Sarfaraj ahmed
-
Pak Vs NZ: రికార్డులు బద్దలు కొట్టిన బాబర్! అచ్చం సెహ్వాగ్‌లా అలా!
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు మొదటి రోజు ఆటలో అద్భుత ఆట తీరు కనబరిచాడు. 48 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్ అహ్మద్‌తో కలిసి 196 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నాడు. ఈ క్రమంలో 9 టెస్టు సెంచరీ(277 బంతుల్లో 161 నాటౌట్; 15 ఫోర్లు, 1 సిక్స్) చేసిన బాబర్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. పాకిస్తాన్ తరఫున క్యాలెండర్ ఇయర్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో మహ్మద్ యూసఫ్ పేరిట ఉన్న 16 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. రిక్కీ పాంటింగ్‌ను అధిగమించి కివీస్‌తో మ్యాచ్‌లో తొలి సెషన్లోనే 54 పరుగుల వద్ద ఈ ఘనత అందుకున్నాడు. అదే విధంగా.. క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సార్లు 50కి పైచిలుకు పరుగులు సాధించిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. 25 హాఫ్ సెంచరీలు నమోదు చేసి.. ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్(2005లో 24 అర్ధ శతకాలు)ను అధిగమించాడు. ఇదిలా ఉంటే శతకం పూర్తి చేసుకున్న తర్వాత అచ్చం టీమిండియా విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌లా బాబర్ సెలబ్రేషన్ చేసుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు సాధించిన పాక్ బ్యాటర్లు ►బాబర్ ఆజం- 44 మ్యాచ్‌లలో 2477 పరుగులు- 2022 ►మహ్మద్ యూసఫ్- 33 మ్యాచ్‌లలో 2435 పరుగులు- 2006 ►సయీద్ అన్వర్- 43 మ్యాచ్‌లలో 2296 పరుగులు- 1996 ►మహ్మద్ యూసఫ్- 41 మ్యాచ్‌లలో 2226 పరుగులు- 2002 ►ఇంజమాముల్ హక్- 46 మ్యాచ్‌లలో 2164 పరుగులు- 2000 ►బాబర్ ఆజం- 36 మ్యాచ్‌లలో 2082 పరుగులు- 2019 ►మిస్బా ఉల్ హక్- 42 మ్యాచ్‌లలో 2078 పరుగులు- 2013 ►మహ్మద్ యూసఫ్- 53 మ్యాచ్‌లలో 2000 పరుగులు- 2000 ►యూనిస్ ఖాన్- 48 మ్యాచ్‌లలో 1947 పరుగులు- 2002 ►మహ్మద్ రిజ్వాన్- 44 మ్యాచ్‌లలో 1915 పరుగులు- 2021 చదవండి: David Warner: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. అద్భుత శతకం.. అరుదైన రికార్డుల జాబితాలో వార్నర్ Suryakumar Yadav: సీక్రెట్ రివీల్ చేసిన సూర్యకుమార్.. వాళ్ల వల్లే ఇలా! కేకేఆర్ నుంచి మారిన తర్వాతే -
Pak Vs NZ: వైస్ కెప్టెన్‌పై వేటు! సొంతగడ్డపై తొలిసారి.. చీఫ్ సెలక్టర్‌పై మండిపాటు
Pakistan vs New Zealand, 1st Test- Shahid Afridi- Babar Azam: స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన పాకిస్తాన్ మరో పోరుకు సిద్ధమైంది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభించింది. ఈ క్రమంలో కరాచీ వేదికగా సోమవారం మొదలైన తొలి టెస్టు ద్వారా దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత సర్ఫరాజ్ అహ్మద్ పునరాగమనం చేశాడు. మహ్మద్ రిజ్వాన్‌ను తప్పించిన మేనేజ్మెంట్.. అతడి స్థానంలో తుది జట్టుకు సర్ఫరాజ్‌ను ఎంపిక చేసింది. కాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌లో మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడిన రిజ్వాన్ చేసిన పరుగులు 141(సగటు 23.50). టాప్ స్కోర్ 46. ఈ నేపథ్యంలో కివీస్‌తో తొలి టెస్టులో అతడికి స్థానం దక్కలేదు. నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. సొంతగడ్డపై తొలిసారి ఇక 2019లో జనవరిలో జొహన్నస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో ఆఖరిసారిగా పాక్ తరఫున ఆడిన సర్ఫరాజ్ అహ్మద్ దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవలి కాలంలో దేశవాళీ టోర్నీలో 8 మ్యాచ్‌లలో ఈ వెటరన్ బ్యాటర్ 394 పరుగులతో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. సింధ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు 2022-23 ఎడిషన్‌లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మూడు అర్ధ శతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు కాగా 2010లో అంతర్జాతీయ టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన 35 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ సర్ఫరాజ్‌కు పాక్ గడ్డపై ఇదే తొలి టెస్టు కావడం మరో విశేషం. ఇక ఇప్పటి వరకు పాకిస్తాన్ తరఫున 49 టెస్టులు ఆడిన సర్ఫరాజ్ అహ్మద్ 2657 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 2018లో అరంగేట్రం చేసిన ఫాస్ట్‌బౌలర్ మిర్ హంజా కూడా కివీస్‌తో సిరీస్‌లో పునరాగమనం చేశాడు. తొలుత అతడిని జట్టుకు ఎంపిక చేయలేదు. అయితే, ఆఖరి నిమిషంలో ఈ పేసర్‌కు జట్టులో చోటు దక్కింది. ఇక ఇంగ్లండ్ చేతిలో క్లీన్‌స్వీప్ చేతిలో ఇప్పటికే ప్రక్షాళన చేపట్టిన పాక్ బోర్డు.. చైర్మన్ రమీజ్రాజాను తప్పించిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో నజమ్ సేతీ వచ్చాడు. ఇక అదే విధంగా చీఫ్ సెలక్టర్‌గా మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది బాధ్యతలు స్వీకరించాడు. ఈ నేపథ్యంలో ఈ మార్పులు చోటుచేసుకోవడం గమనార్హం. కాగా వైస్ కెప్టెన్ రిజ్వాన్‌ను తప్పించడం ఫ్యాన్స్‌కు రుచించడం లేదు. చీఫ్ సెలక్టర్, కెప్టెన్‌పై విమర్శలు ‘‘కేవలం ఒకటీ రెండు మ్యాచ్‌లలో స్కోర్ ఆధారంగా రిజ్వాన్‌ను తప్పిస్తారా? సర్ఫరాజ్‌ను తీసుకురావడం మంచిదే! కానీ అందుకోసం రిజ్వాన్‌ను బలిచేస్తారా? రిజ్వాన్‌ను తప్పించాలనే నిర్ణయం ఆఫ్రిదిదా లేదంటే బాబర్ ఆజందా’’ అంటూ ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. కాగా ఇంగ్లండ్ చేతిలో పరాభవం నేపథ్యంలో పాక్ డబ్ల్యూటీసీ టోర్నీ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించి విమర్శలు మూటగట్టుకుంది. చదవండి: Ind VS Ban 2nd Test: ‘సై అంటే సై’ అనేలా ఆట.. టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డు WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్ -
ఆ అధికారుల మధ్య నిశ్శబ్ద యుద్ధం!
సాక్షి, కరీంనగర్: ప్రభుత్వం అమలు చేసే ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల వద్దకు చేర్చే రెండు వ్యవస్థల మధ్య అంతరం పెరుగుతోంది. ప్రభుత్వ పెద్దల వద్ద వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవాలనే ఆలోచన జిల్లా అధికార యంత్రాంగంలో కూడా పెరిగిపోవడంతో ప్రజా ప్రతినిధులతో నిశ్శబ్దయుద్ధం వాతావరణం నెలకొంది. మీటింగులు, ముఖ్యమైన కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి మెలిసి ఉన్నట్లు కనిపిస్తున్నా... వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. తనను అనర్హుడిని చేసేందుకు ఓ అధికారి విపక్ష నాయకుడితో కుమ్మక్కయ్యాడనే ఆరోపణలు చేయడం పరిస్థితికి అద్దం పడుతుంది. కరీంనగర్ నుంచి అధికార పార్టీ తరఫున మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన గంగుల కమలాకర్ ఏకంగా జిల్లా కలెక్టర్‌పైనే ఆరోపణలు చేయడమే గాక, అప్పటి బీజేపీ అభ్యర్థి సంజయ్‌కుమార్‌తో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడిన ఆడియో టేప్‌ను ముఖ్యమంత్రికి పంపించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంతో అధికారులకు, ప్రజాప్రతినిధులకు మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి తీరు వెలుగు చూసింది. ఒక్క కరీంనగర్‌లోనే గాక పెద్దపల్లి జిల్లాలో కూడా ప్రజా ప్రతినిధులు, అధికారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడం గమనార్హం. అధికారుల ఏకపక్ష నిర్ణయాలు పెద్దపల్లి జిల్లాలో ప్రజాప్రతినిధులకు మింగుడు పడడం లేదు. ఎంపీపీలు, జెడ్పీటీసీలకు జిల్లా స్థాయి అధికారులు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదనే విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. 2014 నుంచే గంగులతో అంతరం? 2014లో జిల్లా జాయింట్ కలెక్టర్‌గా సర్ఫరాజ్ అహ్మద్ వ్యవహరించారు. కార్పొరేషన్‌కు స్పెషల్ ఆఫీసర్‌గా కూడా వ్యవహరించిన ఆయన వద్దకు మునిసిపల్ ఉద్యోగులు ఒక ఫైల్‌పై సంతకం కోసం వెళ్లారు. అప్పటి స్పెషల్ ఆఫీసర్ ఫైల్‌ను తమపైకే విసిరేశారని ఆరోపిస్తూ పెన్‌డౌన్ సమ్మె నిర్వహించారు. ఈ వివాదానికి అప్పటి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పూర్తి సహకారం అందించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య అంతరం ఏర్పడిందనే వాదన ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన జిల్లా కలెక్టర్‌తో గంగులకు మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఇటీవల లీకైన సంజయ్–కలెక్టర్ ఆడియో టేప్‌తో వెల్లడవుతోంది. 2017లో రసమయితో ‘డోంట్ టాక్ ’ కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన డీజీ–ధన్‌మేళా కార్యక్రమాన్ని 2017 మార్చి 1న కరీంనగర్లో జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అప్పటి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, జిల్లా మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంపీ వినోద్‌కుమార్ ఫొటో ముద్రించకపోవడాన్ని ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, గంగుల కమలాకర్ తప్పుపట్టారు. వేదికపైకి రమ్మన్నా వెళ్లకుండా నిరసన వ్యక్తం చేశారు. తరువాత ఈటల, వినోద్‌కుమార్ పిలవడంతో స్టేజీపైకి వెళ్లిన వీరిద్దరు వినోద్‌కుమార్ ఫ్లెక్సీ అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రసమయి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను ఉద్ధేశించి ప్రభుత్వ కార్యక్రమంలో ఎంపీ ఫొటో పెట్టకపోవడాన్ని తప్పు పడుతూ ప్రశ్నించగా... ఆయన ఎమ్మెల్యేకు కుడిచేతి వేలు చూపిస్తూ... ‘డోంట్ టాక్’ అనడం అప్పట్లో సంచలనం సృష్టించింది. పెద్దపల్లిలో పూడ్చలేని అగాధం పెద్దపల్లి జిల్లాలో సైతం ప్రజా ప్రతినిధులకు అధికారులకు మధ్య అంతరం పూడ్చలేనంతగా పెరిగిందని తెలుస్తోంది. ప్రజా ప్రతినిధులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా జిల్లా ముఖ్య అధికారి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. పారిశుధ్యంలో జిల్లా నెంబర్‌వన్‌గా మారినట్టు అవార్డులు వస్తున్నా... ఆ క్రెడిట్ ఏదీ ప్రజాప్రతినిధులకు రావడం లేదు. అదే సమయంలో పారిశుధ్య నిర్వహణ కోసం చేస్తున్న కొనుగోళ్ల వ్యవహారం కూడా వివాదాస్పదం అవుతోంది. గ్రామ పంచాయతీలలో పారిశుధ్య నిర్వహణకు 237 ట్రాక్టర్ల కొనుగోలు అంశం మొదలుకొని ప్లాస్టిక్ బుట్టలు, ట్రీ గార్డుల కొనుగోళ్ల వరకు ప్రజాప్రతినిధులతో సంబంధం లేకుండానే నిర్ణయాలు జరిగిపోయినట్లు అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. కీర్తికాంక్షతో ప్రజాప్రతినిధులను పరిగణనలోకి తీసుకోని వైనం పెద్దపల్లి జిల్లాలోనే నెలకొందని ఓ ఎంపీపీ ‘సాక్షి’కి తెలిపారు. జెడ్పీటీసీలు, ఎంపీపీలకు ఏమాత్రం విలువ లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు గౌరవ మర్యాదలకు ఢోకా లేకున్నా.. ఎంపీపీ, జెడ్పీటీసీల పరిస్థితి పెద్దపల్లికి భిన్నంగా లేదు. అధికారులు, ప్రజా ప్రతినిధులకు మధ్య పెరుగుతున్న అంతరం చివరికి ప్రజలకు అందించే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
కివీస్‌ను పాక్ ఆపేనా?
