chole-kulche
-
ఆ ఒక్కటి ఎప్పటికీ తినను.. నెట్టింట హల్చల్ చేస్తున్న విరాట్ కోహ్లీ తాజా వీడియో
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఎంతటి భోజన ప్రియుడో క్రికెట్ అభిమానులకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తాజాగా ముగిసిన న్యూఢిల్లీ టెస్ట్‌లో వివాదాస్పద రీతిలో ఔటైయ్యానన్న విషయాన్ని సైతం పక్కకు పెట్టిన కోహ్లి.. తన ఫేవరెట్ చోలే కుల్చే కనపడగానే చిన్న పిల్లల తరహాలో చప్పట్లు కొట్టి, ఫస్ట్ నీ అంతూ చూస్తానన్నట్లుగా ఎక్స్ప్రెషన్స్ పెట్టిన వీడియో సోషల్‌మీడియాలో ఎంతలా వైరలైందో మనందరం చూశాం. తాజాగా విరాట్ ఫుడ్ హ్యాబిట్స్‌కు సంబంధించిన మరో వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాను షేక్ చేస్తుంది. ఆస్క్ మీ ఎనీ థింగ్ అనే ప్రోగ్రామ్‌లో కోహ్లి తన ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడుతూ.. తన చీట్ మీల్ ఏంటి, తనకు అయిష్టమైన ఆహారం ఏంటీ, తాను తిన్న అతి భయంకరమైన వంటకమేంటి అన్న ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. Lesser-known facts! Catch me spill the beans on food, fashion, and more on Ep 2! Click here to explore more of Wrogn- https://t.co/lG4lxBGW2o@StayWrogn#StayWrogn #ad pic.twitter.com/dMXwglq7To — Virat Kohli (@imVkohli) February 20, 2023 ఈ సందర్భంగా ప్రస్తుతానికి తాను శాఖాహారినని స్పష్టం చేసిన రన్ మెషీప్.. తన చీట్ మీల్ చోలే కుల్చే అని, తనకు అయిష్టమైన ఆహారం కాకరకాయ అని, తాను తిన్న అతి భయంకరమైన వంటకం మలేషియాలో ఓ సందర్భంలో తిన్న కీటకాల ఫ్రై అని సమాధానమిచ్చాడు. చీట్ మీల్‌పై అడిగిన ప్రశ్నకు తడుంకోకుండా సమాధానం చెప్పిన కోహ్లి.. తాను తినడానికి ఇష్టపడనని చెప్పిన కాకరకాయ గురించి చెప్పేముందు కాస్త ఆలోచించాడు. తాను తిన్న భయంకరమైన వంటకం గురించి స్పందించే ముందు సైతం కోహ్లి దీర్ఘాలోచన చేశాడు. సదరు వంటకం గురించి అతను వివరిస్తూ.. ఓ సందర్భంలో తాను మలేషియాలో కీటకాలతో చేసిన ఫ్రై తిన్నానని, అది ఛండాలంగా ఉండిందని, తెలియక తాను ఆ వంటకాన్ని టేస్ట్ చేశానని చెప్పుకొచ్చాడు. కోహ్లి ఆహారపు అలవాట్ల గురించి ఇదివరకే చాలామంది క్రికెట్ అభిమానులకు తెలిసినప్పటికీ.. కోహ్లి తాజా వీడియో చూసేందుకు ఎగబడుతున్నారు. ఫిట్నెస్ కాపాడుకునేందుకు సర్వశక్తులు ఒడ్డే కోహ్లి.. తనకు ఎంతగానో ప్రీతిపాత్రమైన వంటకాలను ఆరగించే విషయంలో చాలా నిఖచ్చిగా ఉంటాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే, ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023తో బిజీగా ఉన్న కోహ్లి.. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. తొలి టెస్ట్‌లో కేవలం 12 పరుగులు మాత్రమే చేసిన కింగ్.. రెండో టెస్ట్‌లో 44, 20 పరుగులు చేశాడు. ఇటీవలి కాలంలో టీ20, వన్డే ఫార్మాట్లో సెంచరీలు చేసిన కోహ్లి.. టెస్ట్‌ల్లో మాత్రం ఆ ఘనతను సాధించలేకపోయాడు. కోహ్లి చివరిసారి టెస్ట్‌ల్లో సెంచరీ చేసింది 2019 నవంబర్ 22న. ఈ నేపథ్యంలో మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌లోనైనా కోహ్లి శతక్కొట్టాలని అతని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. -
ఇష్టమైన ఫుడ్ కంటపడింది.. రెండో ఇన్నింగ్స్‌లో ఇరగదీయడం ఖాయం
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఫెవరెట్ ఫుడ్ ఏంటో అందరికి తెలిసే ఉంటుంది. నార్త్ ఇండియాలో మాత్రమే దొరికే చోలే బచూర్(రోటి, శనగల కూర) అంటే కోహ్లికి అమితమైన ప్రేమ. మీకు అనుమానంగా ఉంటే గూగుల్‌లో కోహ్లికి ఇష్టమైన ఫుట్ ఏంటి అని వెతికితే కనిపించే పేరు చోలే బచూర్. చోలే బచూర్ తింటే తనకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుందని కోహ్లి కూడా చాలాసార్లు పేర్కొన్నాడు. తాజాగా దానిని మరోసారి నిరూపితం చేశాడు కోహ్లి. ఆస్ట్రేలియాతో ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బ్యాటింగ్ సమయంలో కోహ్లి, కోచ్ ద్రవిడ్ డ్రెస్సింగ్‌రూమ్ బయట కూర్చొని ఏదో విషయమై సీరియస్‌గా చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో కోహ్లి వద్దకు టీమిండియా సపోర్ట్ స్టాఫ్ ఒకరు వచ్చారు. కోహ్లి మాట్లాడుతుండగా పిలిచి చేతిలో ఉన్న చోలే బచూర్ను చూపించాడు. అంతే అప్పటివరకు సీరియస్‌గా ఉన్న కోహ్లి మూడ్ మొత్తం మారిపోయింది. కూర్చొన్న సీటులో నుంచే తనకిష్టమైన చోలే బచూర్ను చూసి క్లాప్స్ కొడుతూ.. సూపర్.. అక్కడ పెట్టండి వచ్చి తింటా అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చాడు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు కోహ్లికి చోలే బచూర్ అంటే ఎంత ఇష్టమో. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో షేర్ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది. వీడియో చూసిన క్రికెట్ అభిమానులు తమకు తోచిన రీతిలో కామెంట్లు పెట్టారు. ''ఇష్టమైన ఫుట్ కంటపడింది.. కోహ్లి ఇరగదీయడం ఖాయం.. చోలే బచూర్ చూస్తే చాలు కోహ్లిలో ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది.''.. ''తొలి ఇన్నింగ్స్‌లో మిస్ అయిన హాఫ్ సెంచరీని.. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో కవర్ చేస్తాడు'' అంటూ పేర్కొన్నారు. ఇక తొలి టెస్టులో పరుగులు చేయడంలో విఫలమైన కోహ్లి రెండో టెస్టులో మాత్రం పర్వాలేదనిపించాడు. 44 పరుగులు చేసి వెనుదిరిగిన కోహ్లి అర్థసెంచరీ మార్క్‌ను మిస్ అయ్యాడు. అయితే కోహ్లి ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది. భారత్ ఇన్నింగ్స్ 50 ఓవర్ వేసిన మాథ్యూ కుహ్నెమన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లి డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి బ్యాట్‌కు దగ్గరగా వెళ్తూ కోహ్లి ప్యాడ్‌ను తాకింది. అంపైర్ ఔట్ ఇవ్వడంతో కోహ్లి డీఆర్ఎస్ తీసుకున్నాడు. టీవీ రిప్లైలో విరాట్ కోహ్లి బ్యాట్‌కి ముందుగా బాల్ తగులుతున్నట్టు స్పష్టంగా కనిపించినా.. థర్డ్ అంపైర్ మాత్రం బెన్ఫిట్ ఆఫ్ డౌట్ కింద ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. అంపైర్ నిర్ణయాన్ని స్క్రీన్‌పై చూసిన కోహ్లి కూడా ఒక్క సారిగా షాక్‌కు గురయ్యాడు. 'No' అని అరుచుకుంటూ పెవిలియన్ బాట పట్టాడు. This is what ram ke chole bhature do to a men . Comfort food for kohli he knows he was in good touch treating himself with with chole bhature 😂😂😂 #axarpatel #ViratKohli𓃵 #ViratKohli #Ramkecholebhature #RohitSharma𓃵 pic.twitter.com/5N8ujUi1y2 — DEVANSH ARORA (@areydevanshh) February 18, 2023 చదవండి: బ్యాటర్లకు సాధ్యం కాలేదు.. అక్షర్, అశ్విన్‌లు చూపించారు -
కోట్ల ఆస్తివున్నా.. టిఫిన్ సెంటర్ నడుపుతోంది!
-
గుర్గావ్ మహిళ ముందుచూపు!
గుర్గావ్: ఆమెకు గుర్గావ్ లో 3 కోట్ల విలువ చేసే ఇల్లుంది. అంతేకాదు రెండు పెద్ద కార్లు కూడా ఉన్నాయి. ఇన్ని ఉన్న ఆమె ఉన్నత ఉద్యోగో, బడా వ్యాపారవేత్తో కాదు. రోడ్డు పక్కన చిన్న బండిలో హోటల్ నడుపుతోంది. ఇదంతా ఎందుకు చేస్తున్నావని అడిగితే 'నా కుటుంబానికి సురక్షితమైన భవిష్యత్ అందిచేందుకే'నని జవాబచ్చింది. ఊర్వశి యాదవ్ అనే మహిళ 45 రోజులుగా రోడ్డు పక్కన బండి పెట్టి టిఫిన్ సెంటర్ నడుపుతోంది. టీచర్ గా పనిచేసిన ఆమె తన భర్తకు ప్రమాదం జరగడంతో ఉద్యోగాన్ని వదిలేసి టిఫిన్ సెంటర్ ప్రారంభించింది. గుర్గావ్ సెక్టార్ 17ఏ యాదవ్ కుటుంబం నివాసం ఉంటుంది. ఆమె భర్త అమిత్ ప్రముఖ నిర్మాణ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడు. ఆమె మామ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ గా రిటైరయ్యారు. మే 31న జరిగిన అమిత్ గాయపడ్డాడు. అతడికి తుంటి మార్పిడి ఆపరేషన్ చేయాలని, నడిచే అవకాశాలు తక్కువని డాక్టర్లు చెప్పారు. ఇది జరిగిన 15 రోజుల తర్వాత సెక్టార్ 14 మార్కెట్ లో రావి చెట్టు కింద చిన్న బండి పెట్టి టిఫిన్ ప్రారంభించింది ఊర్వశి యాదవ్. 'ఇప్పటికిప్పుడు మాకు ఎటువంటి ఆర్థిక సమస్యలు లేవు. కానీ భవిష్యత్ లో ఎలా ఉంటుందో చెప్పలేను. కష్టాలు ఎదురొనప్పుడు చూడొచ్చు అన్నట్టుగా కాకుండా, ముందుగానే సిద్ధంగా ఉంటే మంచిదన్న నిర్ణయంతో టిఫిన్ సెంటర్ పెట్టాను. టీచర్ గా ఉద్యోగం చేస్తూ నాకు కావాల్సిన డబ్బు సంపాదించలేనని అర్థమైంది. వంట చేయడమంటే నాకు ఇష్టం. నా అభిరుచినే ఉపాధిగా ఎందుకు మార్చుకోకూడదన్న ఆలోచనతో టిఫిన్ సెంటర్ ప్రారంభించా'నని ఊర్వశి యాదవ్ చెప్పింది. తన ఇద్దరు పిల్లలను మంచి స్కూల్లో చదుతున్నారని, వారిని స్కూల్ మార్చాలన్న ఆలోచన లేదని పేర్కొంది. రోజుకు రూ.2500 నుంచి రూ.3000 సంపాదిస్తున్నానని, తన సంపాదన సంతృప్తికరంగా ఉందని వెల్లడించింది. ఊర్వశి యాదవ్ ముందుజాగ్రత్తను అక్కడి వారు ప్రశంసిస్తున్నారు.