పాకిస్తాన్‌ బౌలర్‌ అత్యంత చెత్త రికార్డు.. 48 ఏళ్ల వరల్డ్‌కప్‌ చరిత్రలోనే | Pakistan pacer Haris Rauf sets unwanted World Cup record | Sakshi
Sakshi News home page

World Cup 2023: పాకిస్తాన్‌ బౌలర్‌ అత్యంత చెత్త రికార్డు.. 48 ఏళ్ల వరల్డ్‌కప్‌ చరిత్రలోనే

Published Sat, Nov 11 2023 7:01 PM | Last Updated on Sat, Nov 11 2023 7:13 PM

Pakistan pacer Haris Rauf sets unwanted World Cup record  - Sakshi

పాకిస్తాన్‌ స్టార్‌ పేసర్‌ హ్యారీస్‌ రవూఫ్‌ అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌ ఎడిషన్‌ లీగ్‌ స్టేజిలోలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా రవూఫ్‌ నిలిచాడు. వన్డే ప్రపంచకప్‌-2023లో కోల్‌కతా వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో రవూప్‌ ఈ చెత్త రికార్డును సాధించాడు.

ఈ ఏడాది వరల్డ్‌కప్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన రవూఫ్‌ ఏకంగా 533 పరుగులిచ్చి.. ఈ ఆ ప్రతిష్టతను మూటకట్టుకున్నాడు. ఇప్పటివరకు ఈ చెత్త రికార్డు ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ అదిల్‌ రషీద్‌ పేరిట ఉండేది. 2019 వరల్డ్‌కప్‌లో రషీద్‌ 11 మ్యాచ్‌ల్లో 526 పరుగులు సమర్పించుకున్నాడు.

తాజా వరల్డ్‌కప్‌తో రషీద్‌ చెత్త రికార్డును రవూఫ్‌ బ్రేక్‌ చేశాడు. ఈ జాబితాలో రవూఫ్‌ అగ్రస్ధానంలో కొనసాగుతుండగా.. రషీద్‌, శ్రీలంక పేసర్‌ మధుషంక మూడో స్ధానంలో కొనసాగుతున్నారు. మధుషంక కూడా ఈ వరల్డ్‌కప్‌లోనే 525 పరుగులిచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు 9 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరు చేసింది. 

ఇంగ్లండ్‌ బ్యాటర్లలో బెన్‌ స్టోక్స్‌(84) పరుగులతో మరోసారి అద్బుత ఇన్నింగ్స్‌ ఆడగా.. జోరూట్‌(60), జానీ బెయిర్‌ స్టో(59) పరుగులతో రాణించారు. ఆఖరిలో హ్యారీ బ్రూక్‌(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30), డేవిడ్‌ విల్లీ(5 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 15) మెరుపులు మెరిపించాడు.  పాకిస్తాన్‌ బౌలర్లలో హ్యారీస్‌ రవూఫ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. షాహీన్‌ అఫ్రిది, వసీం తలా రెండు వికెట్లు సాధించారు. ఇఫ్తికర్‌ అహ్మద్‌కు ఒక వికెట్‌ దక్కింది.
చదవండి: World Cup 2023: మిచెల్‌ మార్ష్‌ విధ్వంసకర శతకం.. బంగ్లాపై ఆసీస్‌ ఘన విజయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement