
ముంబై: ఈ ఐపీఎల్-14 సీజన్‌లో భాగంగా గతవారం ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆ జట్టు హెడ్ రికీ పాంటింగ్ ఇచ్చిన స్ఫూర్తిదాయకమైన ప్రసంగం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీనికి ఫ్యాన్స్ అభినందనలు కూడా అందుకున్నాడు పాంటింగ్. అతని స్ఫూర్తిదాయకమైన స్పీచ్‌ను స్పోర్ట్ డ్రామా కథాంశంగా 2007లో వచ్చిన చక్ దే ఇండియాలోని కబీర్‌ఖాన్(షారుక్‌ఖాన్)తో పోలుస్తూ అభిమానులు ట్వీటర్ వేదికగా కొనియాడాడు. అక్కడ కబీర్‌ఖాన్-ఇక్కడ పాంటింగ్‌లు ఒకే తరహాలో వారి జట్లలో జోష్‌ను నింపారన్నారు. అయితే ఇక్కడ ఆ ఇద్దరికీ ఒక తేడా ఉందని ఢిల్లీ క్యాపిటల్స్ తన ట్వీటర్ హ్యాండిల్‌లో రాసుకు రావడమే కాకుండా పాంటింగ్ మాట్లాడిన ఒక వీడియోను సైతం విడుదల చేసింది.
నేను అలా చేయను.. నా భార్య విడాకులిస్తుంది
అయితే ఆ ఒక్క తేడా ఏమిటంటే మ్యాచ్‌కు ముందు పాంటింగ్ క్లీన్ షేవ్‌తో ఉండటమే. దీనిపై ఆ వీడియోలో పాంటింగ్ తన గడ్డం గురించి మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడూ పెరిగిన గడ్డంతో ఉండను. మ్యాచ్ ప్రారంభానికి ముందు అసలే ఉండను. నా భార్య నన్ను టెలివిజన్‌లో చూస్తుంది. నా భార్య నన్ను గడ్డంతో చూసిందంటే విడాకులు ఇచ్చేస్తుంది(నవ్వుతూ). అందుకే నేను క్లీన్ షేవ్‌తో ఉంటాను. మ్యాచ్ ప్రారంభమయ్యే ముందు రాత్రి నేను షేవ్ చేసుకోక తప్పదు. ఇది నాకు ఆచారంగా వస్తుంది. మాకు ఏప్రిల్ 10వ తేదీన ఐపీఎల్ మ్యాచ్ ఉంది కాబట్టే 9వ తేదీ రాత్రే షేవ్ చేసుకుంటాను. ఏ మ్యాచ్‌కైనా అలానే చేస్తాను. ఈ విషయాన్ని మావాళ్లు గుర్తించారో లేదో నాకైతే కచ్చింతంగా తెలీదు’ అని పేర్కొన్నాడు. మూడేళ్ల క్రితం 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన పాంటింగ్.. ఆ మరుసటి ఏడాది ఢిల్లీని ప్లే ఆఫ్స్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. 2020లో ఢిల్లీ ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే.
The only difference between @RickyPonting and Kabir Khan is that the latter had a stubble on Matchday 😉#CSKvDC #YehHaiNayiDilli #IPL2021 pic.twitter.com/nRioP0WKRS
— Delhi Capitals (@DelhiCapitals) April 10, 2021
Comments
Please login to add a commentAdd a comment