నేను అలా అనలేదు: వార్న్‌ | Shane Warne did not call for Ricky Ponting to be banned from IPL 2019 | Sakshi
Sakshi News home page

నేను అలా అనలేదు: వార్న్‌

Published Fri, Feb 15 2019 1:06 PM | Last Updated on Fri, Feb 15 2019 1:27 PM

Shane Warne did not call for Ricky Ponting to be banned from IPL 2019 - Sakshi

ఢిల్లీ: ఆస్ట్రేలియా అసిస్టెంట్‌ కోచ్‌గా ఎంపికైన రికీ పాంటింగ్‌ను త్వరలో ఆరంభం కానున్న ఐపీఎల్‌లో ఢిల్లీ కేపిటల్స్‌ కోచ్‌గా తప్పించాలంటే తాను వ్యాఖ్యానించినట్లు వచ్చిన వార్తలను షేన్‌ వార్న్‌ ఖండించాడు. తాను పాంటింగ్‌ను ఢిల్లీ కోచ్‌గా తప్పించమంటూ భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)ను కోరినట్లు వచ్చినట్లు వార్తల్లో ఎటువంటి నిజం లేదన్నాడు.

‘ పాంటింగ్‌ను ఐపీఎల్‌ నుంచి తప్పించాలంటూ నేను కోరినట్లు మీడియాలో వెలుగు చూసినవి రూమర్స్‌ మాత్రమే. వాటిలో ఎంతమాత్రం వాస్తవం లేదు. ఇటువంటి చెత్త న్యూస్‌ను ఆపండి. ఒకవేళ పాంటింగ్‌ను ఢిల్లీ కోచ్‌గా తీసేయమని నేను కోరితే అది కచ్చితంగా అది ఒక అవివేకమైన చర్య.  అది బీసీసీఐ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది’ అని వార్న్‌ తెలిపాడు.  పరస్పర విరుద్ధ ప్రయోజనాలు అంశాన్ని బీసీసీఐ పరిగణలోకి తీసుకుని పాంటింగ్‌ను ఐపీఎల్‌లో ఢిల్లీ కోచ్‌గా కొనసాగేందుకు అడ్డుపడితే.. అందుకు అంగీకరించేందుకు కూడా పాంటింగ్‌ సిద్ధంగా ఉండాలని వార్న్‌ ముక్తాయింపు ఇచ్చాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement