'కోహ్లి కంటే వార్నర్ పవర్ఫుల్' | Virat Kohli is a special blend of consistency and power, says Matthew Hayden | Sakshi
Sakshi News home page

'కోహ్లి కంటే వార్నర్ పవర్ఫుల్'

Published Tue, May 31 2016 12:31 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM

'కోహ్లి కంటే వార్నర్ పవర్ఫుల్'

'కోహ్లి కంటే వార్నర్ పవర్ఫుల్'

టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ ప్రశంసలు కురిపించాడు. అతడి ఆటతీరు, బ్యాటింగ్ స్టయిల్ బాగుంటుందని మెచ్చుకున్నాడు. 'నిలకడ, పవర్ కలగలిపి బ్యాటింగ్ చేయడం కోహ్లి ప్రత్యేకత. మైదానంలో అతడు కదిలే విధానం, ఆట పట్ల ఉన్న అనురక్తి విరాట్ వ్యక్తిత్వానికి అదనపు బలం. అతడి ఆటను చూసేందుకు క్రికెట్ అభిమానులు ఇష్టపడతార'ని హేడెన్ అన్నాడు. కోహ్లి వ్యవహారశైలి తమకెంతో నచ్చుతుందని చెప్పాడు.

'కోహ్లి దూకుడును మేమంతా ఇష్టపడతాం. ఆట పట్ల చూపే అంకితభావం అతడిలో కన్పిస్తుంటుంది. విరాట్ వ్యవహారశైలి ఆస్ట్రేలియా క్రికెట్ కు తగినట్టుగా ఉంటుంది. అంపైర్లతో వాదించడం, అతడి పోరాట పటిమను అభిమానులు ప్రేమిస్తార'ని హేడెన్ పేర్కొన్నాడు. కోహ్లి కంటే డేవిడ్ వార్నర్ శక్తివంతుడని అన్నాడు. ఐపీఎల్-9లో అత్యధిక పరుగులు సాధించిన వారి జాబితాలో కోహ్లి, వార్నర్ మొదటి రెండు స్థానాల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement