకతో వన్డే సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. గౌతం గంభీర్ గైడెన్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు.మాథ్యూ హెడెన్ ఎంచుకున్న గ్రేటెస్ట్ వన్డే వరల్డ్‌కప్ ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్ఆడం గిల్‌క్రిస్ట్(ఆస్ట్రేలియా), వీరేంద్ర సెహ్వాగ్(ఇండియా), రిక్కీ పాంటింగ్(ఆస్ట్రేలియా- కెప్టెన్), సచిన్ టెండుల్కర్(ఇండియా), బ్రియన్ లారా(వెస్టిండీస్), జాక్వెస్ కలిస్(సౌతాఫ్రికా), వకాన్ యూనిస్(పాకిస్తాన్), వసీం అక్రం(పాకిస్తాన్), షేన్ వార్న్(ఆస్ట్రేలియా), ముత్తయ్య మురళీధరన్(శ్రీలంక), గ్లెన్ మెగ్రాత్(ఆస్ట్రేలియా).చదవండి: SA20 2025: సౌతాఫ్రికా కెప్టెన్‌కు షాకిచ్చిన సన్‌రైజర్స్.. జట్టు నుంచి ఔట్ -
అలా అయితే కోహ్లి జట్టులో ఉండీ దండగ: ఆసీస్ మాజీ స్టార్
టీ20 ప్రపంచకప్-2024లో భారత తుది జట్టు కూర్పు గురించి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని ఓపెనర్‌గా పంపాలని.. లేదంటే జట్టులో అతడికి స్థానం ఇవ్వటమే దండగ అని పేర్కొన్నాడు.యశస్వి జైస్వాల్- విరాట్ కోహ్లి టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించాలని.. కెప్టెన్, రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ శర్మను మిడిలార్డర్లో ఆడించాలని హెడెన్ సూచించాడు. కాగా వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియా జూన్ 5న ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.న్యూయార్క్‌లోని నసావూ కౌంటీ స్టేడియం ఇందుకు వేదిక. ఇక ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే టీమిండియా ప్రాక్టీసు మొదలుపెట్టగా.. కోహ్లి మాత్రం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఓపెనింగ్ జోడీ ఎవరు?ఇదిలా ఉంటే.. ఈ మెగా టోర్నీలో భారత ఓపెనింగ్ జోడీ ఎవరన్న అంశం గురించి క్రికెట్ వర్గాల్లో గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మాట్లాడుతూ.. యశస్వి- కోహ్లి భారత ఇన్నింగ్స్ ఆరంభించాలని.. రోహిత్ నాలుగో స్థానంలో వస్తే బాగుంటుందని ఇటీవల తన అభిప్రాయం పంచుకున్నాడు. రోహిత్ మిడిలార్డర్లో రావాలితాజాగా ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ మాథ్యూ హెడెన్ కూడా ఇదే మాట అంటున్నాడు. ‘‘ఐదుగురు కుడిచేతి వాటం బ్యాటర్లను వరుసగా పంపలేం. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ ఉంటే బాగుంటుంది. కోహ్లి యశస్వితో కలిసి ఓపెనింగ్ చేయాలి. లేదంటే అతడికి నా జట్టులో చోటే ఉండదు. సూపర్ ఫామ్‌లో ఉన్న అతడు ఓపెనర్‌గా వస్తేనే బాగుంటుంది.ఇక రోహిత్ శర్మ.. అతడొక విలక్షణమైన ఆటగాడు. మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయడానికి ఏమాత్రం సంకోచించడు. అంతర్జాతీయ టీ20లలో అతడు నాలుగో స్థానంలో వచ్చి అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు కూడా అదే పని చేస్తే బాగుంటుంది’’ అని హెడెన్ అభిప్రాయపడ్డాడు.నాలుగో నంబర్లో రోహిత్ శర్మ.. గణాంకాలు ఇవీటీమిండియా తరఫున రోహిత్ శర్మ ఇప్పటి వరకు 151 టీ20లు ఆడి.. 3974 పరుగులు చేశాడు. ఇందులో 27 సార్లు అతడు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి.. 481 రన్స్ స్కోరు చేశాడు. ఇందులో ఐదు అర్ధ శతకాలు కూడా ఉన్నాయి.కాగా 2022లో రోహిత్ ఎనిమిది సార్లు నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి.. రెండు ఫిఫ్టీల సాయంతో 188 పరుగులు(స్ట్రైక్‌రేటు 122.87) సాధించాడు. ఇక ఐపీఎల్లో 91 ఇన్నింగ్స్‌లో మిడిలార్డర్లో వచ్చిన హిట్‌మ్యాన్.. 130కి పైగా స్ట్రైక్‌రేటుతో 2565 పరుగులు చేశాడు. ఇందులో 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
సన్‌రైజర్స్ కాదు..ఐపీఎల్ టైటిల్ కేకేఆర్‌దే: ఆసీస్ లెజెండ్
ఐపీఎల్-2024 తుది అంకానికి చేరుకుంది. ఆదివారం(మే26) చెన్నైలోని చెపాక్ వేదికగా జరగనున్న టైటిల్ పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. క్వాలిఫయర్ 1లో ఎస్ఆర్హెచ్పై విజయం సాధించి కేకేఆర్ తుది పోరుకు అర్హత సాధించగా.. సన్‌రైజర్స్ క్వాలిఫయర్-2లో రాజస్తాన్‌ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ విజేతను ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మాథ్యూ హేడెన్ అంచనా వేశాడు. కేకేఆర్ ఛాంపియన్స్‌గా నిలుస్తుందని హేడెన్ జోస్యం చెప్పాడు. "ఫైనల్లో ఎస్ఆర్హెచ్పై కేకేఆర్ విజయం సాధిస్తుందన్న నమ్మకం నాకు ఉంది. ఫైనల్‌కు ముందు కేకేఆర్‌కు మూడు రోజుల విశ్రాంతి లభించింది. ఈ వ్యవధిలో ఎస్ఆర్హెచ్ బలాలు, బలహీనతలపై కేకేఆర్ స్పెషల్ ఫోకస్ చేసింటుంది.అంతేకాకుండా క్వాలిఫయర్-1లో ఎస్ఆర్హెచ్ను చిత్తు చేసిన కాన్ఫిడెన్స్ కూడా కేకేఆర్‌కు కలిసిస్తోందని నేను భావిస్తున్నాను.అంతేకాకుండా చెపాక్‌లోని ఎర్రమట్టి పిచ్‌పై నరైన్,వరుణ్ చక్రవర్తి బంతితో మ్యాజిక్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి నావరకు అయితే కేకేఆర్‌దే ట్రోఫీ అని" స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ లైవ్‌లో హేడన్ పేర్కొన్నాడు. -
T20 WC: కోహ్లి ఒక్కడు ఉంటేనే గెలుస్తారా?.. అతడి కంటే..
‘‘విరాట్ కోహ్లి ఒక్కడే టీమిండియాకు వరల్డ్‌కప్ అందించగలడా? గతేడాది వన్డే ప్రపంచకప్ టోర్నీలో అతడు అద్భుతంగా ఆడాడు. గణాంకాలు సైతం చాలా బాగున్నాయి.ఎన్నో రికార్డులు సాధించాడు కూడా. ఏ టోర్నీలోనైనా అతడికి ఇవి అలవాటే. అయితే, సెలక్టర్లు అతడి అనుభవానికి ఓటేస్తారా?.. నిలకడగా రాణిస్తున్న యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇస్తారా? అన్నదే ప్రశ్న.నిజానికి ఈసారి వరల్డ్‌కప్ టోర్నీ అమెరికా- వెస్టిండీస్‌లో జరుగనుంది. కరేబియన్ దీవుల్లోనైనా పిచ్ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు. కానీ అమెరికా పిచ్‌లపై ఏ జట్లకు పెద్దగా అవగాహన లేదు.ఇక విండీస్ పిచ్‌లపై మిడిల్ ఓవర్లలో కచ్చితంగా ఎక్కువ శాతం స్పిన్నర్లే అటాక్‌కు దిగుతారు. పవర్ ప్లే ముగిసిన వెంటనే వారు వరుస ఓవర్లు బౌల్ చేసే అవకాశం ఉంటుంది. నిజం చెప్పాలంటే.. అక్కడ స్పిన్నర్లను ఎదుర్కోవడం విరాట్ కోహ్లికి సవాలే.అలాంటపుడు శివం దూబే, రింకూ సింగ్ వంటి ఆటగాళ్లు మనకు గుర్తుకు వస్తారు. స్పిన్ బౌలింగ్‌లో వీళ్లు చితక్కొట్టగలరు. టీమిండియా ద్వితీయ శ్రేణి జట్టు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాను ఓడించిన విషయం గుర్తుండే ఉంటుంది.గతేడాది నవంబరులో వరల్డ్ చాంపియన్స్ అయిన మమ్మల్ని 4-1తో వాళ్లు చిత్తు చేశారు. అప్పుడు రాణించిన రుతురాజ్ గైక్వాడ్ గురించి కనీసం ఒక్కరు కూడా చర్చించకపోవడం విచారకరం.నాటి సిరీస్‌లో జైస్వాల్ సైతం సెంచరీలు బాది సత్తా చాటాడు. కేవలం అనుభవానికి పెద్ద పీట వేయకుండా.. ఎవరైతే వరల్డ్‌కప్ టోర్నీలో గెలిపించగల సత్తా కలిగి ఉంటారో వారినే ఆస్ట్రేలియా క్రికెట్ ఎంపిక చేస్తుంది.మరి బీసీసీఐ అనుభవం వైపు మొగ్గు చూపుతుందా? లేదంటే యువ హిట్టర్లకు అవకాశం ఇస్తుందో తెలియదు’’ అంటూ ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.వరల్డ్‌కప్‌లో టీమిండియా ఓపెనింగ్ జోడీగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి ఓపెనింగ్ చేస్తాడన్న వార్తల నేపథ్యంలో ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు హెడెన్.అనుభవం కంటే కూడా ప్రస్తుతం జట్టుకు అవసరమైన ఆటగాళ్లను ఏ స్థానంలో ఆడిస్తే బాగుంటుందో బీసీసీఐ సెలక్టర్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. కాగా కోహ్లి ఐపీఎల్-2024లో ఆర్సీబీ తరఫున ఇప్పటి వరకు 10 ఇన్నింగ్స్‌లో కలిపి 500 పరుగులు చేశాడు. ఇందులో ఓ అజేయ శతకం కూడా ఉండటం విశేషం. అయితే, స్ట్రైక్‌రేటు 147.49గా నమోదైన నేపథ్యంలో కోహ్లి ఆట తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. -
అతడిని కాదని నీకు ఛాన్స్.. ‘రాక రాక’ వచ్చిన అవకాశం! ఇకనైనా మారు..
