
Matthew Hayden On Indias World Cup Squad: వన్డే ప్రపంచకప్-2023కు కౌంట్ డౌన్ మొదలైంది. అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్-ఇంగ్లండ్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్ కోసం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి ఆగ్రశ్రేణి టీమ్స్ ఇప్పటికే తమ ప్రిలిమనరీ జట్లను కూడా ప్రకటించాయి. మరోవైపు భారత జట్టు కూడా వరల్డ్‌కప్ దిశగా అడుగులు వేస్తోంది.
ఈ మెగా టోర్నీకి ముందు ఆసియాకప్‌లో టీమిండియా తలపడనుంది. ఈ క్రమంలో ఆసియాకప్‌కు 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టును అజిత్ అగర్కార్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ జట్టునే వరల్డ్‌కప్‌కు కూడా కొనసాగించే అవకాశం ఉంది. ఇందులో 15 మంది సభ్యులను ఖారారు చేసి సెప్టెంబర్ 15లోపు ఐసీసీకి బీసీసీఐ సమర్పించనుంది. కాగా ఈ టోర్నీతో స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్,
వరల్డ్‌కప్‌కు భారత జట్టు ఇదే..
ఇక ఇది ఇలా ఉండగా.. వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యలతో కూడిన భారత జట్టును ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హేడెన్ ఎంచుకున్నాడు. అతడు ఎంపిక చేసిన జట్టులో మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్,యజువేంద్ర చాహల్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం. అదే విధంగా వికెట్ కీపర్లగా ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ ఇద్దరికీ హేడన్ ఛాన్స్ ఇచ్చాడు.
స్పెషలిస్ట్ స్పిన్నర్లగా రవీంద్ర జడేజా, అక్షర్‌పటేల్‌కు మాత్రమే చోటు దక్కింది. అదే విధంగా స్పెషలిస్ట్ బ్యాటర్లగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్‌కు హేడన్ అవకాశం కల్పించాడు. మరోవైపు సిరాజ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, శార్ధూల్ ఠాకూర్ రూపంలో నలుగురు పేసర్లు హేడన్ ఎంపిక చేసిన జట్టులో ఉన్నారు.
హేడన్ ఎంపిక చేసిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ మరియు అక్షర్ పటేల్.
చదవండి: IBSA World Games 2023: భారత్‌కు సిల్వర్ మెడల్
Comments
Please login to add a commentAdd a comment