IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్‌న్యూస్‌! | IPL 2022: Ricky Ponting Expects Nortje Warner To Available For Next Match | Sakshi
Sakshi News home page

IPL 2022: ఢిల్లీ జట్టుకు గుడ్‌న్యూస్‌.. వాళ్లిద్దరూ జట్టులోకి రానున్నారన్న పాంటింగ్‌!

Published Sun, Apr 3 2022 9:02 AM | Last Updated on Sun, Apr 3 2022 9:31 AM

IPL 2022: Ricky Ponting Expects Nortje Warner To Available For Next Match - Sakshi

ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌కోచ్‌ రిక్కీ పాంటింగ్‌(PC: BCCI/IPL)

IPL 2022: ఐపీఎల్‌-2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో ఒక విజయం సాధించగా.. ఒక మ్యాచ్‌లో ఓటమిపాలైంది. గెలుపోటముల సంగతి ఎలా ఉన్నా.. స్టార్‌ బౌలర్‌ అన్రిచ్‌ నోర్జే, స్టార్‌ బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌ జట్టులో లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, వీరిద్దరు తర్వాతి మ్యాచ్‌లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు మిచెల్‌ మార్ష్‌ సైతం సెలక్షన్‌కు అందుబాటులో ఉండనున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌కోచ్‌ రిక్కీ పాంటింగ్‌ వెల్లడించాడు.

తాజా సీజన్‌లో తమ రెండో మ్యాచ్‌లో భాగంగా ఢిల్లీ.. శనివారం గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడింది. ఇందులో 14 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ క్రమంలో మ్యాచ్‌ అనంతరం రిక్కీ పాంటింగ్‌ మాట్లాడుతూ... నోర్జే గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని, నెట్స్‌లో బౌలింగ్‌ చేస్తున్నాడని పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు నుంచి క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ పొందగానే మైదానంలో దిగుతాడని తెలిపాడు. తమ తదుపరి మ్యాచ్‌లో నోర్జే ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఇక డేవిడ్‌ వార్నర్‌ సైతం ముంబైకి చేరుకున్నాడన్న పాంటింగ్‌.. క్వారంటైన్‌ పూర్తి చేసుకుని జట్టుతో చేరతాడని పేర్కొన్నాడు. అదే విధంగా ఆదివారం మిచెల్‌ మార్ష్‌ సైతం సెలక్షన్‌కు అందుబాటులోకి వస్తాడని, కేకేఆర్‌తో మ్యాచ్‌ నాటికి అతడు జట్టులోకి వస్తాడని తెలిపాడు. కాగా లక్నో సూపర్‌జెయింట్స్‌తో ఏప్రిల్‌ 7న ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్‌ ఆడనుంది. ఆ తర్వాత 10న కోల్‌కతాతో తలపడనుంది. 

చదవండి: IPL 2022: విజయ్‌ శంకర్‌ చేసిన రనౌట్‌ సరైనదేనా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement