పాక్ చీఫ్ సెలక్టర్ ఆఫ్రిది- వైస్ కెప్టెన్ రిజ్వాన్
Pakistan vs New Zealand, 1st Test- Shahid Afridi- Babar Azam: స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన పాకిస్తాన్ మరో పోరుకు సిద్ధమైంది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభించింది. ఈ క్రమంలో కరాచీ వేదికగా సోమవారం మొదలైన తొలి టెస్టు ద్వారా దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత సర్ఫరాజ్ అహ్మద్ పునరాగమనం చేశాడు.
మహ్మద్ రిజ్వాన్‌ను తప్పించిన మేనేజ్‌మెంట్.. అతడి స్థానంలో తుది జట్టుకు సర్ఫరాజ్‌ను ఎంపిక చేసింది. కాగా ఇంగ్లండ్‌తో సిరీస్‌లో మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడిన రిజ్వాన్ చేసిన పరుగులు 141(సగటు 23.50). టాప్ స్కోర్ 46. ఈ నేపథ్యంలో కివీస్‌తో తొలి టెస్టులో అతడికి స్థానం దక్కలేదు.
నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ.. సొంతగడ్డపై తొలిసారి
ఇక 2019లో జనవరిలో జొహన్నస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో ఆఖరిసారిగా పాక్ తరఫున ఆడిన సర్ఫరాజ్ అహ్మద్ దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవలి కాలంలో దేశవాళీ టోర్నీలో 8 మ్యాచ్‌లలో ఈ వెటరన్ బ్యాటర్ 394 పరుగులతో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. సింధ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు 2022-23 ఎడిషన్‌లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మూడు అర్ధ శతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు.
అతడితో పాటు
కాగా 2010లో అంతర్జాతీయ టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన 35 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాటర్ సర్ఫరాజ్‌కు పాక్ గడ్డపై ఇదే తొలి టెస్టు కావడం మరో విశేషం. ఇక ఇప్పటి వరకు పాకిస్తాన్ తరఫున 49 టెస్టులు ఆడిన సర్ఫరాజ్ అహ్మద్ 2657 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఇక 2018లో అరంగేట్రం చేసిన ఫాస్ట్‌బౌలర్ మిర్ హంజా కూడా కివీస్‌తో సిరీస్‌లో పునరాగమనం చేశాడు. తొలుత అతడిని జట్టుకు ఎంపిక చేయలేదు. అయితే, ఆఖరి నిమిషంలో ఈ పేసర్‌కు జట్టులో చోటు దక్కింది.
ఇక ఇంగ్లండ్ చేతిలో క్లీన్‌స్వీప్ చేతిలో ఇప్పటికే ప్రక్షాళన చేపట్టిన పాక్ బోర్డు.. చైర్మన్ రమీజ్‌రాజాను తప్పించిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో నజమ్ సేతీ వచ్చాడు. ఇక అదే విధంగా చీఫ్ సెలక్టర్‌గా మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది బాధ్యతలు స్వీకరించాడు. ఈ నేపథ్యంలో ఈ మార్పులు చోటుచేసుకోవడం గమనార్హం. కాగా వైస్ కెప్టెన్ రిజ్వాన్‌ను తప్పించడం ఫ్యాన్స్‌కు రుచించడం లేదు.
చీఫ్ సెలక్టర్, కెప్టెన్‌పై విమర్శలు
‘‘కేవలం ఒకటీ రెండు మ్యాచ్‌లలో స్కోర్ ఆధారంగా రిజ్వాన్‌ను తప్పిస్తారా? సర్ఫరాజ్‌ను తీసుకురావడం మంచిదే! కానీ అందుకోసం రిజ్వాన్‌ను బలిచేస్తారా? రిజ్వాన్‌ను తప్పించాలనే నిర్ణయం ఆఫ్రిదిదా లేదంటే బాబర్ ఆజందా’’ అంటూ ట్వీట్లతో విరుచుకుపడుతున్నారు. కాగా ఇంగ్లండ్ చేతిలో పరాభవం నేపథ్యంలో పాక్ డబ్ల్యూటీసీ టోర్నీ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించి విమర్శలు మూటగట్టుకుంది.
చదవండి: Ind VS Ban 2nd Test: ‘సై అంటే సై’ అనేలా ఆట.. టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డు
WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్
Comments
Please login to add a commentAdd a comment