ధోని చాలా డిస్టర్బ్‌ చేశాడు | MS Dhoni The Real Universe Boss, Whistle Podu, Says Matthew Hayden | Sakshi
Sakshi News home page

ధోని చాలా డిస్టర్బ్‌ చేశాడు : హెడెన్‌

Published Thu, Apr 26 2018 12:46 PM | Last Updated on Fri, May 25 2018 7:45 PM

MS Dhoni The Real Universe Boss, Whistle Podu, Says Matthew Hayden - Sakshi

ఎంఎస్‌ ధోని సిక్సర్ల మోత..

సాక్షి, బెంగుళూరు: చెన్నై సూపర్‌ కింగ్స్‌, బెంగుళూరు రాయల్‌ చాలెంజర్స్‌ మధ్య బుధవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఎంఎస్‌ ధోని, అంబటి రాయుడు సిక్సర్లతో చెలరేగిపోయారు. ధాటిగా ఆడి 101 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో 5 వికెట్ల తేడాతో చైన్నై జట్టు అద్భుత విజయం సాధించింది. 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన సీఎస్‌కే జట్టుపై అభిమానులు, క్రికెట్‌ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇక చాలాకాలం తర్వాత సిక్సర్ల మోత మోగించి జట్టుకు అనూహ్య విజయాన్నందించిన ‘మిస్టర్‌ కూల్‌’ ధోనిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మాథ్యూ హెడెన్‌ తన అభిమానాన్ని చాటుకున్నాడు. ధోని వీరోచిత హిట్టింగ్‌పై ట్వీటర్‌లో కామెంట్లు చేశాడు. ‘ఓరి దేవుడా కాసేపు పడుకుందామనుకుంటే సిక్సర్ల వర్షంతో నా నిద్రకు భంగం కల్గించారు. చైన్నైకి అద్భుత విజయాన్ని అందించారు. కానీ నా నిద్ర మాత్రం డిస్టర్బ్‌ అయ్యింది. ఎంతైనా ఎంఎస్‌ ధోని విశ్వ విఖ్యాత ఆటగాడు. మీ ఆటకు విజిల్‌ వేయాల్సిందే...(విజిల్‌ పోడు)’ అంటూ హెడెన్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇక అంబటి రాయుడి విజృంభణ ఈ ఐపీఎల్‌ సీజన్‌ చివరి వరకు కొనసాగుతుందంటూ హెడెన్‌ ఆకాంక్షించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement