PC: IPL.com
ఐపీఎల్-2022లో భాగంగా శుక్రవారం (ఏప్రిల్ 22) రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ దూరం కానున్నాడు. ఢిల్లీ టీమ్ హోటల్‌లో పాంటింగ్‌తో పాటు బస చేస్తున్న అతడి కుటుంబ సభ్యులలో ఒకరికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణైంది. దీంతో అతడు తన ఫ్యామిలీతో పాటు ఐసోలేషన్‌లోకి వెళ్లనున్నాడు. ఇప్పటికే ఢిల్లీ జట్టులో కరోనా కేసులు నమోదు కావడంతో రాజస్థాన్-ఢిల్లీ మ్యాచ్‌ను బీసీసీఐ పుణే నుంచి వాంఖడే స్టేడియంకు మార్పుచేసింది.
"ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ కుటుంబ సభ్యులలో ఒకరు కరోనా బారిన పడ్డారు. దీంతో వారు ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా పాటింగ్‌కు మాత్రం రెండు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌గా తేలింది. అయితే జట్టు ప్రయోజనాల దృష్ట్యా, అతడు తన కుటంబంతో సన్నిహితంగా ఉన్నందున ఐదు రోజులు పాటు ఐసోలేషన్‌లో ఉండాలని వైద్య బృందం సూచించనట్లు" ఢిల్లీ క్యాపిటల్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇక మ్యాచ్‌లో హెడ్ కోచ్ లేకుండానే ఢిల్లీ క్యాపిటల్స్ బరిలోకి దిగనుంది. అస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ పాంటింగ్ బాధ్యతలు నిర్వహించనున్నాడు.
చదవండి: కోహ్లి భాయ్‌ని ఔట్ చేయడమే నా లక్ష్యం: ఉమ్రాన్ మాలిక్
Comments
Please login to add a commentAdd a comment