
బాబర్ ఆజం (PC: PCB)
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు మొదటి రోజు ఆటలో అద్భుత ఆట తీరు కనబరిచాడు. 48 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్ అహ్మద్‌తో కలిసి 196 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నాడు.
ఈ క్రమంలో 9 టెస్టు సెంచరీ(277 బంతుల్లో 161 నాటౌట్; 15 ఫోర్లు, 1 సిక్స్) చేసిన బాబర్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. పాకిస్తాన్ తరఫున క్యాలెండర్ ఇయర్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో మహ్మద్ యూసఫ్ పేరిట ఉన్న 16 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.
రిక్కీ పాంటింగ్‌ను అధిగమించి
కివీస్‌తో మ్యాచ్‌లో తొలి సెషన్‌లోనే 54 పరుగుల వద్ద ఈ ఘనత అందుకున్నాడు. అదే విధంగా.. క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సార్లు 50కి పైచిలుకు పరుగులు సాధించిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. 25 హాఫ్ సెంచరీలు నమోదు చేసి.. ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్(2005లో 24 అర్ధ శతకాలు)ను అధిగమించాడు.
ఇదిలా ఉంటే శతకం పూర్తి చేసుకున్న తర్వాత అచ్చం టీమిండియా విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌లా బాబర్ సెలబ్రేషన్ చేసుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు సాధించిన పాక్ బ్యాటర్లు
►బాబర్ ఆజం- 44 మ్యాచ్‌లలో 2477 పరుగులు- 2022
►మహ్మద్ యూసఫ్- 33 మ్యాచ్‌లలో 2435 పరుగులు- 2006
►సయీద్ అన్వర్- 43 మ్యాచ్‌లలో 2296 పరుగులు- 1996
►మహ్మద్ యూసఫ్- 41 మ్యాచ్‌లలో 2226 పరుగులు- 2002
►ఇంజమాముల్ హక్- 46 మ్యాచ్‌లలో 2164 పరుగులు- 2000
►బాబర్ ఆజం- 36 మ్యాచ్‌లలో 2082 పరుగులు- 2019
►మిస్బా ఉల్ హక్- 42 మ్యాచ్‌లలో 2078 పరుగులు- 2013
►మహ్మద్ యూసఫ్- 53 మ్యాచ్‌లలో 2000 పరుగులు- 2000
►యూనిస్ ఖాన్- 48 మ్యాచ్‌లలో 1947 పరుగులు- 2002
►మహ్మద్ రిజ్వాన్- 44 మ్యాచ్‌లలో 1915 పరుగులు- 2021
చదవండి: David Warner: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. అద్భుత శతకం.. అరుదైన రికార్డుల జాబితాలో వార్నర్
Suryakumar Yadav: సీక్రెట్ రివీల్ చేసిన సూర్యకుమార్.. వాళ్ల వల్లే ఇలా! కేకేఆర్ నుంచి మారిన తర్వాతే