అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ చేస్తూ ఇబ్బంది పడిన విషయం సంగతి తెలిసిందే. రెండో రోజు ఆటలో బుమ్రా తొడ కండరాలు పట్టేశాయి.
దీంతో బౌలింగ్ చేయడానికి వచ్చిన బుమ్రా నొప్పితో కిందపడిపోయాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించడంతో బుమ్రా మళ్లీ తన బౌలింగ్‌ను కొనసాగించాడు. దీంతో భారత అభిమానులు ఆందోళన చెందారు.
తాజాగా బుమ్రా గాయంపై భారత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రాకు ఎలాంటి గాయం కాలేదని, అతడు కొంచెం నొప్పితో బాధపడ్డాడని మోర్కెల్ స్పష్టం చేశాడు.
"బుమ్రాకు ఎటువంటి గాయం కాలేదు. అతడు బాగానే ఉన్నాడు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అతనికి తిమ్మిర్లు వచ్చాయి. అందుకే ఫిజియో వచ్చి చికిత్స అందించాడు. ఆ తర్వాత అతడు తన బౌలింగ్‌ను కొనసాగించి వికెట్లు కూడా తీశాడు.
టెస్టు క్రికెట్‌లో ఆటగాళ్ల గాయాలను దాచలేమని" విలేకరుల సమావేశంలో మోర్కల్ పేర్కొన్నాడు. కాగా జస్ప్రీత్ బుమ్రా భారత జట్టులో ప్రధాన బౌలర్‌గా కొనసాగతున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్‌లో తన మార్క్‌ను ఈ సౌరాష్ట్ర పేసర్ చూపించాడు. మొత్తం మూడు ఇన్నింగ్స్‌లో 11 వికెట్లు పడగొట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment