
వన్డే వరల్డ్‌కప్-2023లో సెమీఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. ఈ మెగా టోర్నీ సెమీఫైనల్స్‌కు భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు అర్హత సాధించాయి. ఈ మెగా టోర్నీ నుంచి పాకిస్తాన్ నిష్కమ్రిచండంతో న్యూజిలాండ్ నాలుగో జట్టుగా కివీస్ సెమీస్‌కు క్వాలిఫై అయింది.
నవంబర్ 15న ముంబై వాంఖడే స్టేడియంలో తొలి సెమీఫైనల్లో ఆతిథ్య భారత్‌తో న్యూజిలాండ్ తలపడనుంది. నవంబర్ 16న కోల్‌కతా ఈడెన్‌గార్డెన్స్‌లో రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. కాగా 2019 వరల్డ్‌కప్ సెమీఫైనల్లోనూ భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
చదవండి: World Cup 2023: పాకిస్తాన్ బౌలర్ అత్యంత చెత్త రికార్డు.. 48 ఏళ్ల వరల్డ్‌కప్ చరిత్రలోనే