
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ప్రారంభానికి ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. తండ్రి హఠాన్మరణం కారణంగా భారత జట్టు బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్వదేశానికి వెళ్లిపోయాడు. మోర్కెల్.. టీమిండియాతో కలిసి ఫిబ్రవరి 15న భారత్ నుంచి దుబాయ్‌కు వచ్చాడు. ఫిబ్రవరి 16న తొలి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్న మోర్నీ.. ఆతర్వాత తండ్రి మరణవార్త విని సౌతాఫ్రికాకు బయల్దేరాడు. మోర్నీ తిరిగి భారత బృందంతో ఎప్పుడు కలుస్తాడనే విషయంపై క్లారిటీ లేదు. మోర్నీ లేని లోటు టీమిండియా పేస్ విభాగంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
40 ఏళ్ల మోర్నీ గతేడాది సెప్టెంబర్‌లో భారత పేస్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. మోర్నీ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత పేస్ విభాగం మరింత పటిష్టమైంది. మోర్నీ అండర్‌లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా రెచ్చిపోయాడు. ఇటీవల జరిగిన ఇంగ్లండ్ సిరీస్‌లో యువ పేసర్ హర్షిత్ రాణా సత్తా చాటాడు. మోర్నీ ఆథ్వర్యంలోనే హర్షిత్ రాటుదేలాడు.
కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న ఆడనున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో టీమిండియా.. బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ సమయానికైనా మోర్నీ అందుబాటులోకి రావాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. దీని తర్వాత భారత్.. మార్చి 2న న్యూజిలాండ్‌తో ఫైనల్ గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడుతుంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో జరుగనుండగా.. మిగతా మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్‌లో జరుగుతాయి. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి.