భారత జట్టు(ఫైల్ ఫోటో)
జూన్ 7 నుంచి లండన్ వేదికగా జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా సిద్దమవుతోంది. ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన రోహిత్ సేన ప్రాక్టీస్‌లో బీజీబీజీగా గడుపుతోంది. ఈ మెగాఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టె్‌న్ రికీ పాంటింగ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత జట్టులో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఉండి బాగుండేదని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. కాగా పాండ్యా గత కొంత కాలంగా కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. వెన్ను గాయం కారణంగా 2018 తర్వాత ఇప్పటి వరకూ హార్దిక్ పాండ్యా టెస్టు మ్యాచ్ ఆడలేదు.
ఎక్స్ ఫ్యాక్టర్ అయి ఉండేవాడు..
"డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో హార్దిక్ పాండ్యా వంటి ఆల్‌రౌండర్ ఉండాల్సింది. అతడిని ఎంపికచేసి ఉంటే భారత జట్టు మరింత బలంగా ఉండేది. అయితే టెస్టు క్రికెట్ తన శరీరంపై మరింత భారాన్ని మోపుతుందని గతంలో హార్దిక్ చెప్పాడన్న సంగతి నాకు తెలుసు. కానీ ఇది కేవలం ఒక్క టెస్టు మ్యాచ్ మాత్రమే కదా.
అతడు బ్యాటింగ్, బౌలింగ్ పరంగా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్-2023లో ప్రతీ మ్యాచ్‌లోనూ అతడు బౌలింగ్ చేశాడు. అదే విధంగా అతడి బౌలింగ్‌లో మంచి పేస్ కూడా ఉంది. హార్దిక్ జట్టులో ఉండి ఉంటే కచ్చితంగా ఎక్స్ ఫ్యాక్టర్ అయి ఉండేవాడు" అని దిఐసీసీ రివ్యూలో పాంటింగ్ పేర్కొన్నాడు.
చదవండి: ఇటువంటి అద్భుతాలు సర్ జడేజా ఒక్కడికే సాధ్యం.. చాలా సంతోషంగా ఉంది: రైనా
Comments
Please login to add a commentAdd a comment