రవీంద్ర జడేజా
ICC ODI WOrld CUp 2023: వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ ప్రధాన స్పిన్నర్‌గా షాదాబ్ ఖాన్‌ను ఎంచుకున్నాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్. టీమిండియాకు రవీంద్ర జడేజాలాగా పాక్‌కు షాదాబ్ ఉన్నాడని వ్యాఖ్యానించాడు. జడ్డూ మాదిరే అతడు కూడా త్రీ-డీ క్రికెటర్ అని పేర్కొన్నాడు.
కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఐసీసీ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. హైదరాబాద్, అహ్మదాబాద్‌లలో ఒక్కో మ్యాచ్‌లు ఆడనున్న దాయాది జట్టు.. చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో రెండేసి మ్యాచ్‌లు ఆడనుంది.
జడ్డూలా త్రీడీ ప్లేయర్.. డేంజరస్ హిట్టర్
ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షోలో ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ మాథ్యూ హెడెన్ పాకిస్తాన్‌కు ఈ మెగా ఈవెంట్‌లో షాదాబ్ ఖాన్ కీలకం కానున్నాడని పేర్కొన్నాడు. ‘‘షాబాద్ ఖాన్ అద్బుతమైన ఆటగాడు. తనకంటూ కొన్ని ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నాయి. జడ్డూ మాదిరే అతడు కూడా త్రీ- డైమెన్షనల్ క్రికెటర్.
ప్రత్యర్థి జట్టుకు వణుకు పుట్టించగల ప్రమాదకర హిట్టర్. బంతితోనూ అద్భుతంగా రాణించగలడు. అంతేకాదు అత్యద్భుతమైన ఫీల్డర్ కూడా! ఒక్కోసారి ఫీల్డింగ్ ఎఫర్ట్స్‌తో కూడా వరల్డ్‌కప్ గెలిచే అవకాశాలు ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు మరి!
కాబట్టి.. ఈసారి పాకిస్తాన్‌కు ఈ స్పిన్ ఆల్‌రౌండర్ కీలకం కానున్నాడని చెప్పవచ్చు’’ అని మాథ్యూ హెడెన్ వ్యాఖ్యానించాడు. కాగా 2017లో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన షాదాబ్ ఖాన్.. బౌలింగ్ ఆల్‌రౌండర్.
అందుకే అలా
పాక్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఈ 24 ఏళ్ల రైట్‌హ్యాండ్ బ్యాటర్ కీలక సభ్యుడు. ఇప్పటి వరకు ఆడిన 56 వన్డేల్లో 631 పరుగులు సాధించడంతో పాటు.. 73 వికెట్లు పడగొట్టాడు. కీలక సమయాల్లో జట్టును గెలిపించిన ఘనత అతడి సొంతం. ఈ నేపథ్యంలో బ్యాటర్, బౌలర్‌గా రాణించడంతో పాటు అద్భుత ఫీల్డింగ్ విన్యాసాలతో ఆకట్టుకుంటున్న షాబాద్‌ను హెడెన్ త్రీడీ ప్లేయర్‌గా అభివర్ణించాడు.
చదవండి: WC 2023: ఇప్పుడే అంతా అయిపోలేదు.. వెస్టిండీస్ అద్భుతాలు చేయగలదు!
సచిన్, గంగూలీ, వీరూకు కలిసి రాలేదు! కానీ ధోని రూటే సపరేటు కదా!
Comments
Please login to add a commentAdd a comment