
చెన్నై: ఆసీస్ మాజీ క్రికెటర్ షేన్ వార్న్ విసిరిన సవాల్‌ను చాలెంజ్‌గా స్వీకరించాడు ఆ దేశానికి చెందిన మరో మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్. ప్రస్తుత ఐపీఎల్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న హేడెన్.. చెన్నై టి.నగర్‌లో మారువేషంలో షాపింగ్ చేశాడు. తెల్ల పట్టు లుంగీ, లైట్ పింక్ కలర్ షర్ట్ ధరించడంతోపాటు తనను ఎవరూ గుర్తు పట్టకుండా గడ్డం పెట్టుకున్న హేడెన్ షాపింగ్ చేశాడు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కొన్ని రోజుల క్రితం చెన్నైలో షాపింగ్ చేయాలంటూ హేడెన్‌ను వార్న్ సవాల్ చేశాడు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న హేడెన్.. ఇలా షాపింగ్ చేసి చూపించాడు.
Comments
Please login to add a commentAdd a comment