
వన్డే ప్రపంచకప్-2023లో పాకిస్తాన్ కథ ముగిసింది. ఈ మెగా టోర్నీ సెమీఫైనల్ రేసు నుంచి పాకిస్తాన్ అధికారికంగా నిష్క్రమించింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 332 పరుగుల లక్ష్యాన్ని 6. 4 ఓవర్లలో చేజ్ చేయకపోవడంతో పాక్.. ఈ టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది.
కాగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు సెమీస్‌కు చేరాలంటే కొన్ని సమీకరణాలు ఉండేవి. పాక్ ముందుగా బ్యాటింగ్ చేస్తే 287 పరుగుల తేడాతో గెలవాలి. ఒకవేళ ఛేజింగ్ చేస్తే టార్గెట్ బట్టి ఎన్ని ఓవర్లలో పూర్తి చేయాలన్నది నిర్ణయిస్తారు. ఉదాహరణకు ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసి 300 పరుగులు సాధిస్తే.. 6.1 ఓవర్లలో ఛేజ్ చేయాలి.
6.4 ఓవర్లలో 338 టార్గెట్..
అయితే ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ఏకంగా 337 పరుగులు చేసింది. దీంతో ఐసీసీ సమీకరణాల ప్రకారం.. పాకిస్తాన్ సెమీస్‌కు చేరాలంటే లక్ష్యాన్ని కేవలం 6.4 ఓవర్లలో ఛేదించాలి. పాక్ 6.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి కేవలం 30 పరుగులు చేసింది. దీంతో పాకిస్తాన్ ప్రపంచకప్ నుంచి సెమీస్ చేరకుండానే టోర్నీ నుంచి ఔటైంది.
భారత్ వర్సెస్ న్యూజిలాండ్
పాకిస్తాన్ ఇంటముఖం పట్టడంతో.. న్యూజిలాండ్ నాలుగో జట్టుగా ఈ మెగా టోర్నీలో సెమీఫైన్‌లకు అర్హత సాధించింది. నవంబర్ 15న వాంఖడే వేదికగా తొలి సెమీఫైనల్లో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అనంతరం రెండో సెమీఫైనల్లో కోల్‌కతా వేదికగా ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా జట్లు తాడోపేడో తేల్చుకోనున్నాయి.
చదవండి: World Cup 2023: పాకిస్తాన్ బౌలర్ అత్యంత చెత్త రికార్డు.. 48 ఏళ్ల వరల్డ్‌కప్ చరిత్రలోనే