బర్మింగ్‌హామ్: ప్రపంచ కప్‌లో అజేయంగా దూసుకెళ్తూ సెమీఫైనల్స్ మెట్టెక్కేందుకు ఒక్క గెలుపు దూరంలో ఉంది న్యూజిలాండ్. మరోవైపు నాకౌట్ చేరాలంటే ఆడబోయే మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గాల్సిన పరిస్థితి పాకిస్తాన్‌ది. ఈ నేపథ్యంలో రెండు జట్లూ బుధవారం తలపడనున్నాయి. టోర్నీలో క్లిష్టమైన సందర్భాల్లో పట్టు వదలకుండా పోరాడుతున్న కివీస్ ఆటతీరు అందరినీ ఆకట్టుకుంటోంది. పాక్ మాత్రం ఆపసోపాలు పడుతోంది. అయితే, ఎడంచేతి వాటం బ్యాట్స్‌మన్ హారిస్ సొహైల్ అద్భుత ఇన్నింగ్స్‌తో గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై సాధించిన విజయం జట్టులో ఆత్మవిశ్వాసం నింపింది. తాడోపేడో తేల్చుకోవాల్సిన ఈ సమయంలో పాక్ తెగించి ఆడేందుకు ప్రయత్నించనుంది. ప్రధాన పేసర్ ఆమిర్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. రెండో పేసర్ వహాబ్ రియాజ్ మెరిస్తే ప్రత్యర్థికి కష్టాలు తప్పవు. ఓపెనర్లు ఇమాముల్, ఫఖర్ జమాన్, వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్‌కు తోడుగా కెప్టెన్ సర్ఫరాజ్ పరుగులు చేస్తే బ్యాటింగ్ మరింత బలోపేతం అవుతుంది. న్యూజిలాండ్‌కు అంతా బాగున్నా, ఓపెనర్లు గప్టిల్, మున్రో ఫామ్ కలవర పరుస్తోంది. కెప్టెన్ విలియమ్సన్ చెలరేగి ఆడుతుండటం, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ టేలర్ నిలకడ కారణంగా లాథమ్ సహా మిగతావారి వైఫల్యం ప్రభా వం చూపడం లేదు. ఆల్ రౌండర్లు నీషమ్, గ్రాండ్‌హోమ్ జట్టుకు కావాల్సిన విధంగా రాణిస్తున్నారు. పేసర్లు బౌల్ట్, ఫెర్గూసన్ పదునైన బంతులను పాక్ బ్యాట్స్‌మెన్ ఎలా కాచుకుంటారో చూడాలి. ముఖాముఖి రికార్డు ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 106 మ్యాచ్‌లు జరగ్గా 54 మ్యాచ్‌ల్లో పాకిస్తాన్ నెగ్గింది. కివీస్ 48 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒకటి టై కాగా, మూడింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచ కప్‌లోనూ న్యూజి లాండ్‌పై పాకిస్తాన్‌దే పైచేయిగా ఉంది. మెగా ఈవెంట్లలో మొత్తం 8 మ్యాచ్‌లాడగా... ఆరింట్లో పాక్, రెండింట్లో కివీస్ గెలుపొందాయి. -
పాక్ కెప్టెన్ హాఫ్ సెంచరీ మిస్
దుబాయ్ : ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ను భారత స్పిన్నర్లు చహల్, కుల్దీప్లు ఆదిలోనే దెబ్బకొట్టారు. 55 పరుగులకే ఇమామ్ ఉల్ హక్(10), ఫకార్ జమాన్(31)లను పెవిలియన్‌కు చేర్చారు. ఆ వెంటనే బాబర్ ఆజమ్(9) సమన్వయలోపంతో రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో 58 పరుగులకే పాక్ మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టల్లో పడింది. ఆదుకున్న మాలిక్- సర్ఫరాజ్.. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన మాలిక్, సర్ఫరాజ్‌లు ఆచితూచి ఆడుతూ పాక్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఈ క్రమంలో 64 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్ సాయంతో మాలిక్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ ఇద్దరు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను కుల్దీప్ చక్కటి బంతితో సర్ఫరాజ్ (44)ను ఔట్ చేసి విడగొట్టాడు. దీంతో మూడో వికెట్‌కు నమోదైన 107 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన అసిఫ్ అలీతో షోయబ్ మాలిక్ (73 నాటౌట్) పోరాడుతున్నాడు. -
కష్టాల్లో పాక్..
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్- శ్రీలంక మధ్య జరుగుతున్న చావో రేవో మ్యచ్ లో లంక బౌలర్ల దాటికి పాక్ బ్యాటింగ్ ఆర్డర్ తడబడింది. 237 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 34 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. క్రీజులో సర్ఫరాజ్ అహ్మద్(28), మహ్మద్ అమీర్(4) లు పోరాడుతున్నారు. చేతిలో 3 వికెట్లు ఉండగా పాక్ విజయానికి 67 పరుగులు అవసరం. పాక్ బ్యాట్స్ మెన్స్ లో ఫకార్ జమాన్(50; 8 ఫోర్లు, 1 సిక్స్) అజార్ అలీ( 34) ల మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు.