టీమిండియాపై టెస్టు సిరీస్ గెలిచి 19 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని భారత గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియాకు మరో సారి నిరాశ ఎదురైంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టుల్లో ఘోర పరాభావం పొందిన ఆసీస్.. తమ కలను నేరవేర్చుకునే అవకాశం కోల్పోయింది. చివరిగా 2004లో భారత్ గడ్డపై ఆసీస్ టెస్టు సిరీస్ నెగ్గింది.
ఇక తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా దారుణ ప్రదరర్శన కనబరిచింది. ముఖ్యంగా ఆసీస్ బ్యాటర్లు భారత స్పిన్నర్లను ఎదుర్కొవాడనికి తలలు పట్టుకున్నారు. అయితే మూడో టెస్టుకు దాదాపు వారం రోజుల సమయం ఉండడంతో.. ఆసీస్ జట్టు ఢిల్లీలోనే తమ ప్రాక్టీస్‌ను కొనసాగిస్తుంది.
ఈ నేపథ్యంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తీవ ఇబ్బంది పడుతున్న ఆస్ట్రేలియాకు సాయం చేసేందుకు ఆ జట్టు మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ముందుకొచ్చాడు. హేడెన్ ప్రస్తుతం ఈ సిరీస్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు.
"కష్టాల్లో ఉన్న ఆసీస్ జట్టుకు నా వంతు సాయం అందించేందుకు 100 శాతం సిద్దంగా ఉన్నాను. అది రాత్రి లేదా పగలు ఏ సమయంలో పిలిచినా వెళ్లి సాయం చేస్తాను. నాకు ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. వాళ్ల సొంత గడ్డపై భారత స్పిన్నర్లను ఎదుర్కొవడం అంత సులభం కాదు. బౌలర్ల మైండ్ సెట్‌ను అర్ధం చేసుకోవాలి.
అయితే అత్యుత్తమ ఆటగాళ్లను తాయారు చేయాల్సిన అవసరం ప్రస్తుతం క్రికెట్ ఆస్ట్రేలియాకు చాలా ఉంది. అదే విధంగా క్రికెట్ ఆస్ట్రేలియా గవర్నింగ్ కౌన్సిల్‌లో కనీసం ఒక్క మాజీ ఆటగాడైనా ఉండాలి. అప్పుడే వినూత్నమైన మార్పులు తీసుకురావచ్చు." అని విలేకరుల సమావేశంలో హెడన్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: ఐపీఎల్‌కు ముందు చెన్నైకి గుడ్ న్యూస్.. స్టార్ ఆటగాడు వచ్చేస్తున్నాడు!
Comments
Please login to add a commentAdd a comment