పాకిస్తాన్ బౌలర్లపై ఆ దేశ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఘాటు విమర్శలు చేశాడు. అహంభావం పెరిగిపోయి.. ఆటను, కోచ్‌లను కూడా లెక్కచేయని స్థితికి చేరారని మండిపడ్డాడు. అందుకు జట్టు పరాజయాల రూపంలో భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
వరుస వైఫల్యాలతో..
గత కొంతకాలంగా పాక్ క్రికెట్ జట్టు వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. వన్డే వరల్డ్‌కప్-2023లో సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టిన బాబర్ సేన.. టీ20 ప్రపంచకప్-2024లోనూ మరీ దారుణంగా నిరాశపరిచింది. పసికూన అమెరికా చేతిలో ఓటమి కారణంగా కనీసం సూపర్-8 దశకు చేరకుండానే నిష్క్రమించింది. ఇక ద్వైపాక్షిక సిరీస్‌లనూ ఇదే తంతు.
ఆస్ట్రేలియలో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన షాన్ మసూద్ బృందం.. ఇటీవల సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో సిరీస్‌లోనూ అదే ఫలితం పునరావృతం చేసింది. పాక్ టెస్టు చరిత్రలో మొట్టమొదటిసారిగా బంగ్లా చేతిలో మ్యాచ్ ఓడటమే కాకుండా.. 2-0తో క్లీన్‌స్వీప్ అయింది.
టీమిండియా వరుస విజయాలతో
మరోవైపు.. పాకిస్తాన్ చిరకాల ప్రత్యర్థిగా భావించే టీమిండియా ఇటీవలే పొట్టి వరల్డ్‌కప్ రెండోసారి సొంతం చేసుకోవడంతో పాటు... వరుస విజయాలతో దూసుకుపోతూ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్‌కు చేరవవుతోంది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ తమ జట్టు బౌలర్లను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
మోర్నీ మోర్కెల్ ఎందుకూ కొరగాడు అన్నట్లుగా
‘‘పాకిస్తానీ బౌలర్లు ... క్రికెట్ కంటే కూడా తామే గొప్ప అన్నట్లుగా భావిస్తారు. తమ ముందు మోర్నీ మోర్కెల్ ఎందుకూ కొరగాడు అన్నట్లుగా ప్రవర్తించారు. సొంతగడ్డపై బంగ్లాదేశ్ మమ్మల్ని ఓడించింది. అదే భారత్‌లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆటగాళ్ల ఆలోచనా విధానం, ప్రవర్తనపైనే అంతా ఆధారపడి ఉంటుంది’’ అని బసిత్ అలీ పాకిస్తాన్ పేసర్లు షాహిన్ ఆఫ్రిది, నసీం షా, హారిస్ రవూఫ్‌లను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశాడు.
బౌలింగ్ కోచ్‌గా
టీమిండియా ప్రస్తుత పేస్ దళం పాక్ దిగ్గజాలు వసీం అక్రం, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్‌ల మాదిరి అద్భుతంగా ఉందని బసిత్ అలీ ఈ సందర్భంగా కొనియాడాడు. కాగా గతేడాది వరకు పాక్ బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన సౌతాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్.. ప్రస్తుతం టీమిండియా తరఫున విధులు నిర్వర్తిస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు సందర్భంగా బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
చదవండి: Ind vs Ban: ఈ మ్యాచ్‌లో క్రెడిట్ మొత్తం వాళ్లకే: పాక్ మాజీ క్రికెటర్
Ind vs Aus: ప్రపంచంలోనే బెస్ట్ ఫాస్ట్ బౌలర్.. మాకు కష్టమే: స్మిత్
Comments
Please login to add a commentAdd a comment