మోర్కెల్
సాక్షి, స్పోర్ట్స్ : దక్షిణాఫ్రికా పేసర్ మోర్నీ మోర్కెల్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో 300 వికెట్ల పడగొట్టిన ఐదో సాఫారీ టెస్ట్ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. అంతకు ముందు అల్లాన్ డోనాల్డ్ (330), షాన్ పొలాక్ (421), మఖాయ ఎన్తినీ(390), డేల్ స్టేయిన్(419)లు ఈ ఘనతను సొంతం చేసుకున్న జాబీతాలో ఉన్నారు.
తాజాగా ఆసీస్‌తో జరుగుతున్న టెస్టు రెండో రోజు ఆటలో మోర్కెల్ ఆసీస్ బ్యాట్స్‌మన్ ఖాజా, స్మిత్, మార్ష్‌లను అవుట్ చేసి ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇక ఆట అనంతరం మోర్కెల్ మాట్లాడుతూ.. ఈ రికార్డు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికాకు ఆడటమే ప్రత్యేకమన్న మోర్కెల్.. భారత్‌పై అరంగేట్ర మ్యాచ్, టెస్టుల్లో నెం1గా నిలవడం, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లను వారి సొంత గడ్డలపై ఓడించడం తన జీవితంలో మరిచిపోలేని అనుభూతి ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 311 ఆలౌట్
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 207/8
Comments
Please login to add a commentAdd a comment