Suryakumar fails again in Asia Cup match vs Bangladesh: ఆసియా కప్-2023 టోర్నీలో రాక రాక వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకోయాడు టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 34 బంతులు ఎదుర్కొన్న ఈ ముంబై ఆటగాడు.. 3 ఫోర్ల సాయంతో 26 పరుగులు మాత్రమే సాధించాడు. బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి వెనుదిరిగాడు. షాట్ సెలక్షన్లో తప్పిదంతో భారీ మూల్యం చెల్లించాడు. ఈ నేపథ్యంలో.. వన్డేల్లో సూర్య కంటే మెరుగైన రికార్డు ఉన్న సంజూ శాంసన్‌ను కాదని.. అతడికి అవకాశం ఇచ్చిన బీసీసీఐపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. అతడిని కాదని నీకు ఛాన్స్ సంజూను కావాలనే పక్కనపెట్టి.. ఈ టీ20 నంబర్ 1 బ్యాటర్‌కు ఇంకెన్ని ఛాన్స్‌లు ఇస్తారని.. ఇకనైనా సెలక్టర్లు కళ్లు తెరవాలని చురకలు అంటిస్తున్నారు. వన్డే వరల్డ్‌కప్-2023 జట్టులో సూర్యకుమార్‌ను ఆడిస్తే ఫలితం అనుభవించక తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. ఏడేళ్లు బెంచ్ మీదే ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ‘‘ప్రస్తుతం సూర్య మైండ్‌సెట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను కూడా ఆస్ట్రేలియా తరఫున ఆడుతున్నపుడు ఏడేళ్లు బెంచ్ మీదే కూర్చున్నా. ఐపీఎల్, ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సూర్య స్ట్రైక్‌రేటు 170కి పైగా ఉంది. అయితే, వన్డేల్లో మాత్రం అతడు ఇంతవరకు తనను తాను నిరూపించుకోలేకపోయాడు. అలాంటి మైండ్‌సెట్ మార్చుకో సూర్య అందుకే ఎలాగైనా 50 ఓవర్ ఫార్మాట్లో రాణించి అభిమానుల నుంచి గౌరవం పొందాలనే ఒత్తిడిలో ఉన్నాడు. ఇలాంటి మైండ్‌సెట్ నుంచి సూర్య బయటపడాలి. విమర్శల గురించి మనం ఎంత ఎక్కువగా ఆలోచిస్తే.. మనపై ప్రతికూల ప్రభావం అంత ఎక్కువగా పడుతుంది. అభద్రతాభావం మనల్ని వెంటాడుతుంది’’ అని సూర్యకుమార్ యాదవ్‌కు సలహాలు ఇచ్చాడు. ప్రపంచకప్‌లో సూర్య తప్పక రాణిస్తాడని తాను భావిస్తున్నానని.. అయితే ఈసారి తనను పూర్తిగా నిరాశపరిచాడని పేర్కొన్నాడు. వన్డేల్లో సంజూ గణాంకాలు ఇలా కాగా ఇప్పటి వరకు టీమిండియా తరఫున 27 వన్డేల్లో సూర్య.. 24.41 సగటుతో 537 పరుగులు సాధించాడు. ఇక మిడిలార్డర్లో స్థానం కోసం ఎదురుచూస్తున్న సంజూ శాంసన్.. 13 వన్డేలాడి 55.71 సగటుతో 390 పరుగులు చేశాడు. చదవండి: SA Vs Aus: క్లాసెన్ సునామీ ఇన్నింగ్స్.. టీమిండియా ప్రపంచ రికార్డు బద్దలు -
WC 2023: వరల్డ్‌కప్ జట్టులో సంజూకు ఛాన్స్! వాళ్లిద్దరికీ షాక్..
ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగితే చాలని ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్ అభిప్రాయపడ్డాడు. కేరళ బ్యాటర్ సంజూ శాంసన్‌కు ప్రధాన జట్టులో చోటిస్తే బాగుంటుందన్న ఈ మాజీ ఓపెనర్.. ఇషాన్ కిషన్‌ను కూడా ఆడించాలని సూచించాడు. ప్రపంచకప్ పోటీలో పది జట్లు కాగా అక్టోబరు 5- నవంబరు 19 వరకు భారత్ వేదికగా ప్రపంచకప్ ఈవెంట్ జరుగనున్న విషయం తెలిసిందే. ఆతిథ్య టీమిండియాతో పాటు.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్, నెదర్లాండ్స్ ట్రోఫీ కోసం పోటీలో నిలిచాయి. అనుకున్న ఫలితం రావాలంటే ఇక సొంతగడ్డపై ఐసీసీ టోర్నీలో ఆడటం రోహిత్ సేనకు సానుకూలాంశం. అయితే, అదే స్థాయిలో ఒత్తిడి కూడా ఉండటం సహజం. ఈ నేపథ్యంలో సమతూకమైన జట్టుతో బరిలోకి దిగి సరైన సమయంలో రాణిస్తేనే టీమిండియా అనుకున్న ఫలితం రాబట్టగలదు. పుష్కరకాలం తర్వాత మరోసారి స్వదేశంలో ప్రపంచ విజేతగా నిలవగలదు. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్‌నకు ఎంపిక చేసే జట్టు సెలక్టర్లకు సవాలుగా మారింది. ఇక ఆసియా కప్ ఈసారి.. వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్న తరుణంలో ఈ ఈవెంట్లో ఆడే జట్టే ప్రపంచకప్ ప్రొవిజినల్ టీమ్ అని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఇప్పటికే చెప్పాడు. సంజూకు ఛాన్స్.. వాళ్లిద్దరికీ షాక్ ఈ క్రమంలో ఆసీస్ క్రికెటర్ మాథ్యూ హెడెన్ స్టార్ స్పోర్ట్స్ షోలో భారత జట్టు కూర్పు గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఐసీసీ ఈవెంట్లో మణికట్టు స్పిన్నర్లకు చోటు ఇవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ఐసీసీ ఈవెంట్‌కు తాను ఎంచుకున్న 15 మంది జట్టులో రవీంద్ర జడేజాతో పాటు అక్షర్ పటేల్‌కు స్పిన్నర్లుగా స్థానం కల్పించాడు. మణికట్టు స్పిన్నర్లు యజువేంద్ర చహల్, ఆసియా కప్ జట్టులో చోటు సంపాదించిన కుల్దీప్ యాదవ్‌లకు షాకిచ్చాడు. ఇక అంతర్జాతీయ వన్డేల్లో పేలవ రికార్డు ఉన్న భారత టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్‌ను హెడెన్ తన జట్టుకు ఎంపిక చేయడం విశేషం. అదే సమయంలో సీనియర్లకే పెద్దపీట వేసిన ఆసీస్ లెజెండ్ యువ సంచలనం తిలక్ వర్మను విస్మరించాడు. కాగా ఈ వరల్డ్‌కప్‌లో టీమిండియా అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్-2023కి మాథ్యూ హెడెన్ ఎంచుకున్న 15 మంది సభ్యుల భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్. చదవండి: అలా అయితే.. 2011 వరల్డ్‌కప్ పీడకలగా మిగిలేదేమో! ఇప్పుడు: కోహ్లి A champion’s touch! 🏆 Former Aussie WC winner, @HaydosTweets has unveiled his #TeamIndia squad for the #CWC2023! 🌟 Would you make any changes to this dream team? 👀 Tune-in to the #WorldCupOnStar October 5, 2 PM onwards | Star Sports Network & Disney+ Hotstar#Cricket pic.twitter.com/lAxvbPJLgi — Star Sports (@StarSportsIndia) August 26, 2023 -
వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే.. స్టార్ ఆటగాళ్లకు నో ఛాన్స్! సంజూకు
Matthew Hayden On Indias World Cup Squad: వన్డే ప్రపంచకప్-2023కు కౌంట్ డౌన్ మొదలైంది. అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్-ఇంగ్లండ్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్ కోసం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి ఆగ్రశ్రేణి టీమ్స్ ఇప్పటికే తమ ప్రిలిమనరీ జట్లను కూడా ప్రకటించాయి. మరోవైపు భారత జట్టు కూడా వరల్డ్‌కప్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ మెగా టోర్నీకి ముందు ఆసియాకప్‌లో టీమిండియా తలపడనుంది. ఈ క్రమంలో ఆసియాకప్‌కు 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టును అజిత్ అగర్కార్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ జట్టునే వరల్డ్‌కప్‌కు కూడా కొనసాగించే అవకాశం ఉంది. ఇందులో 15 మంది సభ్యులను ఖారారు చేసి సెప్టెంబర్ 15లోపు ఐసీసీకి బీసీసీఐ సమర్పించనుంది. కాగా ఈ టోర్నీతో స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, వరల్డ్‌కప్‌కు భారత జట్టు ఇదే.. ఇక ఇది ఇలా ఉండగా.. వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యలతో కూడిన భారత జట్టును ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హేడెన్ ఎంచుకున్నాడు. అతడు ఎంపిక చేసిన జట్టులో మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్,యజువేంద్ర చాహల్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం. అదే విధంగా వికెట్ కీపర్లగా ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ ఇద్దరికీ హేడన్ ఛాన్స్ ఇచ్చాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లగా రవీంద్ర జడేజా, అక్షర్‌పటేల్‌కు మాత్రమే చోటు దక్కింది. అదే విధంగా స్పెషలిస్ట్ బ్యాటర్లగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌కు హేడన్ అవకాశం కల్పించాడు. మరోవైపు సిరాజ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, శార్ధూల్ ఠాకూర్ రూపంలో నలుగురు పేసర్లు హేడన్ ఎంపిక చేసిన జట్టులో ఉన్నారు. హేడన్ ఎంపిక చేసిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ మరియు అక్షర్ పటేల్. చదవండి: IBSA World Games 2023: భారత్‌కు సిల్వర్ మెడల్ -
రవీంద్ర జడేజాలా అతడు కూడా త్రీడీ క్రికెటర్.. డేంజరస్ హిట్టర్! కాబట్టి..
ICC ODI WOrld CUp 2023: వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ ప్రధాన స్పిన్నర్‌గా షాదాబ్ ఖాన్‌ను ఎంచుకున్నాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్. టీమిండియాకు రవీంద్ర జడేజాలాగా పాక్‌కు షాదాబ్ ఉన్నాడని వ్యాఖ్యానించాడు. జడ్డూ మాదిరే అతడు కూడా త్రీ-డీ క్రికెటర్ అని పేర్కొన్నాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఐసీసీ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. హైదరాబాద్, అహ్మదాబాద్‌లలో ఒక్కో మ్యాచ్‌లు ఆడనున్న దాయాది జట్టు.. చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో రెండేసి మ్యాచ్‌లు ఆడనుంది. జడ్డూలా త్రీడీ ప్లేయర్.. డేంజరస్ హిట్టర్ ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ మాథ్యూ హెడెన్ పాకిస్తాన్‌కు ఈ మెగా ఈవెంట్లో షాదాబ్ ఖాన్ కీలకం కానున్నాడని పేర్కొన్నాడు. ‘‘షాబాద్ ఖాన్ అద్బుతమైన ఆటగాడు. తనకంటూ కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నాయి. జడ్డూ మాదిరే అతడు కూడా త్రీ- డైమెన్షనల్ క్రికెటర్. ప్రత్యర్థి జట్టుకు వణుకు పుట్టించగల ప్రమాదకర హిట్టర్. బంతితోనూ అద్భుతంగా రాణించగలడు. అంతేకాదు అత్యద్భుతమైన ఫీల్డర్ కూడా! ఒక్కోసారి ఫీల్డింగ్ ఎఫర్ట్స్‌తో కూడా వరల్డ్‌కప్ గెలిచే అవకాశాలు ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు మరి! కాబట్టి.. ఈసారి పాకిస్తాన్‌కు ఈ స్పిన్ ఆల్‌రౌండర్ కీలకం కానున్నాడని చెప్పవచ్చు’’ అని మాథ్యూ హెడెన్ వ్యాఖ్యానించాడు. కాగా 2017లో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన షాదాబ్ ఖాన్.. బౌలింగ్ ఆల్‌రౌండర్. అందుకే అలా పాక్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఈ 24 ఏళ్ల రైట్‌హ్యాండ్ బ్యాటర్ కీలక సభ్యుడు. ఇప్పటి వరకు ఆడిన 56 వన్డేల్లో 631 పరుగులు సాధించడంతో పాటు.. 73 వికెట్లు పడగొట్టాడు. కీలక సమయాల్లో జట్టును గెలిపించిన ఘనత అతడి సొంతం. ఈ నేపథ్యంలో బ్యాటర్, బౌలర్‌గా రాణించడంతో పాటు అద్భుత ఫీల్డింగ్ విన్యాసాలతో ఆకట్టుకుంటున్న షాబాద్‌ను హెడెన్ త్రీడీ ప్లేయర్‌గా అభివర్ణించాడు. చదవండి: WC 2023: ఇప్పుడే అంతా అయిపోలేదు.. వెస్టిండీస్ అద్భుతాలు చేయగలదు! సచిన్, గంగూలీ, వీరూకు కలిసి రాలేదు! కానీ ధోని రూటే సపరేటు కదా! -
కీలక మ్యాచ్‌ల్లో రోహిత్ రాణించడం ఎప్పుడు చూడలేదు.. అతనో ఫెయిల్యూర్...!
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో రోహిత్ (7 బంతుల్లో 8) విఫలమైన అనంతరం కామెంట్రీ బాక్స్ ఉన్న హేడెన్ మాట్లాడుతూ.. కీలక మ్యాచ్‌ల్లో చేతులెత్తేయడం రోహిత్ శర్మకు ఇది కొత్తేం కాదు.. జట్టుకు అవసరం ఉన్నప్పుడు అతను రాణించడం నేనెప్పుడు చూడలేదు.. అది టీమిండియా కావొచ్చు లేదా ముంబై ఇండియన్స్ కావచ్చు.. తన దృష్టిలో రోహిత్ ఒక ఫెయిల్యూర్ అంటూ వివాదాస్పద కామెంట్స్ చేశాడు. అలాగే ఈ సీజన్లో ముంబై క్వాలిఫయర్-2 దశ వరకు చేరడంలో రోహిత్ పాత్ర శూన్యమని.. గత కొనేళ్లుగా అతను తరుచూ విఫలమవుతున్నా, అతను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్ల ప్రదర్శన కారణంగా విమర్శల నుంచి తప్పించుకుంటున్నాడని అభిప్రాయపడ్డాడు. హేడెన్ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై రోహిత్ శర్మ అభిమానులు మండిపడుతున్నారు. రోహిత్ ఆడినా, ఆడకపోయినా జట్టును విజయవంతంగా ముందుండి నడిపిస్తున్నాడని వెనకేసుకొస్తున్నారు. రోహిత్‌ను విమర్శించే అర్హత హేడెన్‌కు లేదని ధ్వజమెత్తుతున్నారు. హిట్ మ్యాన్.. టీమిండియాకు అలాగే ముంబై ఇండియన్స్‌కు అందించిన విజయాలు మర్చిపోకూడదని అంటున్నారు. కాగా, మే 26న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన నాకౌట్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 62 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ సూపర్ సెంచరీతో (60 బంతుల్లో 129) విజృంభించడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 233 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్యఛేదనలో ఆదిలోనే వికెట్లు కోల్పోయి చేతులెత్తేసిన ముంబై.. మరో 10 బంతులు మిగిలుండగానే 171 పరుగులకే చాపచుట్టేసింది. కీలక మ్యాచ్‌లో రోహిత్ శర్మ (8) మరోసారి విఫలం కాగా.. సూర్యకుమార్ (61), తిలక్ వర్మ (43), గ్రీన్ (30) ఓ మోస్తరుగా రాణించడంతో ముంబై ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. చదవండి: ‘ఫైనల్’ ధమాకా.. సీఎస్కే వర్సెస్ గుజరాత్ టైటాన్స్ -
IND VS AUS 3rd Test: ఇదెక్కడి పిచ్ రా బాబు.. మరీ ఇంత దారుణమా..?
Matthew Hayden: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా ఇండోర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో పర్యాటక ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే కుప్పకూలింది. కుహ్నేమన్ (5/16) టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేయగా.. లయోన్ (3/35), మర్ఫీ (1/23) భారత జట్టు పతనంలో తమవంతు పాత్ర పోషించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు (54 ఓవర్లు) చేసింది. ట్రవిస్ హెడ్ (9), ఉస్మాన్ ఖ్వాజా (60), లబూషేన్ (31), స్టీవ్ స్మిత్ (26) ఔట్ కాగా.. హ్యాండ్స్కోంబ్ (7), గ్రీన్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ కోల్పోయిన వికెట్లన్నీ జడేజా ఖాతాలోకే వెళ్లాయి. ప్రస్తుతానికి ఆసీస్ 47 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. కాగా, ఊహకందని విధంగా మెలికలు తిరుగుతూ, బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్న హోల్కర్ మైదానం పిచ్‌పై ఆసీస్ మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. మ్యాచ్ జరుగుతుండగానే లైవ్‌లో తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇదెక్కడి పిచ్ రా బాబు.. మరీ ఇంత దారుణంగా టర్న్ అవుతుందని ధ్వజమెత్తాడు. ఈ పిచ్ జనరేట్ చేస్తున్న టర్న్ చూస్తే భయమేస్తుందని అన్న హేడెన్.. స్పిన్నింగ్ కండీషన్స్‌ను తూర్పారబెట్టాడు. టెస్ట్ క్రికెట్లో తొలి రోజు ఆరో ఓవర్లోనే స్పిన్ బౌలర్ తన ప్రతాపం చూపితే.. మ్యాచ్ ఎన్ని గంటల పాటు సాగుతుందని ప్రశ్నించాడు. ఇలాంటి పిచ్‌లకు తన మద్దతు ఎప్పుడూ ఉండదని అసహనం వ్యక్తం చేశాడు. టెస్ట్ మ్యాచ్‌లకు పిచ్‌లను తొలి రెండు రోజులు బ్యాటర్లకు అనుకూలించేలా తయారు చేయాలని సూచించాడు. తొలి రోజు భారత బ్యాటింగ్ సందర్భంగా కామెంటరీ బాక్స్‌లో ఉన్న హేడెన్ ఈ వ్యాఖ్యలు చేయగా.. పక్కనే ఉన్న టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి రెండే రెండు ముక్కల్లో "హోమ్ కండీషన్స్" అంటూ హేడెన్ కామెంట్స్‌ను బదులిచ్చాడు. కొద్ది సేపు ఈ విషయంపై ఎలాంటి కామెంట్స్ చేయని శాస్త్రి.. ఆతర్వాత మైక్ పట్టుకుని, ఇది హోమ్ కండీషన్స్ కంటే చాలా అధికంగా ఉందని, మున్ముందు మ్యాచ్ మరింత టఫ్‌గా మారుతుందని జోస్యం చెప్పాడు. అయితే ఒక్క మంచి భాగస్వామ్యం మ్యాచ్‌ను మలుపు తిప్పుతుందని అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే, 4 మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో ఇప్పటివరకు జరిగిన 2 మ్యాచ్‌ల్లో టీమిండియా రెండింటిలోనూ విజయాలు సాధించి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో కూడా ఎలాగైనా గెలిచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకోవాలని పట్టుదలగా ఉండిన రోహిత్ సేనకు తొలి రోజు పిచ్ వ్యవహరించిన తీరు మింగుడుపడని విషయంగా మారింది. -
ప్రపంచంలో ఎక్కడా ఇలా జరుగదు! అవునంటూ ఆసీస్ దిగ్గజానికి రవిశాస్త్రి కౌంటర్
Ind Vs Aus 3rd Test Indore Day 1: టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య బుధవారం (మార్చి 1) ఆరంభమైన మూడో టెస్టులో ఆది నుంచే బంతి స్పిన్‌కు టర్న్ అవుతోంది. ఇండోర్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేన లంచ్ సమయానికి 84 పరుగులు మాత్రమే చేసి ఏడు వికెట్లు కోల్పోయింది. ఆరో ఓవర్లో బౌలింగ్ అటాక్ ఆరంభించిన ఆసీస్ స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమన్.. కెప్టెన్ రోహిత్ శర్మ(12) వికెట్‌తో ఖాతా తెరిచాడు. చెలరేగిన ఆసీస్ స్పిన్నర్లు తర్వాతి రెండో ఓవర్లో మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్(21)ను అవుట్ చేశాడు. తర్వాత వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్ రంగంలోకి దిగి ఛతేశ్వర్ పుజారా(1), రవీంద్ర జడేజా(4) వికెట్లు కూల్చగా.. కుహ్నెమన్ శ్రేయస్ అయ్యర్(0)ను డకౌట్ చేశాడు. వీరికి తోడు మరో స్పిన్నర్ టాడ్ మర్ఫీ విరాట్ కోహ్లి(22)ని ఎల్బీడబ్ల్యూ చేసి బ్రేక్ ఇచ్చాడు. తర్వాత లియోన్ శ్రీకర్ భరత్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ క్రమంలో 82 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది టీమిండియా. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటివి జరగవు ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్ ఇండోర్ పిచ్‌ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రితో కామెంట్రీలో భాగంగా.. ‘‘ప్రపంచంలో ఎక్కడా కూడా టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలో స్పిన్నర్ ఆరో ఓవర్లో బౌలింగ్‌కు రానేరాడు. ప్రస్తుతం ఇంత జరుగుతున్న భారత శిబిరంలో మరీ అంత చిరాకు లేకపోవడానికి కారణం వాళ్లు తొలి రెండు టెస్టుల్లో గెలవడమే! కానీ ఇక్కడ బంతి ఎలా టర్న్ అవుతోందో చూడండి. అందుకే నాకు ఈ పిచ్‌లపై కంప్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడేమంటావు రవి? ముందుగా చెప్పినట్లు ప్రపంచంలో ఏ టెస్టు మ్యాచ్‌లోనూ ఆరో ఓవర్ స్పిన్నర్‌తో వేయించరు. అస్సలు ఆ అవకాశమే లేదు. ఇండోర్‌లో మూడో రోజు నుంచి బంతి టర్న్ అవుతుందని అంచనా వేశాం. బ్యాటర్లకు కూడా అవకాశం రావాలి కదా రవి. ఒక్క మాటతో అదుర్స్ అనిపించిన రవి! ఇప్పుడు మీ ఆటగాళ్ల ప్రదర్శన గురించి ఏం చెబుతావో చెప్పు! మొదటి, రెండో రోజు బ్యాటింగ్‌కు కాస్త అనుకూలించాలి కదా!’’ అని బ్యాటింగ్ ఆల్‌రౌండర్ హెడెన్ వ్యాఖ్యానించాడు. ఇందుకు స్పందనగా రవిశాస్త్రి ఒక్క మాటతో.. ‘‘హోం కండిషన్స్’’ అంటూ హెడెన్‌కు అదిరిపోయే రీతిలో జవాబు ఇచ్చాడు. ‘‘స్వదేశంలో మ్యాచ్ అంటే మామూలుగా జరిగేదే ఇది! కానీ ఇక్కడ ఇంకాస్త కఠినంగా ఉంది పరిస్థితి. ఒక్కటంటే ఒక్క మెరుగైన భాగస్వామ్యం నమోదైతేనే కాస్త ప్రయోజనకరంగా ఉంటుంది’’అని పేర్కొన్నాడు. సొంతగడ్డపై జట్లకు కాస్త అనుకూలమైన పిచ్లే రూపొందిస్తారని, అందుకు ఎవరూ అతీతులు కారన్న అర్థంలో హెడెన్‌కు కౌంటర్ ఇచ్చాడు. చదవండి: Ind Vs Aus 3rd Test: షేన్ వార్న్ రికార్డు బద్దలు.. నాథన్ లియోన్ అరుదైన ఘనత.. అగ్రస్థానంలో.. Rohit Sharma: సున్నా దగ్గరే రెండుసార్లు.. ఉపయోగించుకోవడంలో విఫలం -
టీమిండియాను ఓడించడానికి సాయం చేస్తా.. ఒక్క రూపాయి కూడా వద్దు!
టీమిండియాపై టెస్టు సిరీస్ గెలిచి 19 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని భారత గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియాకు మరో సారి నిరాశ ఎదురైంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టుల్లో ఘోర పరాభావం పొందిన ఆసీస్.. తమ కలను నేరవేర్చుకునే అవకాశం కోల్పోయింది. చివరిగా 2004లో భారత్ గడ్డపై ఆసీస్ టెస్టు సిరీస్ నెగ్గింది. ఇక తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా దారుణ ప్రదరర్శన కనబరిచింది. ముఖ్యంగా ఆసీస్ బ్యాటర్లు భారత స్పిన్నర్లను ఎదుర్కొవాడనికి తలలు పట్టుకున్నారు. అయితే మూడో టెస్టుకు దాదాపు వారం రోజుల సమయం ఉండడంతో.. ఆసీస్ జట్టు ఢిల్లీలోనే తమ ప్రాక్టీస్‌ను కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తీవ ఇబ్బంది పడుతున్న ఆస్ట్రేలియాకు సాయం చేసేందుకు ఆ జట్టు మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ముందుకొచ్చాడు. హేడెన్ ప్రస్తుతం ఈ సిరీస్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. "కష్టాల్లో ఉన్న ఆసీస్ జట్టుకు నా వంతు సాయం అందించేందుకు 100 శాతం సిద్దంగా ఉన్నాను. అది రాత్రి లేదా పగలు ఏ సమయంలో పిలిచినా వెళ్లి సాయం చేస్తాను. నాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. వాళ్ల సొంత గడ్డపై భారత స్పిన్నర్లను ఎదుర్కొవడం అంత సులభం కాదు. బౌలర్ల మైండ్ సెట్‌ను అర్ధం చేసుకోవాలి. అయితే అత్యుత్తమ ఆటగాళ్లను తాయారు చేయాల్సిన అవసరం ప్రస్తుతం క్రికెట్ ఆస్ట్రేలియాకు చాలా ఉంది. అదే విధంగా క్రికెట్ ఆస్ట్రేలియా గవర్నింగ్ కౌన్సిల్లో కనీసం ఒక్క మాజీ ఆటగాడైనా ఉండాలి. అప్పుడే వినూత్నమైన మార్పులు తీసుకురావచ్చు." అని విలేకరుల సమావేశంలో హెడన్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: ఐపీఎల్‌కు ముందు చెన్నైకి గుడ్ న్యూస్.. స్టార్ ఆటగాడు వచ్చేస్తున్నాడు! -
సూపర్-12లో వెళ్లాల్సినోళ్లు ఫైనల్ దాకా.. హేడెన్ చలవేనా!
టి20 ప్రపంచకప్ 2022 నవంబర్ 13న ముగియనుంది. ఈ ఆదివారం జరగనున్న ఫైనల్లో ఇంగ్లండ్‌తో పాకిస్తాన్ అమితుమీ తేల్చుకోనుంది. సూపర్-12 దశలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి.. దీంతో పాక్ కథ ముగిసినట్లే అనుకున్నారంతా. కానీ వారికి ఎక్కడో సుడి రాసిపెట్టుంది. అందుకే ఆ తర్వాత పాక్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో వరుసగా గెలవడం.. ఆపై సౌతాఫ్రికా నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోవడంతో కథ అడ్డం తిరిగింది. అనూహ్యంగా పాకిస్తాన్ సెమీస్‌లో అడుగుపెట్టింది. అయితే కీలకమైన సెమీస్‌లో మాత్రం అద్భుత ఆటతీరును కనబరిచింది. సూపర్-12 వరకు కిందా మీదా పడి ఎలాగోలా గెలిచిన పాకిస్తాన్ జట్టేనా సెమీస్‌లో కివీస్‌పై నెగ్గింది అన్న అనుమానాలు వచ్చాయి. మరి రెండు రోజుల వ్యవధిలో పాక్ జట్టులో అంత మార్పు ఎక్కడి నుంచి వచ్చిందనేది ఆసక్తికరంగా మారింది. అయితే దీనికి కారణం మాత్రం ఆసీస్ దిగ్గజం మాథ్యూ హేడెన్ అని క్రీడా పండితులు పేర్కొన్నారు. ప్రస్తుతం మాథ్యూ హెడెన్ పాకిస్తాన్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. పాక్ దశను మార్చే పనిలో ఉన్న హేడెన్ దాదాపు సక్సెస్ అయినట్లే. ఇక ఫైనల్లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి పాకిస్తాన్ విజేతగా నిలిస్తే హేడెన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసినట్లే. ఇదంతా ఎందుకు.. అసలు ఆస్ట్రేలియాలోని పిచ్‌లపై పూర్తి అవగాహన ఉన్న ఆ దేశ మాజీ క్రికెటర్‌ను ఎప్పుడైతే మెంటార్‌గా ఏంచుకుందో అప్పుడే పాక్ సగం సక్సెస్ అయినట్లే. అయితే హేడెన్ ప్రభావం తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టింది.. అది కీలకమైన సెమీస్ మ్యాచ్‌లో. నిజానికి గతేడాది టి0 ప్రపంచకప్‌కు ముందే అంటే సెప్టెంబర్‌లోనే మాథ్యూ హెడెన్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించుకుంది. కానీ ఆ ప్రపంచకప్‌లో సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. ప్రధాన కోచ్ అంటే అన్ని విషయాలు పరిశీలిస్తాడు. అదే బౌలింగ్ లేదా బ్యాటింగ్ కోచ్ అయితే కేవలం వారి పరిధి వరకే పనిచేస్తారు. ప్రస్తుతం పాక్ ప్రధాన కోచ్‌గా సక్లెయిన్ ముస్తాక్ ఉన్నాడు. పీసీబీ ఎంపిక చేసింది కాబట్టి ఏం చేయలేని పరిస్థితి. ఇటు చూస్తే ఈసారి ప్రపంచకప్ జరుగుతుంది ఆస్ట్రేలియాలో.బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న హేడెన్‌కు ఆసీస్ పిచ్‌లపై అపార అనుభవం ఉంది. అందుకే ఉన్నపళంగా మాథ్యూ హేడెన్‌ను మెంటార్‌గా నియమించిన పీసీబీ మహ్మద్ యూసఫ్‌ను బ్యాటింగ్ కోచ్‌గా ఎన్నుకుంది. హేడెన్ అనుభవాన్ని పాకిస్తాన్ చక్కగా ఉపయోగించుకుందనడానికి సెమీస్ మ్యాచ్ ఉదాహరణ. ముందు బౌలింగ్‌తో కివీస్‌ను కట్టడి చేయగా.. ఆ తర్వాత అసలు ఫామ్‌లో లేని బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లు అసలు మ్యాచ్‌లో హాఫ్ సెంచరీలతో మెరిసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. మరి వీటన్నింటి వెనుక కారణం హేడెన్ అంటే అతిశయోక్తి కాదు. అందుకే మ్యాచ్ ముగియగానే హేడెన్ వద్దకు పరిగెత్తుకొచ్చిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం అతన్ని ప్రేమతో హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. సూపర్-12 దశలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం తమ జట్టు ముందుకు సాగుతుందా లేదా అని డైలమాలో ఉన్నాడు.. కానీ ఇదే సమయంలో హేడెన్ మాత్రం మా కుర్రాళ్లు తప్పుకుండా రాణిస్తారు.. ఈసారి కప్ పాకిస్తాన్‌దే అని ప్రతీ మ్యాచ్‌కు ముందు చెప్పుకుంటూ వస్తున్నాడు. హేడెన్ వ్యాఖ్యలని బట్టి చూస్తే పాక్ విజయంపై అతను ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడో అర్థమవుతుంది. ఇక పరిస్థితులు కూడా పాకిస్తాన్‌కు అనుకూలంగా ఉన్నాయి. 1992 వన్డే వరల్డ్కప్లాగే ఇప్పుడు కూడా పాక్ టైటిల్ కొట్టబోతుంటూ పలువురు జోస్యం చెబుతున్నారు. అప్పుడు ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్‌గా టైటిల్ గెలిచాడు. ఇప్పుడు బాబర్ ఆజం కెప్టెన్‌గా తొలి ఐసీసీ ట్రోఫీని అందుకోబోతున్నాడంటూ పేర్కొంటున్నారు. మరి హేడెన్ దిశానిర్ధేశం పాక్ జట్టుకు ఎంత వరకు పనిచేస్తుందనేది ఫైనల్ మ్యాచ్ పూర్తయ్యాకే తెలుస్తుంది. కాగా కివీస్‌పై గెలిచి ఫైనల్లో అడుగుపెట్టాకా.. డ్రెస్సింగ్ రూమ్‌లో హేడెన్ ఇచ్చిన స్పీచ్‌ను పీసీబీ ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ జోస్యాల సంగతి పక్కనబెడితే టి20 క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. పాక్ సంగతి పక్కనబెడితే ఇంగ్లండ్ అంతకంటే బలంగా కనిపిస్తుంది. టీమిండియాతో సెమీస్‌లో ఇంగ్లండ్ ఆడిన ఆటతీరు చూస్తే అర్థమవుతుంది. కానీ పాక్ జట్టులో ప్రస్తుతం బౌలింగ్ విభాగం నెంబర్‌వన్‌గా ఉంది. షాహిన్ అఫ్రిది, మహ్మద్ వసీమ్, నసీమ్ షా పేస్ త్రయానికి తోడుగా మమ్మద్ నవాజ్ స్పిన్ కూడా పెద్ద బలం. మరి అరివీర భయంకరంగా కనిపిస్తున్న పాక్ పేసర్లను ఇంగ్లండ్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం. ఇవన్నీ పక్కనబెడితే క్రికెట్ అభిమానులు మాత్రం ఎవరికి తోచింది వారు చెబుతున్నారు. కొందరేమో 1992 సీన్ రిపీట్ కాబోతుందని.. పాకిస్తాన్‌దే కప్ అని పేర్కొంటున్నారు. అయితే కొంతమంది మాత్రం పాక్‌కు అంత సీన్ లేదని.. మ్యాచ్ కచ్చితంగా వన్‌సైడ్ అవుతుందని.. ఇంగ్లండ్ రెండోసారి విశ్వవిజేతగా నిలవనుందని తెలిపారు. చదవండి: కాలం ఒకేలా ఉండదు.. తిట్టినోడే చప్పట్లతో మెచ్చుకున్నాడు ఆటలో లోపం లేదు.. టాలెంట్‌కు కొదువ లేదు.. ఎప్పుడు గుర్తిస్తారో! -
'వెళ్లిపోయాకా ఈ మాట చెప్పడం ఎందుకు?'.. హెడెన్‌కు చురకలు
ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్ ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాను మెంటార్‌గా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ జట్టు టి20 ప్రపంచకప్‌లో ఆఖరి నిమిషంలో వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టి సెమీస్‌లో అడుగుపెట్టింది. నవంబర్ 9న(బుధవారం) న్యూజిలాండ్‌తో పాక్ అమితుమీ తేల్చుకోనుంది. ఇక మాథ్యూ హెడెన్ డిఫెండింగ్ చాంపియన్‌గా ఈ ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా సూపర్-12 దశలోనే వెనుదిరగడంపై స్పందించాడు. ''ఈ ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా పూర్తి స్థాయిలో సన్నద్ధమైనట్లుగా అనిపించలేదు. జరుగుతున్నది ఒక ప్రీమియమ్ ఈవెంట్. ప్రీమియమ్ ఈవెంట్ అంటే ఎలా ఉండాలి.. అన్ని శక్తులు సిద్ధం చేసుకొని బరిలోకి దిగాలి. కానీ దురదృష్టవశాత్తూ ఆసీస్ జట్టు ఎలాంటి ప్లానింగ్ లేకుండానే ప్రపంచకప్‌లో ఆడింది. డిఫెండింగ్ చాంపియన్ హోదా దశలో అడుగుపెట్టిన ఆసీస్ ఇవాళ సూపర్-12లోనే నిష్క్రమించడం కాస్త బాధ కలిగించింది. గత నాలుగైదేళ్లుగా ఆస్ట్రేలియా క్రికెట్‌ను అందరం గమనిస్తూ వస్తున్నాం. కొన్ని డిపార్ట్మెంట్లలో మార్పు అవసరం.. ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్‌లో మునుపటి పేస్‌ను చూడలేకపోతున్నాం. కీలకమైన మ్యాచ్‌కు మిచెల్ స్టార్క్ దూరమవడం జట్టు లయను దెబ్బతీసింది. అలాగే డేవిడ్ వార్నర్ ప్రదర్శన చూసుకుంటే గత వరల్డ్‌కప్‌కు ఈసారి పొంతన లేనట్లుగా ఉంది. అతనొక ప్రీమియమ్ ప్లేయర్. కానీ అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాడు. అతనే కాదు మిగతా ఆసీస్ ఆటగాళ్ల పరిస్థితి కూడా ఇదే.'' అంటూ చెప్పుకొచ్చాడు. అయితే హెడెన్ వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు ఘాటుగా స్పందించారు. ''నువ్వు ప్రస్తుతం పాక్ జట్టుకు మెంటార్‌గా ఉన్నావు. ముందు మీ జట్టులోని లోపాలను సరిదిద్దుకుంటే మంచింది. ఆస్ట్రేలియా టోర్నీ నుంచి వెళ్లిపోయాకా ఇప్పుడు మాట్లాడడం ఏంటి'' అని కామెంట్ చేశారు. చదవండి: టీమిండియాతో సెమీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు మరో బిగ్ షాక్..! Kane Williamson: కెప్టెన్‌గా హీరో.. కప్పు అందుకోవడంలో జీరో; ఈసారైనా -
హెడెన్ బంపరాఫర్ మిస్ చేసుకున్న పాక్ బౌలర్స్
టి20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్ వార్మప్ మ్యాచ్‌ల ద్వారా సరైన ప్రాక్టీస్ లభించలేదు. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో ఓటమిపాలైన పాకిస్తాన్‌కు రెండో మ్యాచ్ వర్షార్పణం అయింది. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్ అనంతరం వర్షం అంతరాయం కలిగించడం.. ఆపై ఎంతకూ తెరిపినివ్వకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. వార్మప్ మ్యాచ్‌లు ముగియడంతో ఇక పాకిస్తాన్ నేరుగా అక్టోబర్ 23న(ఆదివారం) మెల్బోర్న్ వేదికగా టీమిండియాతో తలపడనుంది. అయితే టీమిండియాతో పోరుకు ముందు బ్రిస్బేన్‌లో పాక్ జట్టు మెంటార్.. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్ త్రో చాలెంజ్ కాంపిటీషన్ నిర్వహించాడు. త్రో చాలెంజ్‌లో భాగంగా ఎవరైతే బంతిని స్టేడియం బయటకు విసురుతారో వాళ్లకు వంద డాలర్ల ఖరీదైన గిఫ్ట్‌ను ఇస్తానని చాలెంజ్ చేశాడు. ఈ చాలెంజ్‌కు పాక్ పేసర్లు నసీమ్ షా, మహ్మద్ వసీమ్ జూనియర్లు సై అన్నారు. తాను బంతిని స్టేడియం వెలుపలికి విసరగలనన్న నమ్మకం ఉందని వసీమ్ పేర్కొన్నాడు. అయితే చెప్పినట్లుగా బంతిని బయటకు విసరడంలో మాత్రం విఫలమయ్యాడు. నసీమ్ షా కూడా త్రో చాలెంజ్‌లో ఫెయిలయ్యాడు. ఇద్దరు విఫలమవడంతో హేడెన్ వంద డాలర్ల గిఫ్ట్‌ను తన వద్దే అట్టిపెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Pakistan Cricket (@therealpcb) చదవండి: రాణించిన కుశాల్ మెండిస్.. భవితవ్యం ఇక బౌలర్ల చేతిలో స్లో ఓవర్ రేట్.. క్రికెట్ ఆస్ట్రేలియా వినూత్న ఆలోచన -
'అతడు బాగా అలిసిపోయాడు.. తిరిగి వచ్చి అదరగొడతాడు'
టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ గత కొన్ని మ్యాచ్‌ల నుంచి దారుణంగా విఫలమవుతున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో భువీ పూర్తిగా తేలిపోతున్నాడు. ఆసియాకప్-2022లోనూ ఆప్గానిస్తాన్‌పై మినహా అంతగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏమీ భువీ చేయలేదు. అదే విధంగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లోనూ కూడా భువనేశ్వర్ విఫలమయ్యాడు. ఈ సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో భువీ.. తన అఖరి రెండు ఓవర్లలో ఏకంగా 31 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో టీ20 ప్రపంచకప్‌కు ముందు భువీ పేలవ ఫామ్ భారత జట్టు మేనేజ్మెంట్ను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో భువనేశ్వర్ కుమార్ ఫామ్‌పై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. భవీ నాన్‌స్టాప్‌గా క్రికెట్ ఆడి అలసిపోయినట్లు కనిపిస్తున్నాడని హేడన్ అభిప్రాయపడ్డాడు. భువనేశ్వర్ కుమార్‌కు విశ్రాంతి అవసరం భారత్-ఆస్ట్రేలియా మూడో టీ20 అనంతరం హేడన్ మాట్లాడూతూ.. "బ్యాటర్ల కంటే ఫాస్ట్ బౌలర్లు ఎక్కువగా ఆలసిపోతారు. ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ కూడా బాగా ఆలసిపోయినట్లు కన్పిస్తున్నాడు. విరాట్ కోహ్లి కూడా ఇటువంటి సమస్యనే ఎదుర్కొన్నాడు. అతడు కొంత కాలం పాటు విశ్రాంతి తీసుకుని జట్టులో మళ్లీ చేరాడు. ఇప్పుడు విరాట్ తిరిగి తన ఫామ్‌ను పొందాడు. కాబట్టి భువీ కూడా విశ్రాంతి తీసుకుని వచ్చి చెలరేగుతాడు. ఏ బౌలరైనా బాగా అలసి పోతే.. అతడు బంతితో ఏకాగ్రత సాధించలేడు. భువీ అద్భుతమైన బౌలర్. అతడికి కాస్త విశ్రాంతి లభిస్తే తన ఫామ్‌ను తిరిగి పొందుతాడని నేను ఆశిస్తున్నాను. అదే విధంగా టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా, భువీ జోడీ భారత జట్టుకు కీలకం కాబోతుంది అని పేర్కొన్నాడు. కాగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భువీకి రెస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: IND vs SA: టీమిండియాతో టీ20 సిరీస్.. భారత్‌కు చేరుకున్న దక్షిణాఫ్రికా జట్టు -
'అవమానించాలని కాదు.. అసలు దినేశ్ కార్తిక్ రోల్ ఏంటి?'
టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తిక్‌కు ఫినిషర్ అనే ట్యాగ్ తగిలించి బీసీసీఐ అతనికి జట్టులో చోటు కల్పించింది. ఈ ఏడాది ఐపీఎల్లో ఆర్సీబీ తరపున కార్తిక్ ఫినిషర్‌గా అదరగొట్టాడు. ఆ తర్వాత కొన్ని మ్యాచ్‌ల్లో టీమిండియా తరపున ఫినిషింగ్ పాత్రలో మెరిశాడు. ఇక ధోని తర్వాత సరైన ఫినిషర్ దొరికాడు అని అభిమానులు భావించేలోపే అతని స్థానాన్ని బీసీసీఐ ప్రశ్నార్థకం చేసింది. ఫినిషర్ అంటే చివరగా వచ్చి ధాటిగా ఆడడం అని అందరికి తెలుసు. ఐపీఎల్ తర్వాత టీమిండియా ఆడిన ప్రతీ టి20 సిరీస్‌కు కార్తిక్‌ను ఎంపిక చేస్తూ వచ్చింది. కానీ తుది జట్టులో మాత్రం అవకాశాలు తక్కువగా వచ్చేవి. ఒకవేళ జట్టులో చోటు దక్కినా ఎక్కడో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. మరి బీసీసీఐ ఫినిషర్ పాత్రకు ఎంతవరకు న్యాయం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20లో అక్షర్ పటేల్ తర్వాత దినేశ్ కార్తిక్ బ్యాటింగ్ రావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఒక ఫినిషర్ అని పేర్కొని ఆరో స్థానంలో పంపకుండా.. అక్షర్ పటేల్ తర్వాత పంపడం ఏంటని విరుచుకుపడ్డారు. కార్తిక్ క్రీజులోకి వచ్చే సమయానికి పట్టుమని పది బంతులు కూడా ఉండడం లేదు. తొలి బంతినే హిట్టింగ్ చేయాలనడం కరెక్ట్ కాదు.. ఏ బ్యాటర్ అయినా కుదురుకోవడానికి రెండు, మూడు బంతులు తీసుకుంటాడు. మరి అలా చూసుకుంటే కార్తిక్‌కు అసలు కుదురుకోవడానికి టైం కూడా ఉండడం లేదు. ఇక ఫినిషర్ పాత్రకు ఎలా న్యాయం చేయగలడు. ఇదే విషయమై ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ మాథ్యూ హెడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'' దినేశ్ కార్తిక్‌ను అవమానించాలని కాదు.. అసలు అతని రోల్ ఏంటనేది నాకు క్లారిటీ లేదు. ఫినిషర్ అనేవాడు పూర్తిస్థాయి బ్యాటర్స్ ఔటైన తర్వాత బరిలోకి దిగుతారు. కానీ ఆల్‌రౌండర్ తర్వాత కార్తిక్ బ్యాటింగ్‌కు రావడం అంతుచిక్కని ప్రశ్నలా మారింది. ఇలా చేస్తే రోహిత్ స్ట్రాటజీ వర్క్‌వుట్ కాదు. అందుకోసం బ్యాటింగ్ ఆర్డర్లో కార్తిక్‌కు ప్రమోషన్ ఇవ్వాల్సిందే. టి20 ప్రపంచకప్ వరకు కార్తిక్‌కు ఇచ్చిన ఫినిషర్ రోల్‌ను సమర్థంగా వాడుకోవాలి.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20లో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఫీల్డింగ్, బౌలింగ్ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది. శుక్రవారం నాగ్‌పూర్ వేదికగా జరగనున్న రెండో టి20లో ఇలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని టీమిండియా భావిస్తోంది. ఇక రెండో టి20 కోసం నాగ్‌పూర్ చేరుకున్న ఇరుజట్ల ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. చదవండి: Ind Vs Aus: కోహ్లి, పాండ్యా మినహా వాళ్లంతా వేస్ట్! అధిక బరువు కారణంగా.. కోహ్లిని కలిసిన వివాదాస్పద పారిశ్రామికవేత్త -
T20 World Cup 2022: పాకిస్తాన్ మెంటార్‌గా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్..
టీ20 ప్రపంచకప్-2022కు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మెగా ఈవెంట్ కోసంతమ జట్టు మెంటార్‌గా ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం మాథ్యూ హేడెన్‌ను పిసిబీ నియమించింది. కాగా గతేడాది టీ20 ప్రపంచకప్‌లో కూగా హేడెన్ పాకిస్తాన్ మెంటార్‌గా వ్యవహరించాడు. టీ20 ప్రపంచకప్-2021లో పాకిస్తాన్ అద్భుతంగా రాణించింది. అనూహ్యంగా సెమీఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమి చెంది టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఈ ఏడాది టోర్నీలో పాక్ హెడ్ కోచ్ సక్లైన్ ముస్తాక్, ఇతర సహాయక సిబ్బందితో కలిసి హేడెన్ పనిచేయున్నాడు. కాగా అతడు ఆక్టోబర్ 15న పాకిస్తాన్ జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్ స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌తో పాటు న్యూజిలాండ్ వేదికగా జరగనున్న ముక్కోణపు సిరీస్‌లో ఆడనుంది. ఇక ప్రస్తుతం జరుగుతోన్న ఆసియాకప్‌లో పాకిస్తాన్ ఫైనల్లో అడుగుపెట్టింది. సెప్టెంబర్11న దుబాయ్ వేదికగా జరగనున్న ఫైనల్లో శ్రీలంకతో పాక్ తలపడనుంది. చదవండి: Asia Cup 2022: తొలిసారి బౌలింగ్ చేసిన దినేష్ కార్తీక్.. వీడియో వైరల్! -
"అతడికి అంతర్జాతీయ క్రికెట్ ఆడే సత్తా ఉంది.. త్వరలోనే టీమిండియాలోకి వస్తాడు"
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రాహుల్ త్రిపాఠిపై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ప్రశంసలు వర్షం కురిపించాడు. ఐపీఎల్-2022లో రాహుల్ త్రిపాఠి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్లో మూడు అర్ధసెంచరీలు సాధించాడు. ఇక మంగళవారం (మే 17) ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో త్రిపాఠి సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 44 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఈ క్రమంలో త్వరలోనే భారత జట్టు తరపున త్రిపాఠి అరంగేట్రం చేస్తాడని హేడెన్ అభిప్రాయపడ్డాడు. కాగా త్వరలో దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్‌కు త్రిపాఠి ఎంపికయ్యే అవకాశం ఉంది. "రాహుల్ త్రిపాఠి అద్భుతంగా ఆడుతున్నాడు. అతడు ధాటిగా బ్యాటింగ్ చేసే విధానం నన్ను ఎంత గానే ఆకట్టుకుంది. అతడు విధ్వంసకర ఆటగాడు. బంతిని మైదానంలో అన్ని వైపులా కొట్టగలడు. ముఖ్యంగా షార్ట్ పిచ్ బౌలింగ్‌కు త్రిపాఠి అద్భుతంగా ఆడగలడు. అతడు త్వరలో భారత జట్టులోకి వస్తాడని నేను అశిస్తున్నాను. ఆస్ట్రేలియా వంటి బౌన్సీ పిచ్‌లపై ఆడే సత్తా త్రిపాఠికి ఉంది" అని హేడెన్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: అతడి వల్లే సన్‌రైజర్స్‌కు విజయాలు.. బుమ్రా బౌలింగ్‌నూ చితక్కొట్టేస్తాడు! టీ20 సిరీస్‌కు ఎంపిక చేయండి! -
T20 World Cup: గెలిచింది మన జట్టే కదా.. మనోడే కదా
మాథ్యూ హేడెన్.. జస్టిన్ లాంగర్.. వీరిద్దరు ఒకప్పుడు ఆసీస్‌కు ఓపెనింగ్ జోడీ. 2000 దశకంలో వీరు ఆసీస్ క్రికెట్‌ను ఒక ఊపు ఊపేశారు. ప్రధానంగా టెస్టుల్లో ఈ జోడీ అత్యంత భయంకరమైన జోడీగా గుర్తింపు పొందింది. టెస్టుల్లో ఆసీస్‌కు అత్యుత్తమ ఓపెనింగ్ ద్వయంగా నిలిచింది. టెస్టు క్రికెట్లో ఈ జోడి ఆసీస్ తరఫున నాల్గో అత్యుత్తమ ఇన్నింగ్స్‌ను నమోదు చేయడం వారు సక్సెస్ఫుల్ జోడీగా చెప్పడానికి ఒక ఉదాహరణ. 2004లో శ్రీలంకపై చేసిన 255 పరుగుల వీరి తొలి వికెట్ అత్యుత్తమ భాగస్వామ్యం. ఇదిలా ఉంచితే, వీరిద్దరూ ఇప్పుడు ప్రత్యర్థులుగా తలపడ్డారు. కానీ ముఖాముఖి పోరులో కాదు.. కోచ్‌లుగా అమీతుమీ తేల్చకున్నారు. ప్రస్తుతం యూఏఈ వేదికగా జరిగే టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా మాథ్యూ హేడెన్ పాకిస్తాన్ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పనిచేస్తుంటే, ఆసీస్‌కు జస్టిన్ లాంగర్ కోచ్‌గా ఉన్నాడు. కాగా, గురువారం జరిగిన సెమీ ఫైనల్లో పాకిస్తాన్‌పై ఆసీస్ విజయం సాధించడంతో లాంగర్‌దే పైచేయి అయ్యింది. పాకిస్తాన్‌పై ఆసీస్ విజయం సాధించడంతో ఫైనల్లోకి ప్రవేశించింది. 2010 తర్వాత టీ20 వరల్డ్‌కప్‌లో ఆసీస్ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. ఓవరాల్‌గా ఈ పొట్టి ఫార్మాట్ వరల్డ్‌కప్‌లో ఆసీస్ రెండుసార్లు మాత్రమే తుది పోరుకు అర్హత సాధించింది. మరొకవైపు ఈ వరల్డ్‌కప్‌లో బ్యాటింగ్‌లో పాకిస్తాన్ రాణించడంతో హేడెన్ హీరో అయ్యాడు. తొలి మ్యాచ్ మొదలుకొని చూస్తే పాకిస్తాన్ బ్యాటింగ్ పదును పెరిగింది. ఇది గత పాకిస్తాన్ క్రికెట్ జట్టేనే అన్నట్లుగా మెరిసింది. ఇందుకు హేడెన్ ప్రధాన కారణమనే చర్చ తెరపైకి వచ్చింది. హేడెన్ బ్యాటింగ్ వ్యూహాలతోనే పాకిస్తాన్ అద్బుతమైన ఫలితాలు సాధించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 12 జట్లు తలపడే టీ 20వరల్డ్‌కప్‌లో పాక్ జట్టు సెమీస్‌కు చేరుతుందనే అంచనాలు పెద్దగా లేవు. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో ఘోరమైన ప్రదర్శన కారణంతో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టడమే ఆ జట్టుపై పెద్దగా అంచనాలు లేకపోవడానికి కారణం. కానీ అంచనాలను తలక్రిందులు చేస్తూ పాకిస్తాన్ సెమీస్‌కు రావడమే కాకుండా, బెస్ట్ ఆఫ్ ఫోర్లో గట్టిపోటీ ఇచ్చింది. ఈ వరల్డ్‌కప్ సెమీ ఫైనల్లో తొలుత ఆ జట్టు బ్యాటింగ్ చేసిన తీరు పాకిస్తాన్ ఫైనల్‌కు చేరుతుందని అంతా అనుకున్నారు. బోర్డుపై 177 పరుగుల టార్గెట్‌ను ఉంచడంతో పాకిస్తాన్ విజయం సాధిస్తుందని సగటు అభిమాని భావించాడు. కానీ మాథ్యూ వేడ్, స్టోయినిస్‌ల మెరుపు ఇన్నింగ్స్‌లు ఆసీస్‌ను గెలిపించాయి. ఒకవేళ నిన్నటి మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలుచుంటే ఆ క్రెడిట్ కచ్చితంగా హేడెన్ ఖాతాలోకి వెళ్లేది. కానీ ఆసీస్ ఫైనల్‌కు చేరడంతో మిత్రడు హేడెన్‌పై లాంగర్‌దే ఆధిక్యమైంది. దీంతో ‘ఎవరు గెలిస్తే ఏముంది’.. గెలిచింది మన జట్టే కదా.. మనోడే కదా అని హేడెన్ సర్దిచెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
హేడెన్‌కు ఖురాన్‌ను బహుకరించిన రిజ్వాన్.. పాక్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Mohammad Rizwan Gifts Holy Quran To Matthew Hayden: ఆసీస్ లెజెండరీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ పర్యవేక్షనలో పాకిస్థాన్ జట్టు టీ20 ప్రపంచకప్-2021లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ ఇవాళ(నవంబర్ 11) రెండో సెమీ ఫైనల్స్‌లో భాగంగా బలమైన ఆసీస్ జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో పాక్ బ్యాటింగ్ కోచ్ హేడెన్, ఆ జట్టు స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్‌కు సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల కిందట రిజ్వాన్, పాక్ బ్యాటింగ్ కోచ్ హేడెన్‌కు పవిత్ర ఖురాన్ యొక్క ఇంగ్లీష్ వర్షెన్‌ను బహుకరించాడు. ఈ విషయాన్ని హేడెనే స్వయంగా వెల్లడించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను పాక్ క్రికెట్ జట్టు యొక్క ఆధ్యాత్మిక సంస్కృతికి ఆకర్శితుడినయ్యానని, స్వతాహాగా క్రిస్టియన్నే అయినప్పటికీ ఇస్లాం పట్ల ఆసక్తితో ఉన్నానని వ్యాఖ్యానించాడు. రిజ్వాన్ తనకు ఇస్లాం విశ్వాసాల గురించి ఉపదేశిస్తుంటాడని.. అవి తనను బాగా ప్రభావితం చేశాయని.. ఈ క్రమంలో తాను కూడా క్రమం తప్పకుండా ఖురాన్‌ను చదవడం ప్రారంభించానని తెలిపాడు. ఈ సందర్భంగా హేడెన్ రిజ్వాన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. రిజ్వాన్ అసాధారణమైన బ్యాటర్ అని, అంతకుమించి ఛాంపియన్ హ్యుమన్ అని కొనియాడాడు. రిజ్వాన్ తనకు పవిత్ర కానుకను బహుకరించిన క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నాడు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా ఇవాళ ఆసీస్‌తో జరగనున్న కీలక సెమీస్ సమరంలో రిజ్వాన్ ఆడేది లేనిది అనుమానంగా మారింది. గత రెండు రోజులుగా రిజ్వాన్ ఫ్లూతో బాధపడుతున్నట్లు పాక్ వర్గాల సమాచారం. చదవండి: Aus Vs Pak: పాకిస్తాన్‌దే విజయం.. చరిత్రను తిరగరాస్తుంది: టీమిండియా మాజీ క్రికెటర్ -
భారత్, పాక్ పోరుకు ఏదీ సాటి రాదు!
Matthew Hayden Comments On India- Pak match: క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య కనిపించే వైరానికి మరేదీ సాటి రాదని ఆ్రస్టేలియా మాజీ ఆటగాడు, పాక్ జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్ మాథ్యూ హేడెన్ అభిప్రాయ పడ్డాడు. ఆటగాడిగా తన కెరీర్లో యాషెస్ సమరాన్ని గొప్పగా భావించినా...ఒక ప్రేక్షకుడిగా చూసే కోణంలో భారత్, పాక్ మ్యాచ్‌పై ఉండే ఆసక్తి ఎక్కడా కనిపించదని అతను అన్నాడు. ఈ సారి భారత్‌పై పాక్ విజయం సాధిస్తుందని హేడెన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. అయితే టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్, వికెట్‌కీపర్ రిషబ్ పంత్‌ల నుంచే పాక్‌కు ప్రధాన ముప్పు పొంచి ఉందని హెచ్చరించాడు. కాగా అక్టోబర్ 24న దాయాది పాకిస్తాన్ తన తొలి మ్యాచ్‌లో తలపడనుంది. చదవండి: T20 WC 2021 IND Vs PAK: ఆ ఇద్దరు టీమిండియా క్రికెటర్ల నుంచే పాక్‌కు ముప్పు.. పాక్ బ్యాటింగ్ కోచ్ -
ఆ ఇద్దరు టీమిండియా క్రికెటర్ల నుంచే పాక్‌కు ముప్పు.. పాక్ బ్యాటింగ్ కోచ్
Pakistan Has Major Threat From KL Rahul And Pant Says Matthew Hayden: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య ఈ నెల 24న జరగబోయే హై ఓల్టేజ్ మ్యాచ్‌పై పాక్ బ్యాటింగ్ సలహాదారు, ఆసీస్ మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్, వికెట్‌కీపర్ రిషబ్ పంత్‌ల నుంచే పాక్‌కు ప్రధాన ముప్పు పొంచి ఉందని హెచ్చరించాడు. రాహుల్ ముప్పు నుంచి తప్పించుకుంటే.. రిషబ్ పంత్ రూపంలో మరో ఉపద్రవం కాసుకుని ఉంటుందని అలర్ట్ చేశాడు. వీరిద్దరూ ప్రత్యర్ధి ఎవరైనా విచక్షణారాహిత్యంగా విరుచుకుపడతారని, ఇది పాక్‌కు చాలా ప్రమాదమని, వీరిని త్వరగా పెవిలియన్‌కు పంపగలిగితే పాక్ సగం విజయం సాధించినట్లేనని అభిప్రాయపడ్డాడు. ఇదే సందర్భంగా ఆయన పాక్ సారధి బాబర్ ఆజమ్‌పై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. బాబర్ ఆజమ్ గొప్ప నాయకుడని.. ధోని, ఇయాన్ మోర్గాన్‌లా అతడు కూడా జట్టును సమర్ధవంతంగా నడిపించగలడని అన్నాడు. భారత్, పాక్ మ్యాచ్ అంటే సహజంగానే ఇరు జట్ల కెప్టెన్లపై ఒత్తిడి ఉంటుందని, అయితే ఈసారి ఇది బాబర్‌పై కాసింత ఎక్కువగానే ఉందని పేర్కొన్నాడు. బాబర్ ప్రస్తుత ఫామ్ దృష్ట్యా భారత బౌలర్లు అతన్నే టార్గెట్‌గా చేసుకుంటారని, ఈ విషయంలో పాక్ సారధి అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించాడు. కాగా, పాక్‌తో పోరుకు ముందు జరిగిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదే ఊపులో అక్టోబర్ 24న దాయాది పాక్‌ను సైతం మట్టికరిపించాలని కోహ్లి సేన భావిస్తోంది. ఇప్పటి వరకు పొట్టి ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్‌దే పైచేయిగా ఉంది. ఈ మెగా టోర్నీలో భారత్.. పాక్ చేతిలో ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. చదవండి: తృటిలో తప్పించుకున్న పపువా; టి 20 ప్రపంచకప్ చరిత్రలో అత్యల్ప స్కోర్లు -
ఐపీఎల్లో ధోనినే నా అత్యంత విలువైన ఆటగాడు...
Matthew Hayden Comments on Ms Dhoni Captaincy: ఐపీఎల్2021 సెకెండ్ ఫేజ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానంలో నిలిచి ఇప్పటికే ప్లేఆప్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకుంది. ఈ క్రమంలో ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పై ఆసీస్ మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్2021లో ఎంఎస్ ధోనీ తన అత్యంత విలువైన ఆటగాడని అతడు తెలిపాడు. ఐపీఎల్ రెండోదశలో ధోని కెప్టెన్సీ వ్యూహాల కారణంగా చెన్నై వరుస విజయాలు సాదిస్తుందని.. ఈ ఘనత పూర్తిగా అతడికే చెందుతుందని హేడెన్ ఆభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్‌లో ధోని రాణించక పోయినప్పటి తన చాణుక్య బుర్రతో ఆ జట్టును నడిపిస్తున్నాడని అతడు వెల్లడించాడు. ఐపిఎల్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలను ధోనీ తన భుజాన వేసుకున్నాడు అని ఈ ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ వివరించాడు. అంతేగాక కెప్టెన్‌గా జట్టు ఎంపిక లో ధోని మార్క్ సృఫ్టంగా కనిపిస్తుందని హేడెన్ తెలిపాడు. కాగా చెన్నై దుబాయ్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నేడు తలపడనుంది. చదవండి: పాకిస్తాన్ హెడ్ కోచ్‌గా మాజీ దిగ్గజ ఆటగాడు!