పాకిస్థాన్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ!
మూలిగే నక్కపై తాటిపండు పడటమంటే ఇదే కావొచ్చు.
మూలిగే నక్కపై తాటిపండు పడటమంటే ఇదే కావొచ్చు. టీమిండియాతో ప్రతిష్టాత్మక పోరులో చిత్తుగా ఓడి.. తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్ వహబ్ రియాజ్ చీలమండ (అంకిల్) గాయం కారణంగా పూర్తిగా చాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీని చేదు అనుభవంతో పాక్ జట్టు ప్రారంభించిన సంగతి తెలిసిందే. భారత్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 124 పరుగుల తేడాతో ఆ జట్టు ఘోర ఓటమిని మూటగట్టుకుంది.
ఇక భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో రియాజ్ ఘోరంగా విఫలమయ్యాడు. 8.4 ఓవర్లలోనే అతను 87 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో బౌలింగ్ చేస్తూ ఈ మ్యాచ్‌లోనే అతను గాయపడి.. మధ్యలోనే మైదానం నుంచి వీడాడు.