వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆఫ్గానిస్తాన్‌పై సెంచరీతో చెలరేగిన రోహిత్.. ఇప్పుడు పాకిస్తాన్‌పై మరో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. హిట్‌మ్యాన్ 63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 86 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే పాక్ బౌలర్లను రోహిత్ ఊచకోత కోశాడు. తృటిలో మరో సెంచరీ చేసే అవకాశాన్ని రోహిత్ కోల్పోయాడు. ఇక ఈ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన హిట్‌మ్యాన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
రోహిత్ సాధించిన రికార్డులు ఇవే..
►వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో విజయవంతమైన రన్ ఛేజింగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకు వరల్డ్‌కప్‌లో 9 విజయవంతమైన లక్ష్య ఛేదనలో 586 పరుగులు చేశాడు. కాగా అంతకుముందు ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(519) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో పాంటింగ్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు.
►అదే విధంగా ఈ మ్యాచ్‌లో 6 సిక్స్‌లతో చెలరేగిన హిట్‌మ్యాన్.. వన్డే క్రికెట్‌లో 300 సిక్స్‌ల మైలు రాయిని అందుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ వన్డేల్లో 300 సిక్స్‌ల మార్క్‌ను అందుకున్న మూడో క్రికెటర్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు.
ఈ జాబితాలో పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది(351) తొలి స్ధానంలో ఉండగా.. తర్వాతి స్ధానాల్లో క్రిస్ గేల్(331), రోహిత్(303) ఉన్నారు. అదే విధంగా ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్ రోహిత్ శర్మ కావడం విశేషం.
► అంతేకాకుండా అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా 300 సిక్స్‌ల మైలు రాయిని అందుకున్న మొదటి క్రికెటర్‌గా రోహిత్ చరిత్ర సృష్టించాడు.
►వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో పాకిస్తాన్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డులకెక్కాడు. రోహిత్ ఈ మ్యాచ్‌లో 86 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment