శ్రీలంకతో వన్డే సిరీస్‌లో అదరగొట్టిన టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి..ఇప్పుడు అదే జోరును న్యూజిలాండ్‌పై కొనసాగించడానికి సిద్దమవుతున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. జనవరి 18న హైదరాబాద్ వేదికగా ఇరు జట్లు మధ్య తొలి వన్డే జరగనుంది.
అయితే కోహ్లి కేవలం వన్డే జట్టులో మాత్రమే భాగంగా ఉన్నాడు. ఇక న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో కింగ్ కోహ్లి అరుదైన రికార్డుపై కన్నేశాడు. ఈ సిరీస్‌లో విరాట్ మరో రెండు సెంచరీలు సాధిస్తే.. కివీస్‌పై వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రికీ పాంటింగ్, వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును రికార్డును బ్రేక్ చేస్తాడు.
కివీస్‌పై పాంటింగ్, సెహ్వాగ్ వన్డేల్లో 6 సెంచరీలు సాధించారు. ఇక కోహ్లి ఇప్పటివరకు న్యూజిలాండ్‌పై ఐదు సెంచరీలు సాధించి సనత్ జయసూర్య, సచిన్ టెండూల్కర్‌తో కలిసి సంయుక్తంగా ఉన్నాడు.
చదవండి: IND vs NZ: హైదరాబాద్‌లో వన్డే సందడి.. పూర్తిగా అమ్ముడుపోయిన టికెట్లు
Comments
Please login to add a commentAdd a comment