వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే.. సంజూ, తిలక్‌ వర్మకు నో ఛాన్స్‌! | India Team for ODI World Cup 2023 finalised, KL Rahul in but no Sanju | Sakshi
Sakshi News home page

World Cup 2023: వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే.. సంజూ, తిలక్‌ వర్మకు నో ఛాన్స్‌!

Published Sun, Sep 3 2023 11:27 AM | Last Updated on Sun, Sep 3 2023 12:53 PM

India Team for ODI World Cup 2023 finalised, KL Rahul in but no Sanju  - Sakshi

వన్డే ప్రపంచకప్-2023కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. శనివారం అర్ధ రాత్రి భారత ఛీప్‌ సెలక్టర్‌ అజిత్‌ అగర్కార్‌.. శ్రీలంకలో ఉన్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, రాహుల్‌ ద్రవిడ్‌తో సమావేశమైనట్లు సమాచారం.

ఈ మీటింగ్‌లోనే వరల్డ్‌కప్‌లో పాల్గోనే జట్టును ఖారారు చేసినట్లు జాతీయ మీడియా కథనాలు వెలువరిస్తోంది. ఈ జట్టులో యువ ఆటగాడు తిలక్‌ వర్మ, సంజూ శాంసన్‌, ప్రసిద్ద్‌ కృష్ణకు చోటుదక్కపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఆసియాకప్‌కు ప్రకటించిన 17 మంది సభ్యల జట్టులో వీరి ముగ్గురికి చోటు దక్కింది. 

అయితే ప్రధాన టోర్నీకి మాత్రం వీరికి సెలక్టర్లు మొండి చేయిచూపినట్లు తెలుస్తోంది. అదేవిధంగా యుజువేంద్ర చాహల్‌ వైపు కూడా సెలక్టర్లు మొగ్గు చూపలేదని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

మరోవైపు స్టార్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ తన ఫిట్‌నెస్ నిరూపించుకున్నట్లు ఏన్సీఏ వర్గాలు వెల్లడించాయి. దీంతో అతడు కూడా ప్రపంచకప్‌ జట్టులో తన స్ధానాన్ని పదిలం చేసుకున్నాడు.

కాగా వన్డేప్రపంచకప్‌లో పాల్గోనే జట్లు తమ వివరాలను సెప్టెంబర్ 5లోపు ఐసీసీకి సమర్పించాలి. కాబట్టి సెప్టెంబర్‌ 4న భారత జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ అధికారింగా ప్రకటించే ఛాన్స్‌ ఉంది. ఇక ఈ మెగా టోర్నీలో భారత తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్‌ 7న ఆస్ట్రేలియాతో తలపడనుంది.

ప్రపంచకప్‌కు  భారత జట్టు: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌,  ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా(వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌
చదవండి: Asia Cup 2023: పాకిస్తాన్‌ బౌలర్‌ ఓవరాక్షన్‌.. బుద్దిచెప్పిన హార్దిక్‌ పాండ్యా! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement