టీమిండియా స్టార్ క్రికెటర్, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిని విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ముద్దుగా కింగ్ అని పిలుచుకుంటారన్న విషయం విధితమే. భారత క్రికెట్ అభిమానులైతే ఓ అడుగు ముందుకేసి కోహ్లి పేరులో కింగ్ అనే బిరుదును కలిపేశారు. కోహ్లికి కింగ్ అనే బిరుదు రావడానికి అతని గ్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఎంత కారణమో, అతని బిహేవియర్ కూడా అంతే కారణం.
ఫీల్డ్‌లో దూకుడుగా ఉండే కింగ్ కోహ్లి.. సందర్భానుసారంగా రియాక్ట్ అవుతూ చాలా హుందాగా కూడా కనిపిస్తాడు. ప్రత్యర్ధులు కవ్విస్తే ఉగ్రరూపం దాల్చే కోహ్లి.. అదే వారు కలిసిపోతే సరదాగా డ్యాన్స్‌లు వేస్తూ మైదానంలో ఉన్న ప్రేక్షకులను, ఫ్యాన్స్‌ను హుషారెక్కిస్తాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత విజయానంతరం కోహ్లి ఇలాగే ఓ పాపులర్ బాలీవుడ్ పాటకు స్టెప్పులేసి అలరించాడు.
Crowd was chanting 'RCB, RCB' - Virat Kohli told to stop it and chant 'India, India'. pic.twitter.com/kMd53wbYRU
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 20, 2023
తన ఆన్ ఫీల్డ్ ప్రవర్తనతో నిత్యం వార్తల్లో ఉండే కోహ్లి, న్యూఢిల్లీ వేదికగా ఆసీస్‌తో జరిగిన రెండో టెస్ట్ సందర్భంగా జరిగిన ఓ విషయంతో మరోసారి టాక్ ఆఫ్ ద సోషల్‌మీడియాగా నిలిచాడు. ఢిల్లీ టెస్ట్ మూడో రోజు ఆటలో విరాట్ కోహ్లి స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా.. స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకులు ఒక్కసారిగా ఆర్సీబీ.. ఆర్సీబీ.. అంటూ కేకలు వేయడం మొదలుపెట్టారు.
ఇది చూసిన కోహ్లి వారిని వారించి, ఆర్సీబీ అని కాకుండా ఇండియా.. ఇండియా అని తమను ఎంకరేజ్ చేయాలంటూ తన జెర్సీపై ఉన్న బీసీసీఐ ఎంబ్లెంని చూపిస్తూ ఫ్యాన్స్‌కు సైగ చేశాడు. కోహ్లి ఇలా చెప్పాడో లేదో.. ఇండియా.. ఇండియా.. అకే కేకలతో స్టేడియం మొత్తం మార్మోగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.
కోహ్లి దేశానికి ఇచ్చే ప్రాధాన్యతను కొనియాడుతూ అభిమానులు కామెంట్లతో సోషల్‌మీడియాను షేక్ చేస్తున్నారు. కింగ్ అనే బిరుదుకు కోహ్లి వంద శాతం అర్హుడని ఆకాశానికెత్తుతున్నారు. కోహ్లి చర్యతో మరోసారి భారత క్రికెట్ అభిమానుల మనసు దోచుకున్నాడని.. టీమిండియా తర్వాతే తన ఐపీఎల్ జట్టు అని కోహ్లి మరోసారి చాటాడని చర్చించుకుంటున్నారు.
ఇదిలా ఉంటే, న్యూఢిల్లీ టెస్ట్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. జడేజా 10 వికెట్లతో విజృంభించడంతో ఆసీస్ రెండు ఇన్నింగ్స్‌ల్లో పేకమేడలా కూలింది.
Comments
Please login to add a commentAdd a comment