
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో వరుస విజయాలతో అదరగొడుతున్న టీమిండియాకు ఓ గుడ్ న్యూస్ అందింది. ఈ మెగా టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కల్ తిరిగి జట్టుతో చేరాడు. కాగా ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు మోర్కల్ వ్యక్తిగత కారణాల రీత్యా తన స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని బంగ్లాతో మ్యాచ్‌కు ముందు ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో భారత హెడ్‌కోచ్ గౌతం గంభీర్ వెల్లడించాడు.
మొదటి రెండు మ్యాచ్‌ల్లో బౌలింగ్ కోచ్ లేకుండానే భారత్ బరిలోకి దిగింది. అయితే తన తండ్రి హఠాన్మరణం కారణంగా దక్షిణాఫ్రికాకు వెళ్లిన మోర్కల్.. దాదాపు వారం రోజుల తర్వాత తిరిగి దుబాయ్‌కు చేరుకున్నాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు ముందు అతడి నేతృత్వంలో భారత ఫాస్ట్ బౌలర్లు చెమటోడ్చుతున్నారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 40 ఏళ్ల మోర్నీ గతేడాది సెప్టెంబర్‌లో భారత పేస్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. మోర్నీ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత పేస్ విభాగం మరింత పటిష్టమైంది. ఇక భారత్‌కు మరో శుభవార్త కూడా అందింది.
పంత్ ఫుల్ ఫిట్..
నెట్ ప్రాక్టీస్‌లో గాయపడిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు పంత్ మోకాలికి గాయమైంది. దీంతో అతడు మూడు రోజుల పాటు ప్రాక్టీస్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో పంత్ తన ప్రాక్టీస్‌ను తిరిగి మొదలు పెట్టాడు.
కాగా కేఎల్ రాహుల్ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా ఉండడంతో పంత్ తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమయ్యాడు. కివీస్‌తో మ్యాచ్‌కు కూడా పంత్‌ను పక్కనే పెట్టే అవకాశముంది. ఇక మార్చి 2న భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడతోంది. ఇప్పటి ఈ రెండు జట్లు తమ సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకున్నాయి.
చదవండి: #Joe Root: చరిత్ర సృష్టించిన జో రూట్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
Comments
Please login to add a commentAdd a comment