టీమిండియా యవ సంచలనం యశస్వీ జైశ్వాల్‌పై ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ మాథ్యూ హేడెన్ ప్రశంసల వర్షం కురిపించాడు. జైశ్వాల్ అద్భుతమైన ఆటగాడని హేడన్ కొనియాడాడు. అయితే రాబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా బౌలర్ల నుంచి యశస్వీ కఠినమైన పరీక్షను ఎదుర్కొంటాడని అతడు అభిప్రాయపడ్డాడు.
జైశ్వాల్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్. భారత్‌కు క్రికెట్‌కు దొరికిన విలువైన ఆస్తి. అతడి స్ట్రోక్‌ప్లే అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా యశస్వీ కవర్స్‌పై నుంచి ఆడే షాట్స్ గురుంచి ఎంతచెప్పుకున్న తక్కువే. అతడు తన బ్యాటింగ్ స్కిల్స్‌తో నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అయితే బౌన్సీ పిచ్‌లపై ఎలా ఆడుతాన్నది చూడాలి.
జైశ్వాల్ బంతిని హార్డ్‌గా హిట్ చేయడం మనం చాలా సార్లు చూశాం. కానీ ఆస్ట్రేలియా పిచ్‌లలో హార్డ్ హిట్టింగ్ చేయడం అంత ఈజీకాదు. వరల్డ్‌క్లాస్ బౌలర్ల నుంచి జైశ్వాల్‌కు బిగ్ ఛాలెంజ్ ఎదురుకానుంది. పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్‌లను ఎదుర్కొనేందుకు యశస్వీ సిద్దంగా ఉండాలి.
అదే విధంగా మైదానాలు కూడా చాలా పెద్దవిగా ఉంటాయి. అక్కడ సిక్స్‌లు కొట్టడం అంత సులభం కాదు. షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోతే ఫీల్డర్‌కు ఈజీగా దొరికిపోతారు. కాబట్టి ఆసీస్ కండీషన్స్‌లో జైశ్వాల్ కాస్త ఆచితూచి ఆడాలని సీఈఏట్ క్రికెట్ రేటింగ్ అవార్డ్స్‌లో హేడన్ పేర్కొన్నాడు.
కాగా జైశ్వాల్ టెస్టుల్లో అద్భుతమైన రికార్డు ఉంది. కేవలం తొమ్మిది టెస్టులు మాత్రమే ఆడిన జైశ్వాల్ 70.07 స్ట్రైక్ రేటుతో 1028 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 3 సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఈ ఏడాది నవంబర్‌లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఆస్ట్రేలియాకు భారత జట్టు వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment