
Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో రికీ పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్‌కోచ్‌గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలై పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. డేవిడ్ వార్నర్, అక్షర్ పటేల్ మినహా మిగతావారు రాణించకపోవడంతో ఢిల్లీ వరుస ఓటములను చవిచూసింది. దీనికి తోడు రిషబ్ పంత్ కూడా యాక్సిడెంట్ కారణంగా దూరమవడంతో అతడు లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది.
ఈ సంగతి పక్కనబెడితే.. నిన్నటి తరంలో దిగ్గజ క్రికెటర్లుగా వెలుగొందిన పాంటింగ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, బ్రియాన్ లారాలు ఐపీఎల్‌లో వివిధ ఫ్రాంచైజీల్లో ఏదో ఒక ముఖ్య పాత్రలో కొనసాగుతూ ఇప్పటి ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేస్తున్నారు.
కాగా ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్‌కోచ్ పాంటింగ్, ఆర్‌సీబీ స్టార్ విరాట్ కోహ్లి ఒక ప్రమోషన్ కార్యక్రమం సందర్భంగా ఎదురుపడ్డారు. చాలా రోజుల తర్వాత ఇద్దరు కలవడంతో పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. అయితే వీరి మీటింగ్‌లో ఒక కుర్రాడు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. పాంటింగ్ వెనకాల నిల్చొని అదే పనిగా కోహ్లిని చూస్తున్నాడు.
కాసేపటి తర్వాత పాంటింగ్ ఆ కుర్రాడిని కోహ్లికి పరిచయం చేశాడు. అచ్చం నీలాగే ఉన్నాడు.. కొత్త వాళ్లతో మాట్లాడాలంటే బెరుకు అనుకుంటా అని కోహ్లి నవ్వుతూ పేర్కొన్నాడు. దీనికి పాంటింగ్.. అదేం లేదులే.. ఒక్కసారి నువ్వు నచ్చావనుకో ఇక జన్మలో నిన్ను వదిలిపెట్టడు. అని పేర్కొన్నాడు. ఆ తర్వాత కోహ్లి, పాంటింగ్‌లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మరి కోహ్లిని ఆకట్టుకున్న ఆ కుర్రాడు ఎవరో తెలుసా.. రికీ పాంటింగ్ కుమారుడు జూనియర్ పాంటింగ్ అలియాస్ ఫ్లెచర్ విలియమ్ పాంటింగ్. ఐపీఎల్ చూడడానికి తండ్రితో పాటు వచ్చిన ఫ్లెచర్ మ్యాచ్‌లను ఎంజాయ్ చేస్తున్నాడు. అన్నట్లు చెప్పడం మరిచాం. పాంటింగ్ లాగే ఫ్లెచర్ విలియమ్‌కు కూడా క్రికెట్ అంటే అమితమైన ఆసక్తి. ఇక ఈ వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ ట్విటర్ షేర్ చేసిన కాసేపటికే వైరల్‌గా మారిపోయింది.
Jab Ricky Met Kohli 🥺
— Delhi Capitals (@DelhiCapitals) April 13, 2023
Extended Cameo: Ricky Jr 👶🏻#YehHaiNayiDilli #IPL2023 #ViratKohli #KingKohli #RCBvDC | @imVkohli | @RickyPonting pic.twitter.com/0LegGmLtga