IPL 2025: కొత్త హెడ్‌కోచ్‌.. ప్రకటించిన పంజాబ్‌ కింగ్స్‌ | IPL 2025: Ricky Ponting Officially Appointed As Punjab Kings Head Coach | Sakshi
Sakshi News home page

IPL 2025: కొత్త హెడ్‌కోచ్‌.. ప్రకటించిన పంజాబ్‌ కింగ్స్‌

Published Wed, Sep 18 2024 4:28 PM | Last Updated on Wed, Sep 18 2024 6:01 PM

IPL 2025: Ricky Ponting Officially Appointed As Punjab Kings Head Coach

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫ్రాంఛైజీ పంజాబ్‌ కింగ్స్‌ బుధవారం  కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్‌ను తమ జట్టు ప్రధాన కోచ్‌గా నియమించినట్లు తెలిపింది. వచ్చే ఏడాది పాంటింగ్‌ పంజాబ్‌ కింగ్స్‌తో చేరనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. నాలుగేళ్ల పాటు తమ జట్టుతో అతడు కొనసాగనున్నట్లు పేర్కొంది. 

అభిమానులకు ఇదే నా ప్రామిస్‌
ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్‌ స్పందిస్తూ.. ‘‘హెడ్‌కోచ్‌గా నాకు అవకాశం ఇచ్చిన పంజాబ్‌ కింగ్స్‌ యాజమాన్యానికి ధన్యవాదాలు. కొత్త సవాళ్లు స్వీకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. జట్టు యజమానులతో చర్చలు ఫలవంతంగా ముగిశాయి. టీమ్‌ను ఉన్నత స్థాయిలో నిలిపేందుకు వారితో కలిసి పనిచేసేందుకు నేను సిద్ధం. 

సుదీర్ఘకాలంగా జట్టుకు మద్దతుగా ఉన్న అభిమానులకు విజయంతో రుణం చెల్లించే అవకాశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఇకపై సరికొత్త పంజాబ్‌ కింగ్స్‌ను చూడబోతున్నారు’’ అని పేర్కొన్నాడు. కాగా రిక్కీ పాంటింగ్‌ ఐపీఎల్‌-2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌కోచ్‌గా పనిచేశాడు. 2018 నుంచి ఏడేళ్లపాటు ఢిల్లీ జట్టుకు సేవలు అందించాడు. 

ఢిల్లీతో తెగిన బంధం.. ఇకపై పంజాబ్‌తో ప్రయాణం
అయితే, 2020లో ఫైనల్‌ చేరడం మినహా పాంటింగ్‌ మార్గదర్శనంలో ఢిల్లీకి పెద్దగా విజయాలు దక్కలేదు. అయినప్పటికీ అతడిపై నమ్మకం ఉంచిన మేనేజ్‌మెంట్‌.. 2024 తర్వాత ఎట్టకేలకు పాంటింగ్‌తో బంధాన్ని తెంచుకుంది. ఈ క్రమంలో పంజాబ్‌ కింగ్స్‌ పాంటింగ్‌తో చర్చలు జరిపి తమ ప్రధాన కోచ్‌గా నియమించుకున్నట్లు తాజాగా ప్రకటించింది. 

మరో ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ ట్రెవర్‌ బైలిస్‌ స్థానాన్ని రిక్కీ పాంటింగ్‌తో భర్తీ చేసింది. కాగా ఐపీఎల్‌-2024లో పంజాబ్‌ కింగ్స్‌ పద్నాలుగు మ్యాచ్‌లకు కేవలం ఐదు గెలిచి పట్టికలో తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ పద్నాలుగింట ఏడు గెలిచి ఆరో స్థానంలో నిలిచింది.

చదవండి: నాకంటే నీకే బాగా తెలుసు కదా: కోహ్లికి షాకిచ్చిన గంభీర్‌!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement