Virat Kohli Reveals The One Food Item He Will Never Eat, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Virat Kohli: ఆ ఒక్కటి ఎప్పటికీ తినను.. నెట్టింట హల్‌చల్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లీ తాజా వీడియో

Published Mon, Feb 20 2023 6:31 PM | Last Updated on Mon, Feb 20 2023 6:51 PM

Virat Kohli Reveals The One Food Item He Will Never Eat, Internet Relates - Sakshi

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి ఎంతటి భోజన ప్రియుడో క్రికెట్‌ అభిమానులకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తాజాగా ముగిసిన న్యూఢిల్లీ టెస్ట్‌లో వివాదాస్పద రీతిలో ఔటైయ్యానన్న విషయాన్ని సైతం పక్కకు పెట్టిన కోహ్లి..  తన ఫేవరెట్‌ చోలే కుల్చే కనపడగానే చిన్న పిల్లల తరహాలో చప్పట్లు కొట్టి, ఫస్ట్‌ నీ అంతూ చూస్తానన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్స్‌ పెట్టిన వీడియో సోషల్‌మీడియాలో ఎంతలా వైరలైందో మనందరం చూశాం.

తాజాగా విరాట్‌ ఫుడ్‌ హ్యాబిట్స్‌కు సంబంధించిన మరో వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాను షేక్‌ చేస్తుంది. ఆస్క్‌ మీ ఎనీ థింగ్‌ అనే ప్రోగ్రామ్‌లో కోహ్లి తన ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుతూ.. తన చీట్‌ మీల్‌ ఏంటి, తనకు అయిష్టమైన ఆహారం ఏంటీ, తాను తిన్న అతి భయంకరమైన వంటకమేంటి అన్న ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.

ఈ సందర్భంగా ప్రస్తుతానికి తాను శాఖాహారినని స్పష్టం చేసిన రన్‌ మెషీప్‌.. తన చీట్‌ మీల్‌ చోలే కుల్చే అని, తనకు అయిష్టమైన ఆహారం కాకరకాయ అని, తాను తిన్న అతి భయంకరమైన వంటకం మలేషియాలో ఓ సందర్భంలో తిన్న కీటకాల ఫ్రై అని సమాధానమిచ్చాడు. చీట్‌ మీల్‌పై అడిగిన ప్రశ్నకు తడుంకోకుండా సమాధానం చెప్పిన కోహ్లి.. తాను తినడానికి ఇష్టపడనని చెప్పిన కాకరకాయ గురించి చెప్పేముందు కాస్త ఆలోచించాడు.

తాను తిన్న భయంకరమైన వంటకం గురించి స్పందించే ముందు సైతం కోహ్లి దీర్ఘాలోచన చేశాడు. సదరు వంటకం గురించి అతను వివరిస్తూ.. ఓ సందర్భంలో తాను మలేషియాలో కీటకాలతో చేసిన ఫ్రై తిన్నానని, అది ఛండాలంగా ఉండిందని, తెలియక తాను ఆ వంటకాన్ని టేస్ట్‌ చేశానని చెప్పుకొచ్చాడు. కోహ్లి ఆహారపు అలవాట్ల గురించి ఇదివరకే చాలామంది క్రికెట్‌ అభిమానులకు తెలిసినప్పటికీ.. కోహ్లి తాజా వీడియో చూసేందుకు ఎగబడుతున్నారు. 

ఫిట్‌నెస్‌ కాపాడుకునేందుకు సర్వశక్తులు ఒడ్డే కోహ్లి.. తనకు ఎంతగానో ప్రీతిపాత్రమైన వంటకాలను ఆరగించే విషయంలో చాలా నిఖచ్చిగా ఉంటాడన్న విషయం అందరికీ తెలిసిందే.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023తో బిజీగా ఉన్న కోహ్లి.. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. తొలి టెస్ట్‌లో కేవలం 12 పరుగులు మాత్రమే చేసిన కింగ్‌.. రెండో టెస్ట్‌లో 44, 20 పరుగులు చేశాడు. ఇటీవలి కాలంలో టీ20, వన్డే ఫార్మాట్‌లో సెంచరీలు చేసిన కోహ్లి.. టెస్ట్‌ల్లో మాత్రం ఆ ఘనతను సాధించలేకపోయాడు. కోహ్లి చివరిసారి టెస్ట్‌ల్లో సెంచరీ చేసింది 2019 నవంబర్‌ 22న. ఈ నేపథ్యంలో మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌లోనైనా కోహ్లి శతక్కొట్టాలని అతని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement