
Viral Video: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. విశ్వవ్యాప్తంగా కింగ్ అంటే పడిచచ్చే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. సోషల్‌మీడియాలో రన్‌మెషీన్‌కు ఉన్న ఫాలోయింగే ఇందుకు నిదర్శనం. లివింగ్ సాకర్ లెజెండ్స్ లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్గో తర్వాత ప్రపంచవ్యాప్తంగా విరాట్ కోహ్లికి ఆ రేంజ్‌లో ఫ్యాన్స్ ఉన్నారు.
శత్రు దేశ అభిమానులు సైతం కోహ్లి ఆటకు, లుక్స్‌కు, యాటిట్యూడ్‌కు, బాడీ ఫిట్‌నెస్‌కు ఫిదా అవుతారు. ఇటీవల కొందరు అభిమానులు కోహ్లిని GOATగా (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) పరిగణించాలంటూ సోషల్‌మీడియాలో డిబేట్లు నిర్వహించారు. భారత అభిమానుల విషయానికొస్తే.. మగ, ఆడ.. ముసలి, ముతక.. చిన్న, పెద్ద.. అన్న తేడాతో లేకుండా కోహ్లి అంటే పడిచచ్చిపోతారు. కోహ్లిని టీవీల్లో చూస్తేనే పిచ్చెక్కిపోయే జనం.. అతన్ని చూసే అవకాశం లభించినా లేదా అతనితో ఫోటో దిగే ఛాన్స్ వచ్చినా ఉబ్బితబ్బిబైపోతారు. ఇది జరిగాక వీరిని పట్టుకోవడం చాలా కష్టం. అంతలా వీరు కోహ్లిపై తమ అభిమానాన్ని చాటుతూ రెచ్చిపోతారు.
తాజాగా ఓ లేడీ ఫ్యాన్.. కోహ్లి మైనపు బొమ్మ పెదాలపై ముద్దు పెడుతూ కనిపించింది. ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఈ వీడియోను చూస్తే ఆ అమ్మాయికి కోహ్లి అంటే ఏ రేంజ్‌లో పిచ్చి ఉందో ఇట్టే అర్ధమవుతుంది. కోహ్లి బొమ్మకు ముద్దు పెడుతూ, ఆ అమ్మాయి ప్రదర్శించిన హావభావాలు క్రికెట్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తున్నాయి. నెటిజన్లు ఈ వీడియోలో ఉన్న అమ్మాయి ఎవరో.. ఈ సన్నివేశం ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
Aisi ladkiyon se putle safe nahi hai pic.twitter.com/kaQybcLOOa
— Byomkesh (@byomkesbakshy) February 20, 2023
ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లి ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023తో బిజీగా ఉన్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన కోహ్లి.. తొలి టెస్ట్‌లో 12, రెండో టెస్ట్‌లో 44, 20 పరుగులు చేశాడు. ఇటీవలి కాలంలో టీ20, వన్డే ఫార్మాట్‌లో సెంచరీలు చేసిన కోహ్లి.. టెస్ట్‌ల్లో మాత్రం పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. కోహ్లి చివరిసారి టెస్ట్‌ల్లో సెంచరీ చేసింది 2019 నవంబర్ 22న. ఈ నేపథ్యంలో మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌లోనైనా కోహ్లి శతక్కొట్టాలని అతని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment