Suryakumar fails again in Asia Cup match vs Bangladesh: ఆసియా కప్-2023 టోర్నీలో రాక రాక వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకోయాడు టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 34 బంతులు ఎదుర్కొన్న ఈ ముంబై ఆటగాడు.. 3 ఫోర్ల సాయంతో 26 పరుగులు మాత్రమే సాధించాడు.
బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి వెనుదిరిగాడు. షాట్ సెలక్షన్‌లో తప్పిదంతో భారీ మూల్యం చెల్లించాడు. ఈ నేపథ్యంలో.. వన్డేల్లో సూర్య కంటే మెరుగైన రికార్డు ఉన్న సంజూ శాంసన్‌ను కాదని.. అతడికి అవకాశం ఇచ్చిన బీసీసీఐపై అభిమానులు ఫైర్ అవుతున్నారు.
అతడిని కాదని నీకు ఛాన్స్
సంజూను కావాలనే పక్కనపెట్టి.. ఈ టీ20 నంబర్ 1 బ్యాటర్‌కు ఇంకెన్ని ఛాన్స్‌లు ఇస్తారని.. ఇకనైనా సెలక్టర్లు కళ్లు తెరవాలని చురకలు అంటిస్తున్నారు. వన్డే వరల్డ్‌కప్-2023 జట్టులో సూర్యకుమార్‌ను ఆడిస్తే ఫలితం అనుభవించక తప్పదంటూ హెచ్చరిస్తున్నారు.
ఏడేళ్లు బెంచ్ మీదే
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ‘‘ప్రస్తుతం సూర్య మైండ్‌సెట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను కూడా ఆస్ట్రేలియా తరఫున ఆడుతున్నపుడు ఏడేళ్లు బెంచ్ మీదే కూర్చున్నా. ఐపీఎల్, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సూర్య స్ట్రైక్‌రేటు 170కి పైగా ఉంది. అయితే, వన్డేల్లో మాత్రం అతడు ఇంతవరకు తనను తాను నిరూపించుకోలేకపోయాడు.
అలాంటి మైండ్‌సెట్ మార్చుకో సూర్య
అందుకే ఎలాగైనా 50 ఓవర్ ఫార్మాట్‌లో రాణించి అభిమానుల నుంచి గౌరవం పొందాలనే ఒత్తిడిలో ఉన్నాడు. ఇలాంటి మైండ్‌సెట్ నుంచి సూర్య బయటపడాలి. విమర్శల గురించి మనం ఎంత ఎక్కువగా ఆలోచిస్తే.. మనపై ప్రతికూల ప్రభావం అంత ఎక్కువగా పడుతుంది.
అభద్రతాభావం మనల్ని వెంటాడుతుంది’’ అని సూర్యకుమార్ యాదవ్‌కు సలహాలు ఇచ్చాడు. ప్రపంచకప్‌లో సూర్య తప్పక రాణిస్తాడని తాను భావిస్తున్నానని.. అయితే ఈసారి తనను పూర్తిగా నిరాశపరిచాడని పేర్కొన్నాడు.
వన్డేల్లో సంజూ గణాంకాలు ఇలా
కాగా ఇప్పటి వరకు టీమిండియా తరఫున 27 వన్డేల్లో సూర్య.. 24.41 సగటుతో 537 పరుగులు సాధించాడు. ఇక మిడిలార్డర్‌లో స్థానం కోసం ఎదురుచూస్తున్న సంజూ శాంసన్.. 13 వన్డేలాడి 55.71 సగటుతో 390 పరుగులు చేశాడు.
చదవండి: SA Vs Aus: క్లాసెన్ సునామీ ఇన్నింగ్స్.. టీమిండియా ప్రపంచ రికార్డు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment