
వారికి విదేశాల్లో గెలుస్తామనే నమ్మకం లేదు!
బ్రిస్బేన్: విదేశాల్లో గెలుస్తానే నమ్మకం లేకపోవడంతోనే టీమిండియా జట్టు వరుస ఓటములను కొనితెచ్చుకుంటుందని ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు టెస్టుల్లో వారికి ఎదరురైన చేదు అనుభవమే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నాడు. టీమిండియా అందివచ్చిన అవకాశాల్ని చేజిక్కించుకోవడంలో విఫలమయ్యి రెండు టెస్టుల్లో ఓటమి పాలైందన్నాడు. ఇందుకు వారికి విదేశాల్లో గెలుస్తామనే నమ్మకం లేకపోవడమే ప్రధాన కారణమన్నాడు.
రెండో టెస్టులో భాగంగా నాల్గో రోజు శిఖర ధావన్-విరాట్ కోహ్లీల వివాదం కూడా టీమిండియా ఓటమిపై తీవ్ర ప్రభావం చూపిందన్నాడు. ఏ ఆటగాడైనా భయంతో విఫలమైతే మాత్రం జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగే అవకాశం ఉండదని శిఖర్ ధావన్ ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించాడు.