బ్రిస్బేన్ వేదికగా జరుగుతన్న మూడో టెస్టులో టీమిండియా దారుణ ప్రదర్శన కనబరిచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ కేవలం 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ ఇంకా 394 పరుగులు వెనకబడి ఉంది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్(33), రోహిత్ శర్మ (0)ఉన్నారు. నాలుగో రోజు ఆటలో భారత్ భవితవ్యం వీరిద్దరిపైనే ఆధారపడి ఉంది.
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మను ఉద్దేశించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మాథ్యూ హేడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాలుగో రోజు ఆటలో రోహిత్ తనదైన స్టైల్లో దూకుడుగా బ్యాటింగ్ చేయాలని హేడెన్ సూచించాడు. కాగా అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యాడు.
"రోహిత్ శర్మ ఫార్మాట్ ఏదైనా స్వేచ్ఛగా ఆడుతూ పరుగులు సాధిస్తాడు. వన్డే క్రికెట్‌లో రెండు డబుల్ సెంచరీలు, పొట్టి ఫార్మాట్‌లలో అతడు రికార్డులే అందుకు నిదర్శనం. కానీ ఇప్పుడు అతడు ఏంటో మళ్లీ నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. బ్రిస్బేన్‌లో రోహిత్ తన కోసమైనా ఫుల్ ఎఫెక్ట్‌తో ఆడాలి.
అతడు కొన్ని రోజుల విరామం తర్వాత అడిలైడ్‌లో ఆడాడు. బహుశా అందుకే రోహిత్ కాస్త నిదానంగా ఆడాడు. నేనే అతడితో పాటు క్రీజులో ఉండి ఉంటే, డిఫెన్స్ ఆడటం ఇష్టం లేదని చెప్పేవాడిని. రోహిత్ తన స్టైల్లో దూకుడుగా ఆడాలి.
అతడు పోరాటానికి సిద్ధంగా ఉన్నాడు. శక్తి, బాగా ఆడాలనే సంకల్పం అతడిని ముందుకు నడిపిస్తాయి. రోహిత్ నా సోదరుడు.. గొప్ప సంకల్పం, పూర్తి ఎనర్జీతో ఆడాలని కోరుకుంటున్నాను" అని హేడన్ స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
చదవండి: అదొక చెత్త క్రికెట్ బోర్డు.. అందుకే రాజీనామా: ఆసీస్ దిగ్గజం
Comments
Please login to add a commentAdd a comment