
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఈ దశాబ్దపు టెస్టు జట్టును ప్రకటించాడు. దీంట్లో భారత్ నుంచి విరాట్ కోహ్లి మాత్రమే చోటిచ్చాడు. విరాట్‌నే తన జట్టు కెప్టెన్‌గా కూడా ఎన్నుకున్నాడు. ఇక ఈ జట్టులో అత్యధికంగా నలుగురు ఇంగ్లండ్ ఆటగాళ్లుండగా ఆసీస్ నుంచి ముగ్గురున్నారు. అయితే వికెట్ కీపర్‌గా ఎన్నో ఘనతలు తన పేరిట లిఖించుకున్న ఎంఎస్ ధోనీని కాకుండా కుమార సంగక్కరను తీసుకోవడం గమనార్హం. ఓపెనర్లుగా డేవిడ్ వార్నర్, అలిస్టర్ కుక్ ఉన్నారు. పేస్ విభాగంలో ఇంగ్లండ్ బౌలర్లు అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌లు ఉండగా, దక్షిణాఫ్రికా నుంచి డేల్ స్టెయిన్‌కు కూడా అవకాశం కల్పించాడు.
ఇదే పాంటింగ్ టెస్టు జట్టు:
డేవిడ్ వార్నర్, అలెస్టర్ కుక్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లి (కెప్టెన్), సంగర్కర (కీపర్), బెన్ స్టోక్స్, డేల్ స్టెయిన్, నాథన్ లియాన్, స్టువర్ట్ బ్రాడ్, అండర్సన్.
Comments
Please login to add a commentAdd a comment