టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ ఎంపిక అంశంపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ స్పందించాడు. టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న విరాట్ కోహ్లి నిర్ణయం తనను విస్మయానికి గురి చేసిందన్న పాంటింగ్... అతడు గొప్ప కెప్టెన్ అని కొనియాడాడు. అజింక్య రహానేకు కూడా టెస్టు సారథిగా మంచి మార్కులే పడతాయని, ఆస్ట్రేలియాలో మ్యాచ్‌లను గెలిపించిన విధానమే ఇందుకు నిదర్శనమన్నాడు. కెప్టెన్సీ రేసులో కేఎల్ రాహుల్ పేరు కూడా వినిపిస్తోందని, అయితే, కోహ్లి స్థానాన్ని భర్తీ చేయగలిగేది మాత్రం రోహిత్ శర్మనే అని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.
ఈ మేరకు పాంటింగ్ మాట్లాడుతూ... ‘‘కోహ్లి నిర్ణయం నన్ను షాక్‌కు గురిచేసింది. అయితే, ఆటగాడిగా కొనసాగుతాననడం మంచి విషయం. తనకు ఇప్పుడు 33 ఏళ్లు. కెప్టెన్సీ భారం లేదు. కాబట్టి ఆటగాడిగా కోహ్లి మరిన్ని రికార్డులు బద్దలు కొట్టగలడు. కొత్త కెప్టెన్ విషయానికొస్తే.... నేను అజింక్య రహానేతో కలిసి పనిచేశాను. తను చాలా మంచి ఆటగాడు. ప్రస్తుతం తను గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. అయితే, ఆస్ట్రేలియా సిరీస్‌లో నాయకుడిగా తానేంటో నిరూపించుకున్న విషయాన్ని మర్చిపోవద్దు.
కానీ... అది సరిపోదు కదా! ఇప్పుడు కేఎల్ రాహుల్ పేరును కూడా కొందరు సూచిస్తున్నారు. విదేశీ గడ్డపై అతడి రికార్డు బాగుంది. కానీ... నా అభిప్రాయం ప్రకారం రోహిత్ శర్మ మాత్రమే విరాట్ కోహ్లి స్థానాన్ని భర్తీ చేయగలడు. ముంబై ఇండియన్స్ జట్టును ముందుండి నడిపించిన విధానాన్ని నేను దగ్గరగా గమనించాను. తను విజయవంతమైన సారథి. ఇప్పుడు టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఉన్నాడు. గత రెండు మూడేళ్లుగా టెస్టుల్లో రాణిస్తున్నాడు’’ అని పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022 Auction: కొత్త ఫ్రాంఛైజీ 8 కోట్లు పెట్టింది; అతడిని వదిలేసినందుకు చాలా బాధగా ఉంది.. కానీ: హెడ్‌కోచ్
ENG vs WI: నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు.. సంచలనం సృష్టించిన జాసన్ హోల్డర్
Comments
Please login to add a commentAdd a comment