Ricky Ponting Fairytale Love Story Surprises Fans Who Is His Wife - Sakshi
Sakshi News home page

Ricky Ponting: ఆమె అందానికి క్లీన్‌బౌల్డ్‌.. వెంటనే! షేన్‌ వార్న్‌తో బార్‌లో తొలిసారి చూశా.. సంపాదనలోనూ!

Published Sat, Jun 24 2023 7:41 PM | Last Updated on Sat, Jun 24 2023 8:20 PM

Ricky Ponting Fairytale Love Story Surprises Fans Who Is His Wife - Sakshi

భార్య, పిల్లలతో రిక్కీ పాంటింగ్‌

దూకుడైన బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియాకు అనేక విజయాలు అందించిన దిగ్గజ కెప్టెన్‌ రిక్కీ పాంటింగ్‌. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 27483 పరుగులు సాధించిన ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌ ప్రస్తుతం కోచ్‌గా, కామెంటేటర్‌గా క్రికెట్‌కు సేవలు అందిస్తున్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో  ఢిల్లీ ​క్యాపిటల్స్‌ హెడ్‌కోచ్‌గా ఉన్న ఈ ఆసీస్‌ మాజీ సారథి వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం!!

ఆమెను చూడగానే
తన అగ్రెసివ్‌ బ్యాటింగ్‌తో మైదానంలో ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టించే రిక్కీ పాంటింగ్‌.. ఓ అమ్మాయిని చూడగానే మాత్రం నిలువెల్లా పులకరింపుతో సిగ్గులమొగ్గ అయ్యాడట. ఆమె పేరు రియాన్నా జెన్నిఫర్‌ కాంటోర్‌.

ఓసారి రిక్కీ మ్యాచ్‌ ఆడుతున్న సమయంలో అతడి కుటుంబం కూడా స్టేడియానికి వచ్చింది. ఆట ముగిసిన తర్వాత వాళ్లను కలిసేందుకు వెళ్లిన రిక్కీ పాంటింగ్‌కు అక్కడ రియాన్నా తారసపడింది. మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన ఆమెను చూడగానే రిక్కీ మనసు పారేసుకున్నాడు.

తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడు
తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోయాడు. ఇంకేముంది.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆమె వివరాలు సేకరించాడు. అప్పటికి కాలేజీ స్టూడెంట్‌ అయిన రియాన్నా లా చదువుతోంది. దీంతో ఆమె చదువుతున్న యూనివర్సిటీకి వెళ్లి మరీ ఆమెను కలిశాడు. మ్యాచ్‌ ముగిసిన వెంటనే హుటాహుటిన అక్కడికి రియాన్నాతో మాటలు కలిపాడు.

ముచ్చటగా ముగ్గురు పిల్లలు
రిక్కీ పట్ల రియాన్నాకు కూడా మంచి అభిప్రాయం ఉండటంతో అతడితో స్నేహానికి అంగీకరించింది. అలా కొన్నాళ్లపాటు డేటింగ్‌ చేసిన వీరిద్దరు 2002, జూన్‌ 22న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంటకు ప్రస్తుతం ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు.

నేను అప్పుడే చూశా
నిజానికి రిక్కీ.. రియాన్నాను చూడటానికి ముందే ఆమె అతడిని చూసిందట. షేన్‌ వార్న్‌తో కలిసి అతడు బార్‌లో ఉన్నపుడు చూశానని గతంలో ఓ ఇంటర్వ్యూలో రియాన్నా చెప్పింది. 21 ఏళ్లుగా అన్యోన్యంగా సాగుతున్న ఈ జంట.. రెండ్రోజుల క్రితమే పెళ్లిరోజు జరుపుకొంది. 

సంపాదనలోనూ..
దిక్రిక్‌లాంజ్‌ నివేదిక ప్రకారం రిక్కీ పాంటింగ్‌ నెట్‌వర్త్‌ సుమారు 480 కోట్ల రూపాయలు. ఆసీస్‌ మేటి క్రికెటర్‌గా, ఎండార్స్‌మెంట్ల రూపంలో .. ఐపీఎల్‌ కోచ్‌గా రిక్కీ ఈ మేరకు ఆస్తులు కూడబెట్టినట్లు సదరు రిపోర్టు వెల్లడించింది. మెల్‌బోర్న్‌లో రిక్కీ- రియాన్నా కుటుంబం నివసించే ఇంటి విలువ దాదాపు 20 కోట్లు ఉంటుందని అంచనా. ఇదిలా ఉంటే.. 48 ఏళ్ల రిక్కీ పాంటింగ్‌ ప్రస్తుతం యాషెస్‌ సిరీస్‌ కామెంట్రీతో బిజీగా ఉన్నాడు.

చదవండి: లెజండరీ ఓపెనర్‌ దిల్షాన్‌.. డీకే మాదిరే! ఉపుల్‌ తరంగతో భార్య ‘బంధం’.. అతడినే పెళ్లాడి!
ధోని నమ్మకం నిలబెట్టిన ప్రపంచకప్‌ విజేత, 2 సార్లు ఐపీఎల్‌ ‘విన్నర్‌’.. ఇప్పుడు పోలీస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement